HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Tpcc Chief Mahesh Kumar Will Visit The Districts

District Tour : జిల్లాల పర్యటన చేయనున్న టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్

ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా వాటిని తప్పుపట్టడమే పనిగా బీఆర్ఎస్ , బీజేపీ లు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఎలాంటి భేషజాలు లేవు. ఏమైనా తప్పులు జరిగితే సరిదిద్దుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.

  • Author : Latha Suma Date : 14-11-2024 - 1:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TPCC Mahesh Kumar Goud Comments On BJP, BRS
TPCC chief Mahesh Kumar

PCC Chief Mahesh Kumar Goud : నేడు మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆబిడ్స్ సర్కిల్ వద్ద నెహ్రూ విగ్రహానికి మాజీ ఎంపీ వీహెచ్, తదితరులతో కలిసి టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ నివాళి అర్పించారు. అనంతరం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ..ఎల్లుండి నుండి జిల్లాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ..పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పర్యటిస్తానన్నారు. మొదటి పర్యటన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మొదలు పెడతామన్నారు. 18న మెదక్ పార్లమెంట్ లో నియోజకవర్గంలో పర్యటిస్తానన్నారు. ఈ పర్యటనలకు సంబంధించిన షెడ్యూల్ త్వరలో ప్రకటించనున్నట్లు చెప్పారు.

కాగా, లగచర్ల ఘటన వెనుక కుట్ర కోణం ఉందన్నారు. అంతేకాక దీని వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారని మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా వాటిని తప్పుపట్టడమే పనిగా బీఆర్ఎస్ , బీజేపీ లు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఎలాంటి భేషజాలు లేవు. ఏమైనా తప్పులు జరిగితే సరిదిద్దుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ అటువంటిది ఏమీ లేకుండా కేవలం రాజకీయాలు, మీ అవసరాల కోసం ప్రజలను రెచ్చగొడితే చర్యలు తప్పవన్నారు. మేము తప్పు చేస్తే నిలదీయండి. అంతే కానీ.. అభివృద్ధి నిరోధకులుగా మారవద్దన్నారు. కార్యకర్తల కృషి వల్లే పార్టీ అధికారంలోకి వచ్చిందని ఏడాది పాలన ఉత్సవాలను ప్రతి కార్యకర్త జరుపుకుంటారన్నారు. పార్టీ పరంగా రేపటి నుంచి విజయోత్సవ కార్యక్రమాలు ఉండనున్నట్లు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.

Read Also: Revanth Reddy : కొడంగల్ నుంచే ప్రజాపాలన మీద తిరుగుబాటు మొదలైంది – హరీష్ రావు

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • District Tour
  • Jawaharlal Nehru Jayanti
  • karimnagar
  • pcc chief mahesh kumar goud

Related News

Good news for farmers from the Revanth government.

CM Revanth Reddy: రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్

తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మరింత లాభసాటిగా మార్చడంతో పాటు, పంటల సాగు విధానంలో సమతుల్యతను సాధించేందుకు ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో ఒకవైపు వరి సాగు అసాధారణంగా పెరిగిపోతుండగా.. మరోవైపు పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, చిరుధాన్యాల సాగు గణనీయంగా పడిపోతోంది. ఈ వ్యత్యాసాన్ని తగ్గించి, ఇతర ధాన్యాల దిగుమతి విషయంలో తెలంగాణను స్వయం సమృద్ధి దిశగా నడిపించే

  • Good news for farmers from the Revanth government.

    Rythu Bharosa: తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. ‘రైతు భరోసా’ నిధులు విడుదల

Latest News

  • Strait of Hormuz: హార్మూజ్‎లో చమురు నౌకలపై ఇరాన్ మిస్సైల్ దాడులు

  • Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • CM Chandrababu Naidu: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

  • Sivaji: శివాజీ దూకుడు.. యంగ్ డైరెక్టర్స్ తో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్..

  • Heavy Rains: ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd