Vikarabad : కలెక్టర్ పై దాడిని ఖండించిన తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మెన్ వి.లచ్చిరెడ్డి
Vikarabad : అధికారులపై దాడికి ఉసిగొల్పిన, దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని రాష్ట్ర డీజీపీ దృష్టికి తీసుకెళ్లి దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరుగకుండా చర్యలు చేపట్టాలని కోరనున్నట్లుగా తెలిపారు.
- By Latha Suma Published Date - 05:26 PM, Mon - 11 November 24
Telangana Employees Joint Action Committee : వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, తహశీల్దార్, ఇతర అధికారులపై ఈరోజు దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడిపై తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మెన్ వి.లచ్చిరెడ్డి స్పందించారు. వికారాబాద్ జిల్లాలో కలెక్టర్, అదనపు కలెక్టర్, ఇతర రెవెన్యూ అధికారులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా తెలిపారు. అంతకాక..దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి డిజీపీకి ఫిర్యాదు చేస్తాం..అన్నారు. అధికారులపై దాడికి ఉసిగొల్పిన, దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని రాష్ట్ర డీజీపీ దృష్టికి తీసుకెళ్లి దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరుగకుండా చర్యలు చేపట్టాలని కోరనున్నట్లుగా తెలిపారు.
వికారాబాద్ జిల్లా, దుద్యాల మండలం, లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ భూసేకరణ ప్రక్రియలో భాగంగా గ్రామసభలో ప్రజాభిప్రాయానికి సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్,అదనపు కలక్టర్, కడా ప్రత్యేక అధికారి, కొండగల్ తహశీల్దార్, ఇతర రెవిన్యూ అధికారులు, సిబ్బంది వచ్చారన్నారు. ఈ సమయంలోనే కొందరు అధికారులపై దాడులు చేశారన్నారు. వాహనాలను సైతం ధ్వంసం చేశారన్నారు. ఇది హేయమైన చర్య. దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ఇలాంటి దాడూలతో ఉద్యోగులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు.
కాగా, వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఫార్మా విలేజ్ కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణను స్థానిక రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే జిల్లా కలెక్టర్‌తో పాటు స్థానిక తహశీల్దార్ కార్లపై రైతులు రాళ్లు విసిరి దాడికి దిగారు. అయితే రైతుల దాడిలో కలెక్టర్, తహశీల్దార్ కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే రైతుల నిరసనల మధ్యే కలెక్టర్ ప్రతీక్ జైన్ కారు దిగి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో రైతులు ఆయనపై దాడికి పాల్పడారు.
Read Also: Sanjay Bangar Daughter: అమ్మాయిగా మారిన టీమిండియా మాజీ కోచ్ కుమారుడు!