India -US : నోటీసులకు స్పందించని అగ్రరాజ్యం.. రాయితీలకు కోత విధించే యోచనలో భారత్
ముఖ్యంగా, ఉక్కు (స్టీల్), అల్యూమినియం వంటి లోహాలపై అమెరికా విధించిన అధిక సుంకాలకు ఇది ప్రతిస్పందనగా చెబుతోంది. అమెరికా 2018లో జాతీయ భద్రతా పేరుతో భారత్ నుంచి దిగుమతయ్యే ఉక్కు, అల్యూమినియంపై వరుసగా 25 శాతం, 10 శాతం సుంకాలు విధించింది.
- By Latha Suma Published Date - 11:51 AM, Mon - 2 June 25

India -US : వాణిజ్య రంగంలో అమెరికా తీసుకుంటున్న రక్షణాత్మక చర్యలకు సమాధానంగా, భారత్ ఇటీవల ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) ముందు కీలక ప్రకటన చేసింది. అమెరికా నుండి దిగుమతి అయ్యే కొన్ని ముఖ్యమైన వస్తువులపై ప్రతీకార సుంకాలు విధించనున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా, ఉక్కు (స్టీల్), అల్యూమినియం వంటి లోహాలపై అమెరికా విధించిన అధిక సుంకాలకు ఇది ప్రతిస్పందనగా చెబుతోంది. అమెరికా 2018లో జాతీయ భద్రతా పేరుతో భారత్ నుంచి దిగుమతయ్యే ఉక్కు, అల్యూమినియంపై వరుసగా 25 శాతం, 10 శాతం సుంకాలు విధించింది. ఈ చర్యలకు వ్యతిరేకంగా భారత్ అప్పుడే WTOని ఆశ్రయించినా, తుది పరిష్కారం వచ్చేది తక్కువే. అయితే, తాజాగా అమెరికా ఈ సుంకాలను మరోసారి పెంచాలని నిర్ణయించడంతో జూన్ 4 నుంచి 50 శాతానికి పెంచనున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో భారత్ స్పందన మరింత దృఢంగా మారింది.
Read Also: Indus Waters Treaty : సింధు జలాల నిలిపివేత ఎఫెక్ట్.. ఎండుతున్న పాక్ డ్యామ్‌లు..సాగునీటి సంక్షోభం, ఖరీఫ్‌పై తీవ్ర ప్రభావం..!
ఈ పరిణామాల నేపథ్యంలో WTOలో అమెరికాకు నోటీసులు పంపిన భారత్ తమ నిర్ణయాలు బహుళపాక్షిక వాణిజ్య ఒప్పందాలకు అనుగుణంగా ఉన్నాయని స్పష్టం చేసింది. అయితే, ఈ నోటీసులను అమెరికా స్పష్టంగా తిరస్కరించింది. జాతీయ భద్రత ఆధారంగా సుంకాలు విధించామని పేర్కొంటూ, భారత్ ఆరోపణలను తిప్పికొట్టింది. భారత్‌తో ఈ అంశంపై చర్చలు జరపే ఉద్దేశం లేదని ట్రంప్ పరిపాలనలో ఉన్న వాణిజ్య అధికారులు తెలిపారు. దీంతో భారత్ మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా వెళ్తోంది. అమెరికా దిగుమతులపై ఇప్పటివరకు ఇస్తున్న ట్యాక్స్ రాయితీలను తొలగించాలనే యోచనలో ఉంది. అమెరికా లోహాలపై అధిక టారిఫ్‌లు విధించే దిశగా కేంద్రం చర్యలు వేగవంతం చేస్తోంది. 7.6 బిలియన్ డాలర్ల విలువైన భారత్ ఎగుమతులపై దీని ప్రభావం పడే అవకాశం ఉన్నందున, ఇది దేశ ఆర్థిక రంగానికి సవాలుగా మారనుంది.
ఇంతలోనే భారత్-అమెరికా మధ్య కొత్త వాణిజ్య ఒప్పందానికి చర్చలు ముగింపు దశలోకి వచ్చాయని సమాచారం. భారత్ అమెరికాకు వాణిజ్య లోటును తగ్గించేందుకు కొన్ని కీలక రాయితీలను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, అమెరికా అనుసరిస్తున్న తాజా వైఖరితో ఆ రాయితీలపై తిరిగి ఆలోచించే అవకాశం ఉంది. వాణిజ్య సంబంధాలు మెరుగుపడుతున్న వేళ ఇలాంటి రక్షణాత్మక చర్యలు ఎలాంటి ప్రభావాలు చూపిస్తాయన్నది చూడాల్సిన విషయం. భారత్ స్పష్టంగా చెబుతున్నది ఒక్కటే న్యాయమైన, సమాన వాణిజ్యాన్ని మేము కోరుకుంటున్నామని.
Read Also: CM Revanth Reddy : తెలంగాణను 1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దాలని నిర్ణయించాం