HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Tensions On The India Pakistan Border Security Tightened In Tirumala

Tirumala : భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు..తిరుమలలో భద్రత కట్టుదిట్టం

తిరుపతి అర్బన్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు గురువారం జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం తిరుమల సీవీఎస్‌వో (చీఫ్ విజిలెన్స్ & సెక్యూరిటీ ఆఫీసర్) కార్యాలయంలో జరిగింది. భద్రతా ఏర్పాట్లు, శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల ప్రవేశాల వ్యవస్థ, నిఘా పటిష్టతపై అధికారులు చర్చించారు.

  • Author : Latha Suma Date : 09-05-2025 - 12:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tensions on the India-Pakistan border.. Security tightened in Tirumala
Tensions on the India-Pakistan border.. Security tightened in Tirumala

Tirumala : భారత్-పాక్ సరిహద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా తిరుమలలో భద్రతను మరింత కఠినంగా చేశారు. యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉండే ఈ పుణ్యక్షేత్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. తిరుపతి అర్బన్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు గురువారం జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం తిరుమల సీవీఎస్‌వో (చీఫ్ విజిలెన్స్ & సెక్యూరిటీ ఆఫీసర్) కార్యాలయంలో జరిగింది. భద్రతా ఏర్పాట్లు, శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల ప్రవేశాల వ్యవస్థ, నిఘా పటిష్టతపై అధికారులు చర్చించారు.

Read Also: Nuclear Bomb: ఖరీదైన అణుబాంబు ఏ దేశం వద్ద ఉందో తెలుసా..?

సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం నుంచి వచ్చిన హెచ్చరికల ప్రకారం అన్ని దేవాలయ ప్రాంతాల్లో జాగ్రత్తలు మరింతగా తీసుకోవాలని ఎస్పీ సూచించారు. మధ్యాహ్నం నుంచి భద్రతా బలగాలు తిరుమలలో తనిఖీలు ప్రారంభించనున్నాయి. ప్రతి ప్రధాన రహదారి, గాలిగోపురం, నందీ సర్కిల్, ఆలయం పరిసరాల్లో భద్రతా సిబ్బంది మోహరించనున్నారు. అదేవిధంగా, డోలోమెయిన్, టోల్‌గేట్‌, అలిపిరి మెట్ల మార్గం వంటి ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించేందుకు అదనపు సిబ్బందిని నియమించారు.

సీసీ టీవీల ద్వారా నిఘాను మరింత బలోపేతం చేశారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీమ్‌లు సిద్ధంగా ఉంచారు. యాత్రికులు శాంతియుతంగా దర్శనం చేసుకుని తిరిగి వెళ్లేలా పోలీసులు పూర్తి స్థాయిలో సమీకృత చర్యలు తీసుకుంటున్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారుల సూచన. తిరుమల తిరుపతి దేవస్థానం భద్రతా విభాగం కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. భక్తుల భద్రతకే ప్రధాన ప్రాధాన్యం ఇస్తున్నామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్పష్టం చేశారు. ‘‘ప్రస్తుత పరిస్థితే ఎలా ఉన్నా భక్తుల భద్రతకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం,’’ అని ఆయన వెల్లడించారు.

Read Also: CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి బెంగళూరు పర్యటన రద్దు

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • devotees
  • ndia-Pakistan border Tensions
  • Security Tightened
  • tirumala

Related News

Anant Ambani

అంబాజీ మాత ఆలయానికి అనంత్ అంబానీ రూ.27.50 కోట్ల భారీ విరాళం

Anant Ambani  దిగ్గజ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ కుటుంబం సంపాదనకే కాదు.. దాతృత్వంలోనూ ఫేమస్. పలు కార్యక్రమాల కోసం విరాళాలు అందిస్తుంటుంది. బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాలకు కూడా తరచుగా కోట్లల్లో విరాళాలు అందజేస్తుంటుంది. ఇప్పుడు ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ.. గుజరాత్‌లోని అంబాజీ మాతా ఆలయానికి రూ. 27.50 కోట్ల విరాళం ఇవ్వడం విశేషం. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ క

    Latest News

    • భారతదేశంలో ప్రస్తుతం ఎక్కువగా ఉన్న క్యాన్సర్లు ఇవే!

    • డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్‌!!

    • శ్రీరాముడిగా మహేష్ బాబు.. వైర‌ల్ అవుతున్న పోస్ట‌ర్ ఇదే!

    • నమో భారత్ రైలు, మీరట్ మెట్రోను ప్రారంభించనున్న ప్రధాని మోదీ!

    • కారు వాడుతున్నారా? అయితే ఈ వార్త చ‌ద‌వాల్సిందే!

    Trending News

      • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

      • టీమిండియా మాజీ ఓపెన‌ర్ ఇంట్లో పెళ్లి సందడి.. సోఫీ షైన్‌తో త్వరలో వివాహం!

      • మండలిలో కొత్త రచ్చ.. దేవుడి చిత్రాలతో వైసీపీ రాజకీయం

      • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

      • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd