HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Trending
  • >Waqf Amendment Bill Is An Attack On The Constitution

Sonia Gandhi : వక్ఫ్‌ సవరణ బిల్లు..రాజ్యాంగంపై దాడి చేయడమే

వక్ఫ్‌ సవరణ బిల్లు రాజ్యాంగంపై దాడి చేయడమే. దిగువ సభలో ఈ బిల్లును తొక్కేశారు. మోడీ ప్రభుత్వం విద్య, పౌర హక్కులు, స్వేచ్ఛ, సమాఖ్య నిర్మాణం, ఎన్నికల నిర్వహణ ఏదైనా దేశాన్ని అగాధంలోకి లాగుతోంది. ఈసందర్భంగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడానికే ఒకే దేశం, ఒకే ఎన్నిక బిల్లును తీసుకొస్తున్నారని ఆరోపించారు. దీన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు.

  • By Latha Suma Published Date - 02:26 PM, Thu - 3 April 25
  • daily-hunt
Waqf Amendment Bill..is an attack on the Constitution
Waqf Amendment Bill..is an attack on the Constitution

Sonia Gandhi : గురువారం సంవిధాన్‌ సదన్‌లో జరిగిన కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పార్టీ ఎంపీలను ఉద్దేశిస్తూ కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె వక్ఫ్‌ (సవరణ) బిల్లు- 2025పై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం అనేది కేవలం కాగితాలకే పరిమితమైంది. దాన్ని కూడా కూల్చేయాలనేదే వారి ఉద్దేశమని మాకు తెలుసు. మోడీ ప్రభుత్వ వైఫల్యాలను, వారి ఉద్దేశాలను బహిర్గతం చేయాలి. ఏది సరైనది, ఏది న్యాయబద్ధమైనది అనేది ప్రజలకు తెలియజేసేందుకు అందరం కలిసి మన పోరాటాన్ని కొనసాగించాలి అని సోనియా పేర్కొన్నారు. వక్ఫ్‌ సవరణ బిల్లు రాజ్యాంగంపై దాడి చేయడమే. దిగువ సభలో ఈ బిల్లును తొక్కేశారు. మోడీ ప్రభుత్వం విద్య, పౌర హక్కులు, స్వేచ్ఛ, సమాఖ్య నిర్మాణం, ఎన్నికల నిర్వహణ ఏదైనా దేశాన్ని అగాధంలోకి లాగుతోంది. ఈసందర్భంగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడానికే ఒకే దేశం, ఒకే ఎన్నిక బిల్లును తీసుకొస్తున్నారని ఆరోపించారు. దీన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు.

Read Also: Yes Bank : కస్టమర్లకు షాక్ ఇచ్చిన YES బ్యాంక్

బీజేపీ సభ్యులు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలని టార్గెట్‌ చేశాయన్నారు. వారి వైఫల్యాలను ఎత్తిచూపే విషయంలో పార్టీ ఎంపీలు అంతే దూకుడుగా వ్యవహరించాలని ఈసందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. పార్లమెంటులో ప్రతిపక్షాలను మాట్లాడేందుకు సమయం ఇవ్వడం లేదని సోనియా ఆరోపించారు. కాంగ్రెస్‌ సభ్యులు తమ సమస్యలను లేవనెత్తనివ్వకుండా సభలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ సహా పార్టీ ఎంపీలందరూ హాజరయ్యారు.

కాగా, వక్ఫ్‌ (సవరణ) బిల్లు-2025 బుధవారం లోక్‌సభలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటు వేశారు. 56 ఓట్ల తేడాతో ప్రతిపక్షాల అభ్యంతరాలు వీగిపోయాయి. ఇక, రాజ్యసభలో ఈ బిల్లు ఇప్పుడు కీలకమైన పరీక్షను ఎదుర్కొంటోంది.ఇక్కడ ప్రస్తుత సభ్యుల మొత్తం బలం 236. బిల్లును ఆమోదించడానికి అధికార NDAకి 119 ఓట్లు అవసరం. స్వతంత్ర ,నామినేటెడ్ సభ్యుల మద్దతుతో, దాని సంఖ్య 125కి చేరుకుంటుంది. ప్రతిపక్షం వద్ద 95 ఓట్లు ఉండగా16 మంది సభ్యులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

Read Also: Kurnool Airport : కర్నూలు ఎయిర్ పోర్టుకు మహర్దశ

 

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • Congress Parliamentary Party meeting
  • constitution
  • sonia gandhi
  • Waqf Amendment Bill

Related News

CM Revanth Reddy

Revanth Reddy : నేను ఎవరి వెనుకా లేను..మీ కుటుంబ పంచాయితీలోకి మమ్మల్ని లాగొద్దు : సీఎం రేవంత్‌రెడ్డి

కవిత చెబుతున్నట్టు నేను ఆమె వెనుక ఉన్నానంటారు. ఇంకొందరు హరీశ్ రావు, సంతోష్ వెనుక ఉన్నానంటున్నారు. ఈ రాజకీయ పంచాయితీలు ప్రజలకు అవసరం లేదు. నన్ను మీ కుటుంబ, కుల రాజకీయాల్లోకి లాగొద్దు అని రేవంత్ స్పష్టంగా అన్నారు.

  • CM Revanth Reddy

    CM Revanth Reddy: రేపు కామారెడ్డి జిల్లాకు సీఎం రేవంత్‌.. షెడ్యూల్ ఇదే!

  • Kavitha

    Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి కవిత రాజీనామా!

  • KCR model is needed for agricultural development in the country: KTR

    KTR : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత కేటీఆర్ సవాల్

  • Ktr Assembly

    KTR : రాహుల్‌గాంధీ కంటే ముందే కులగణన చేయాలని చెప్పింది బీఆర్‌ఎస్సే

Latest News

  • Ganesh Visarjan : 16 కిలో మీటర్లు సాగనున్న బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర..

  • AP : అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలే: జగన్ కు రఘురామకృష్ణరాజు హెచ్చరిక

  • Shocking : ఎర్రకోటకే కన్నం వేసిన ఘనులు

  • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

  • Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd