Asha Shobana : ట్రెండింగ్‌లో శోభనా ఆశ.. ఎవరామె ?
Asha Shobana : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్పిన్నర్ ‘శోభనా ఆశ’ పేరు ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.
- Author : Pasha
Date : 25-02-2024 - 12:40 IST
Published By : Hashtagu Telugu Desk
Asha Shobana : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్పిన్నర్ ‘శోభనా ఆశ’ పేరు ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ఆమె గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు. తాజాగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఆర్సీబీ తన తొలి మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో స్పిన్నర్ శోభనా ఆశ 5 వికెట్లతో విజృంభించి యూపీ వారియర్స్ పతనాన్ని శాసించింది. దీంతో డబ్ల్యూపీఎల్ హిస్టరీలో 5 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా శోభన రికార్డులకు ఎక్కింది. ఒకే ఒక్కఅత్యుత్తమ ప్రదర్శనతో శోభనా ఆశ(Asha Shobana) మహిళల క్రికెట్‌లో సంచలనంగా మారింది.
We’re now on WhatsApp. Click to Join
- శోభనా ఆశ కేరళలోని త్రివేండ్రంలో 1991లో జన్మించింది.
- శోభనా ఆశ తండ్రి డ్రైవర్.
- పేద కుటుంబంలో పుట్టిన శోభనకు చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే ఇష్టం.
- క్రికెట్ దిగ్గజం సచిన్ స్ఫూర్తితో క్రికెట్ వైపు శోభన అడుగులు వేసింది.
- 1998లో షార్జాలో ఆస్ట్రేలియాపై సచిన్ ఆడిన ఇన్నింగ్స్ ఆమెకు స్ఫూర్తి ఇచ్చింది.
- 13 ఏళ్ల వయసులో త్రివేండ్రమ్ తరపున క్రికెట్ కెరీర్‌ను శోభన మొదలుపెట్టింది.
- ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ స్టువర్ట్ మెక్‌గిల్ ఆమెకు ఫేవరెట్ క్రికెటర్.
- దేశవాళీ క్రికెట్‌లో కేరళ, పుదుచ్చేరి, రైల్వేస్ తరపున శోభనా ఆశ ప్రాతినిధ్యం వహించింది.
- 32 ఏళ్ల శోభన.. దేశవాళీ క్రికెట్‌లో ఆల్‌రౌండర్‌గా తనదైన ముద్ర వేసింది.
Also Read : 254 Jobs : నేవీలో 254 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ల జాబ్స్ .. జీతం రూ.56వేలు
గతేడాది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) సీజన్‌లో శోభనను బెంగళూరు టీమ్ రూ.10 లక్షలకు కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లో శోభన 5 మ్యాచ్‌లు ఆడిన ఐదు వికెట్లు తీసింది. రెండో సీజన్‌కు కూడా బెంగళూరు టీమ్ ఆమెను కంటిన్యూ చేసింది. అయితే తాజాగా డబ్ల్యూపీఎల్ రెండో సీజన్‌ను ఆమె అద్భుతంగా ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు సాధించింది. మిగతా మ్యాచ్‌ల్లోనూ శోభన అదరగొడితే భారత జాతీయ జట్టుకు కూడా ఎంపికవుతుందని క్రీడా పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.