Russia : విక్టరీ డే పరేడ్.. భారత ప్రధాని మోడీకి రష్యా ఆహ్వానం
ఈ వేడుకలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతారని తాము ఆశిస్తున్నట్లు ఆండ్రీ రుడెంకో తెలిపారు. ఇప్పటికే ఆహ్వానం పంపినట్లు.. పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఓ రష్యన్ వార్తా సంస్థ కూడా వెల్లడించింది.
- By Latha Suma Published Date - 02:57 PM, Wed - 9 April 25

Russia : భారత ప్రధాని నరేంద్ర మోడీని మే 9న నిర్వహించే “విక్టరీ డే” రేడ్ వేడుకల్లో పాల్గొనాలని రష్యా ఆహ్వానం పంపింది. ఈ మేరకు ఆ దేశ ఉప విదేశాంగ శాఖ మంత్రి ఆండ్రీ రుడెంకో వెల్లడించారు. ఈ వేడుకలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతారని తాము ఆశిస్తున్నట్లు ఆండ్రీ రుడెంకో తెలిపారు. ఇప్పటికే ఆహ్వానం పంపినట్లు.. పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఓ రష్యన్ వార్తా సంస్థ కూడా వెల్లడించింది. ఈ వేడుకల్లో పాల్గొనాలని రష్యా తమ మిత్ర దేశాలకు ఆహ్వానాలు పంపింది. రెండో ప్రపంచయుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా ఏటా ‘విక్టరీ డే’ మే 9న)ని రష్యా నిర్వహిస్తుంది. జర్మనీపై విజయం సాధించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రష్యా ఏర్పాట్లు చేస్తోంది.
Read Also: EX Minister Roja : కూటమి మంత్రి తో రోజా రహస్య మీటింగ్..? కారణం ఏంటి..?
కాగా, గత ఏడాది జులైలో ప్రధాని మోడీ రష్యాలో పర్యటించారు. గత పర్యటన సందర్భంగా భారత్‌లో పర్యటించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ప్రధాని మోడీ ఆహ్వానించారు. మోడీ ఆహ్వానాన్ని పుతిన్ అంగీకరించినప్పటికీ.. పర్యటన తేదీలు ఇంకా ఖరారు కాలేదు. ఇక పుతిన్, మోడీలు తరచూ ఫోన్‌లో వివిధ అంశాలపై సంభాషించుకుంటారన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ వేదికలపై కూడా ఇరువురు నేతలు సమావేశమవుతారు. 2019లో వ్లాడివోస్టాక్‌లో జరిగిన ఆర్థిక సదస్సుకు ప్రధాని హాజరయ్యారు. దాదాపు ఐదేళ్ల తర్వాత ఆ దేశ పర్యటన చేపట్టారు.
Read Also: Greenfield Highway : అమరావతి-హైదరాబాద్ గ్రీన్‌ఫీల్డ్ హైవేకి కేంద్రం అనుమతి