HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >The Rebellion Against Public Governance Started From Kodangal

Revanth Reddy : కొడంగల్ నుంచే ప్రజాపాలన మీద తిరుగుబాటు మొదలైంది – హరీష్ రావు

Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి పగ ప్రతీకారంతో కావాలనే పట్నం నరేందర్‌రెడ్డిని అరెస్ట్‌ చేయించారని ఆరోపించారు. కొడంగల్ నుంచే ప్రజాపాలన మీద తిరుగుబాటు మొదలైందని.. ఈ అరెస్ట్ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు

  • Author : Sudheer Date : 14-11-2024 - 1:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Harish Rao Charlapalli
Harish Rao Charlapalli

లగచర్ల కేసులో అరెస్టయిన కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని చర్లపల్లి జైల్లో హరీశ్‌రావు గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి పగ ప్రతీకారంతో కావాలనే పట్నం నరేందర్‌రెడ్డిని అరెస్ట్‌ చేయించారని ఆరోపించారు. కొడంగల్ నుంచే ప్రజాపాలన మీద తిరుగుబాటు మొదలైందని.. ఈ అరెస్ట్ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మేలు జరుగుతుందన్న పాపానికి.. లగచర్ల గ్రామం భూములను గుంజుకోవడమే నువ్వు చేసే మేలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏంజరిగిన అది బిఆర్ఎస్ పార్టీ వల్లనే అని బురద జల్లు తున్నారని.. నిరుద్యోగులు, రైతులు, పోలీసులు స్వచ్ఛందంగా ధర్నా చేస్తే అది బీఆర్‌ఎస్‌ చేయించిందని రేవంత్ అంటున్నారని.. రేవంత్ సొంత నియోజకవర్గంలో తమ భూముల కోసం గిరిజనులు పోరాటం చేస్తే అది కూడా బీఆర్‌ఎస్‌ చేసిందనే అంటున్నారన్నారు. ప్రజలకు అన్యాయం జరిగితే పోరాడడం ప్రతిపక్షాలుగా మా బాధ్యత అన్నారు. మమ్మల్ని అక్రమంగా కేసులు పెట్టాలనుకుంటున్నావేమో .. మాపై కోపం ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేయండి‌.. కానీ అమాయక గిరిజన రైతులపై కేసులెలా పెడతారని ప్రశ్నించారు.

మల్లన్నసాగర్‌లో రేవంత్‌ రెండురోజులు నిరసన చేస్తే మేం అడ్డుకున్నమా.. ? అని ప్రశ్నించారు. అర్ధరాత్రి మహిళల చాతిమీద కాళ్లు పెట్టి అరెస్టులు చేయడం సరికాదన్నారు. ఈ ప్రజల తిరుగుబాటు ఆగదని.. రేవంత్‌ని గద్దె దించే దాకా నిద్రపోమన్నారు. మా ప్రభుత్వంలో 14వేల ఎకరాలు ఫార్మాసిటీ కోసం సేకరించామని.. అక్కడెందుకు ఫార్మాసిటీ కట్టరని ప్రశ్నించారు. ఇందిరమ్మ ముసుగులో దళితుల, గిరిజనుల భూములు గుంజుకుంటున్నారని.. ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన ఇప్పుడు కనిపిస్తోందన్నారు.

చర్లపల్లి జైలులో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కలిసేందుకు జైలు వద్దకు చేరుకున్న మాజీ మంత్రి హరీష్ రావు, బిఆర్ఎస్ పార్టీ బృందం #HarishRao #BRSparty #Lagcherla #PatnamNarendarReddy #arrest #HashtagU pic.twitter.com/sW7KNySqBE

— Hashtag U (@HashtaguIn) November 14, 2024

Read Also : Salt: ఉప్పును చేతికి ఎందుకు ఇవ్వరు.. అలా ఇస్తే ఏమవుతుందో తెలుసా?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • cherlapally jail
  • harish rao
  • Lagacharla Incident
  • vem narender reddy arrest

Related News

Kcr Nandinagar

Phone Tapping Case : నందినగర్ కు బయల్దేరిన కేసీఆర్‌

కేసీఆర్ తన నివాసం నుండి బయల్దేరిన సమయం నుండి కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. 'జై తెలంగాణ.. జై కేసీఆర్' నినాదాలతో బంజారాహిల్స్ పరిసర ప్రాంతాలు మారుమోగిపోయాయి

  • Sit Inquiry Kcr

    నంది నగర్ నివాసంలోనే కేసీఆర్ విచారణ!

  • Harish Rao Pm

    రైతులకు కన్నీరు.. బీరు ఫ్యాక్టరీలకు నీరు ! – కాంగ్రెస్ సర్కార్ పై హరీష్ రావు ధ్వజం

  • Harish Rao Movie Tickets

    మరో భారీ స్కామ్ ను బయటపెట్టి, కాంగ్రెస్ సర్కార్ కు షాక్ ఇచ్చిన హరీష్ రావు

  • Phone Tapping Santhosh

    ఫోన్ ట్యాపింగ్ కేసు : ఎవరు సాక్షి ? ఎవరు దోషి? సిట్ ఎవర్ని అరెస్ట్ చేయబోతుంది ?

Latest News

  • రాజకీయాలను నేరమయం చేసిందే వైసీపీనే – చంద్రబాబు

  • కశ్మీర్‌లో భూకంపం

  • జీడీపీలో భారత్ వరల్డ్ నెంబర్ 2.. ఎలాన్ మస్క్ సంచలన ట్వీట్..!

  • ఇండియన్ నేవీలో 260 పోస్టులు

  • మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్తాన్!

    • బ‌డ్జెట్ 2026.. ఏయే రంగాల‌కు ఎంత బ‌డ్జెట్?!

    • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

    • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

    • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd