HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >254 Short Service Commission Officer Jobs In Navy Starting Salary 56k

254 Jobs : నేవీలో 254 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ల జాబ్స్ .. జీతం రూ.56వేలు

254 Jobs : ఇండియన్ నేవీలో 254 షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

  • By Pasha Published Date - 11:14 AM, Sun - 25 February 24
  • daily-hunt
Agniveer Yojana Changes
Agniveer Yojana Changes

254 Jobs : ఇండియన్ నేవీలో 254 షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌లో 136 పోస్టులు, ఎడ్యుకేషన్ బ్రాంచ్‌లో 18 పోస్టులు, టెక్నికల్ బ్రాంచ్‌లో 100 పోస్టులు(254 Jobs)  ఉన్నాయి. సరైన అర్హతలున్న అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఈ జాబ్స్‌కు అప్లై చేయొచ్చు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 24న ప్రారంభమైంది. మార్చి 24 వరకు అప్లికేషన్లను స్వీకరిస్తారు. సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికయ్యే వారికి కేరళ రాష్ట్రంలోని ఎజిమలలో ఉన్న  ‘ఇండియన్ నేవీ అకాడమీ’లో 2025 జనవరిలో ప్రారంభమయ్యే కోర్సు(ST-25)లో అడ్మిషన్ కల్పిస్తారు. ఎస్​ఎల్​టీ బేసిక్ పే కింద రూ.56,100 ఇస్తారు. దీంతోపాటు ఇతర అలవెన్సులూ ఉంటాయి. ఈ ఎంపిక ప్రక్రియలో NCC (C సర్టిఫికేట్) అభ్యర్థులకు 5 శాతం మినహాయింపు కల్పిస్తారు. నేవీలో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్నవారు కూడా అప్లై చేయొచ్చు.

We’re now on WhatsApp. Click to Join

ఎగ్జిక్యూటివ్ బ్రాంచి 136 పోస్టుల్లో

  • ఇండియన్ నేవీలోని ఎగ్జిక్యూటివ్ బ్రాంచిలో 136 పోస్టులు ఉండగా.. వీటిలో  జనరల్ సర్వీస్ పోస్టులు 50 ఉన్నాయి. 60 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో బీఈ/బీటెక్ పాసైన వారు అర్హులు.  02.01.2000 నుంచి 01.07.2005  మధ్య జన్మించిన వారు అప్లై చేయొచ్చు.
  • ఇండియన్ నేవీలోని ఎగ్జిక్యూటివ్ బ్రాంచిలో 136 పోస్టులు ఉండగా.. 20 పైలట్ పోస్టులు ఉన్నాయి. 60 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో బీఈ/బీటెక్ పాసై ఉండాలి. 02.01.2001 నుంచి  01.01.2006 మధ్య జన్మించినవారు అప్లై చేయొచ్చు. డీజీసీఏ జారీచేసిన పైలట్ లైసెన్స్ కలిగి ఉన్నవారు కూడా అప్లై చేయొచ్చు. 02.01.2000 నుంచి  01.01.2006 మధ్య జన్మించిన వారు అప్లై చేయొచ్చు.
  • ఇండియన్ నేవీలోని ఎగ్జిక్యూటివ్ బ్రాంచిలో నేవల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ పోస్టులు 18 ఉన్నాయి.
  • ఇండియన్ నేవీలోని ఎగ్జిక్యూటివ్ బ్రాంచిలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ పోస్టులు 08 ఉన్నాయి.
  • ఇండియన్ నేవీలోని ఎగ్జిక్యూటివ్ బ్రాంచిలో లాజిస్టిక్స్ పోస్టులు  30 ఉన్నాయి.
  • ఇండియన్ నేవీలోని ఎగ్జిక్యూటివ్ బ్రాంచిలో నేవల్ ఆర్మమెంట్ ఇన్‌స్పెక్టరేట్ కేడర్ పోస్టులు 10  ఉన్నాయి.

Also Read : Allu Ayan: షారుక్ ఖాన్ పాటను అద్భుతంగా పాడిన అల్లు అయాన్.. నెట్టింట వీడియో వైరల్?

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: క్వాలిఫయింగ్ డిగ్రీలో సాధించిన సాధారణ మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్​ లిస్ట్​ అయిన అభ్యర్థులకు ఎస్​ఎస్​బీ ఇంటర్వ్యూకు ఎంపికైన విషయాన్ని ఈ-మెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తారు. ఖాళీల లభ్యత, సంబంధిత ప్రవేశానికి మెడికల్ క్లియరెన్స్ ఆధారంగా అన్ని ఎంట్రీలకు ఎస్ఎస్​బీ మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందిస్తారు. మెడికల్ ఎగ్జామినేషన్​లో ఫిట్​గా తేలిన అభ్యర్థులను ఎంట్రీలో ఖాళీల లభ్యతను బట్టి నియమిస్తారు.

శిక్షణ వివరాలు..

➥ షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్లుగా ఎంపికైన అభ్యర్థులకు సబ్-లెఫ్టినెంట్ హోదాలో వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభమయ్యే కోర్సుకు ప్రవేశాలు కల్పిస్తారు.

➥ అవివాహిత పురుష, స్త్రీ అభ్యర్థులను మాత్రమే శిక్షణకు ఎంపికచేస్తారు. ఒకవేళ శిక్షణ సమయంలో వివాహం జరుగుతున్నట్లు తెలిసినా, వివాహం అయినట్లు తెలిసినా.. శిక్షణ నుంచి తొలగిస్తారు. అప్పటిదాకా వారిమీద పెట్టిన ఖర్చు మొత్తాన్ని వసూలుచేస్తారు.

➥ స్వచ్ఛందంగా శిక్షణ నుంచి ప్రారంభదశలో లేదా ప్రొబేషన్ పీరియడ్‌లో వెనుదిరగాలనుకునే వారు శిక్షణ కాలానికయ్యే మొత్తం ఖర్చును కూడా చెల్లించాల్సి ఉంటుంది.

➥ ఫ్లైయిండ్ ట్రెయినింగ్‌లో(Pilot/NAOO) అర్హత సాధించలేకపోయిన అభ్యర్థులను సర్వీసు నుంచి తొలగిస్తారు.

ప్రారంభ వేతనం: ఎస్​ఎల్​టీ బేసిక్ పే కింద రూ.56,100 ఇస్తారు. దీంతోపాటు ఇతర అలవెన్సులూ ఉంటాయి.

ముఖ్యమైన తేదీలు

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 24.02.2024

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 10.03.2024

Also Read : Ayodhya Ram Mandir : అయోధ్యలోని బాలక్ రామ్ మందిరం కొత్త రికార్డులు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 254 Jobs
  • Indian Navy
  • jobs
  • Salary 56K
  • Short Service Commission Officer Jobs
  • SSC Officer Jobs

Related News

Indian Skill Report 2026.

Indian Skill Report 2026 : దేశంలోని 56.35% మంది పనిచేయడానికి ఇష్టపడుతోన్న మహిళలు!

దేశంలో ఉద్యోగాలు చేయడానికి అవసరమైన నైపుణ్యాలు కలిగిన యువత 56.35 శాతం మంది ఉన్నారని తాజా నివేదిక చెబుతోంది. 2022తో పోల్చితే ఇది దాదాపు 2 శాతం అధికమని తెలిపింది. ఇక, నైపుణ్యాల ఎక్కువగా కలిగిన రాష్ట్రాల్లో ఉత్తర్ ప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. అలాగే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మహిళల ఉద్యోగర్హతలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ముఖ్యంగా మహిళలు పురుషులను అధిగమించడం విశేషం. ఏఐ విన

    Latest News

    • Grama Sarpanch Nomination : తొలిరోజు నామినేషన్లు ఎన్నో తెలుసా?

    • Hyderabad Book Fair : పుస్తక ప్రియులకు గుడ్ న్యూస్.. ‘పుస్తకాల పండుగ’ మళ్లీ వచ్చేస్తోంది

    • ACE Unit : కుప్పంలో రూ.305 కోట్లతో ACE యూనిట్

    • Delhi Air Pollution: వణికిపోతున్న ఢిల్లీ ప్రజలు..నగరం వదిలివెళ్లాల్సిందే !!

    • Back Pain: వెన్ను నొప్పితో బాధపడుతున్నారా? ఉపశమనం పొందండిలా!

    Trending News

      • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

      • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

      • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

      • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

      • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd