WhatsApp microphone access :వాట్సాప్ మైక్ చెవులు.. మీ మాటల్ని వింటున్నాయా?
స్మార్ట్‌ఫోన్ యూజర్ల మైక్రోఫోన్‌ను వాట్సాప్ యాక్సెస్ (WhatsApp microphone access) చేస్తోందని.. ఫోన్ వినియోగంలో లేనప్పుడు కూడా దాన్ని యాక్సెస్ చేస్తోందనే వాదనపై కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ బుధవారం స్పందించారు.
- Author : Pasha
Date : 10-05-2023 - 6:00 IST
Published By : Hashtagu Telugu Desk
స్మార్ట్‌ఫోన్ యూజర్ల మైక్రోఫోన్‌ను వాట్సాప్ యాక్సెస్ (WhatsApp microphone access) చేస్తోందని.. ఫోన్ వినియోగంలో లేనప్పుడు కూడా దాన్ని యాక్సెస్ చేస్తోందనే వాదనపై కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ బుధవారం స్పందించారు. ఇది వినియోగదారుల ప్రైవసీకి సంబంధించిన అంశం అయినందున ప్రభుత్వం విచారణ జరుపుతుందని, ఆ ఆరోపణలపై దృష్టిసారిస్తుందని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ ట్వీట్ పై మెటా డైరెక్టర్, హెడ్ ఆఫ్ ఇండియా (పబ్లిక్ పాలసీ) శివనాథ్ తుక్రాల్ బదులిస్తూ.. “ఇది ఆండ్రాయిడ్‌లో వచ్చిన బగ్ వల్ల ఏర్పడిన సమస్య. ప్రస్తుతం దానికి పరిష్కారం వెతికే పనిలోనే ఉన్నాం. ఆండ్రాయిడ్‌లో వచ్చిన బగ్ పై విచారణ జరపాలని గూగుల్‌ను కూడా కోరాం. వాట్సాప్ లోని వాయిస్ నోట్స్, కాల్‌లు అన్నీ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా రక్షించబడతాయి” అని వెల్లడించారు.
also read : whatsapp new features : వాట్సప్ లో మరో 2 అట్రాక్టివ్ ఫీచర్స్
ట్విట్టర్ ఇంజనీరింగ్ డైరెక్టర్ ఏమన్నాడు ?
“నేను నిద్రలో ఉన్నప్పుడు కూడా వాట్సాప్ బ్యాక్‌గ్రౌండ్‌లో మైక్రోఫోన్‌ను(WhatsApp microphone access) వాడుతోంది. నేను ఉదయం 6 గంటలకు లేస్తాను.. మార్నించ్ లేచి చూసే సరికి మైక్రోఫోన్ ఆన్ అయ్యి ఉండడం నేను గమనించాను ” అంటూ ట్విట్టర్‌లో ఇంజనీరింగ్ డైరెక్టర్ గా వ్యవహరించే ఫోడ్ డబిరి శనివారం ట్వీట్ చేయడం కలకలం రేపింది. అది వైరల్ గా మారింది. సర్వత్రా దానిపై చర్చ మొదలైంది. దీంతో బుధవారం కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. ఇక ట్విట్టర్ ఇంజనీరింగ్ డైరెక్టర్ వివాదాస్పద ట్వీట్ ను.. ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ రీట్వీట్ చేశారు. దేన్నీ నమ్మొద్దు.. చివరకు దేన్ని కూడా (నథింగ్ ట్రస్ట్.. నాట్ ఈవెన్ నథింగ్) అని కామెంట్ పెట్టారు.