World Frying Pan Hotel : ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన హోటల్ ఎక్కడ ఉందో తెలుసా..?
World Frying Pan Hotel : ఇది అమెరికా యొక్క నార్త్ కరోలినా తీరానికి 32 మైళ్ల దూరంలో ఉంది. సముద్ర మట్టానికి 135 అడుగుల ఎత్తులో ఉన్న ఈ హోటల్, అద్భుతమైన ప్రకృతి అందాలను అందిస్తుంది
- By Sudheer Published Date - 01:18 PM, Wed - 4 December 24

ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన హోటల్ (World’s Most DANGEROUS HOTEL) గురించి విన్నారా? ఈ హోటల్ పేరు “ఫ్రైయింగ్ పాన్ హోటల్” (World Frying Pan Hotel) . ఇది అమెరికా యొక్క నార్త్ కరోలినా తీరానికి 32 మైళ్ల దూరంలో ఉంది. సముద్ర మట్టానికి 135 అడుగుల ఎత్తులో ఉన్న ఈ హోటల్, అద్భుతమైన ప్రకృతి అందాలను అందిస్తుంది. ఇది ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని పర్యాటకులకు అందించే స్థలం.
ఫ్రైయింగ్ పాన్ హోటల్ అనేది సముద్రంలో మధ్యలో నిర్మించిన ఓ స్వతంత్ర లైటర్ ప్లాట్ఫామ్. ఇది నాలుగు స్థంబాల సపోర్ట్ పై నిర్మించబడింది. చుట్టూ గాలి, నీటిలో సొరచేపలు ఉండటం తో ఇది ప్రమాదకర హోటల్ అని అంత చెపుతుంటారు. సుదూర ప్రాంతంలో ఉన్న ఈ హోటల్ కు చేరుకోవడం చాలా కష్టం. పర్యాటకులు అందుకు హెలికాప్టర్ లేదా బోట్ ద్వారా మాత్రమే చేరుకుంటారు. ఈ హోటల్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇది ఒక పర్యాటకులకు ప్రమాదకరమైన అనుభవాన్ని ఇవ్వటమే కాకుండా, వారి అడ్వంచర్ మరియు ధైర్యాన్ని పరీక్షించేందుకు అనువైన ప్రదేశంగా ఉంటుంది. సముద్రం, ఎగిసిపడుతున్న అలల మధ్యలో ఒక పెద్ద హోటల్ కట్టడం అత్యంత సాహసికమైన పని. ఫ్రైయింగ్ పాన్ హోటల్ యొక్క విశేషం ఇది. ఇది గోల్‌పోస్ట్ వంటి నిర్మాణాన్ని పోలి ఉంటుంది. ఇది ఒక ప్రత్యేకమైన “మాయాజాల” ప్రాంతంగా కూడా పరిగణించబడుతుంది. దీని సహాయంతో పర్యాటకులు అసాధారణమైన ప్రకృతి దృశ్యాలను చూసి, సంతోషం వ్యక్తం చేస్తుంటారు.
ఈ హోటల్ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన స్థలాల్లో ఒకటిగా గుర్తించబడింది. అయితే, యాత్రికులు ఇక్కడికి రావడాన్ని ఇష్టపడటమే కాకుండా, తమ జీవితంలో ప్రత్యేకమైన అనుభవాన్ని పొందటానికి ఈ హోటల్ సందర్శించడం అనేది చేస్తుంటారు.
Read Also : CM Chandrababu New House In Amaravati: అమరావతిలో స్థలం కొనుగోలు చేసిన సీఎం చంద్రబాబు.. ఎంత విస్తీర్ణం అంటే…