Inter results : 22న తెలంగాణ ఇంటర్ ఫలితాలు
నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో 22న ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య సహా అధికారులు పాల్గొననున్నారు.
- Author : Latha Suma
Date : 19-04-2025 - 2:18 IST
Published By : Hashtagu Telugu Desk
Inter results : ఈ నెల 22న ( మంగళవారం) తెలంగాణ ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేయనున్నారు. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో 22న ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య సహా అధికారులు పాల్గొననున్నారు. ఇంటర్ ఫలితాలు నేరుగా ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.in లో అందుబాటులో ఉంటాయి.
Read Also: Naxal Free Village: మావోయిస్టురహితంగా ‘బడేసట్టి’.. ఛత్తీస్‌గఢ్‌లో కీలక పరిణామం
కాగా, గత నెల 5 నుంచి 25వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలకు 9, 96,971 మంది విద్యార్థులు హాజరయ్యారు. మార్చి 18 నుంచే స్పాట్ వాల్యుయేషన్ను 19 కేంద్రాల్లో ప్రారంభించిన ఇంటర్ బోర్డు అనుకున్న సమయానికే ఫలితాలు ఇచ్చేలా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. తొలిసారిగా రాండమ్ రీవాల్యుయేషన్ సైతం నిర్వహించి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఇంటర్మీడియట్ బోర్డ్ జాగ్రత్తలు తీసుకుంది. దీంతో రెండు దశల్లో పరిశీలన చేసిన తర్వాతే ఫలితాల వెల్లడికి ఇంటర్ బోర్డు సిద్ధమైంది. ఫలితాల వెల్లడి తర్వాత రీకౌంటింగ్, రీవాల్యుయేషన్‌కు సైతం అవకాశం ఇవ్వనున్నారు. సిజిజి ఆమోద ముద్రలతో ప్రభుత్వం అనుమతి తీసుకొని ఈనెల 22న ఫలితాలు వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు.
Read Also: KTR : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు