Police Complaint : హెలికాప్టర్ ఎగరడం లేదని పోలీసులకు బుడ్డోడు పిర్యాదు..అసలు ట్విస్ట్ ఇదే !
Police Complaint : జాతరలో కొనుగోలు చేసిన హెలికాప్టర్ బొమ్మ (Helicopter Toy) పైకి ఎగరడం లేదని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు (Police Complaint) చేయడం
- By Sudheer Published Date - 03:30 PM, Tue - 22 April 25

సంగారెడ్డి జిల్లాలోని కంగ్టి మండల కేంద్రంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పదేళ్ల వినయ్ రెడ్డి (Vinay Reddy) అనే బాలుడు.. జాతరలో కొనుగోలు చేసిన హెలికాప్టర్ బొమ్మ (Helicopter Toy) పైకి ఎగరడం లేదని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు (Police Complaint) చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. తనకు నచ్చిన బొమ్మ హెలికాప్టర్ పనిచేయకపోవడం, షాపు యజమాని డబ్బులు తిరిగివ్వకపోవడం వల్ల బాలుడు తీవ్రంగా నిరాశకు లోనయ్యాడు.
IRCTC Special Package : సరస్వతి పుష్కరాల కోసం IRCTC ప్రత్యేక ప్యాకేజ్
వివరాల్లోకి వెళితే… జాతర సందర్భంగా వినయ్ రెడ్డి తన తాతయ్యతో కలిసి జాతరకు వెళ్లాడు. అక్కడ ఒక బొమ్మల దుకాణంలో రూ.300 పెట్టి హెలికాప్టర్ బొమ్మ కొనుగోలు చేశాడు. కానీ అది ఎగరకపోవడంతో మరుసటి రోజు దుకాణానికి వెళ్లి మార్చుకున్నాడు. అయినా రెండో బొమ్మ కూడా పనిచేయలేదు. మూడోసారి కూడా అదే పరిస్థితి ఎదురవడంతో, బాలుడు తాను మోసపోయానని భావించి పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నాడు.
వినయ్ రెడ్డి ఫిర్యాదును గమనించిన పోలీసులు స్పందించి.. దుకాణం వద్దకు కానిస్టేబుల్‌ను పంపారు. అయితే అప్పటికే బొమ్మల షాపు యజమాని అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. ఆపై బాలుడి తాతను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వివరాలు అడిగి, బాలుడికి ధైర్యం చెప్పి, చివరికి బాలుడిని సర్దిచెప్పి ఇంటికి పంపారు. ఈ ఘటన స్థానికంగా చర్చకు దారితీయడంతో పాటు, బాలుడి న్యాయపోరాటం పట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.