Telangana Cabinet : ప్రారంభమైన తెలంగాణ కేబినెట్ సమావేశం
కేబినెట్‌లో 45 ఎజెండా అంశాలను ప్రభుత్వం చేర్చింది. అసెంబ్లీలో పెట్టాల్సిన పలు అంశాలపై చర్చించి కేబినేట్ ఆమోదం తెలుపనుంది.
- By Latha Suma Published Date - 05:41 PM, Thu - 1 August 24

Telangana Cabinet meeting: తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన కేబినెట్ భేటి సమావేశమైంది. కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాలపనై మంత్రివర్గంలో చర్చిస్తున్నారు. ఆరు గ్యారంటీలతో పాటు ఇతర సంక్షేమ పథకాలకు తెల్లరేషన్ కార్డునే ప్రభుత్వం ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజల నుంచి డిమాండ్ ఏర్పడింది. అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో 2 రోజుల క్రితం ప్రకటించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ మేరకు రేషన్ కార్డుల (Ration cards)జారీకి అర్హతలు, విధి విధానాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరుగుతుంది. దారిద్ర్య రేఖకు దిగువన(బీపీఎల్) ఉన్న వారికే నూతన రేషన్ కార్డులు ఇవ్వనున్నారు. అయితే బీపీఎల్‌ను పునర్ నిర్వచించే అవకాశం ఉంది. వార్షికాదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.లక్షన్నర వరకు ఉన్న కుటుంబాలను బీపీఎల్‌గా ఇప్పుడు పరిగణిస్తున్నారు. అయితే బీపీఎల్ కుటుంబానికి గరిష్ఠ ఆదాయం, భూమిని కూడా నిర్ణయించేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు వరకు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసే అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. కొత్త వైద్య కళాశాలలకు భూమి కేటాయింపు, జాబ్ క్యాలెండర్, ప్రజావాణి దరఖాస్తులు, గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపైనా కూడా చర్చిస్తారని తెలుస్తుంది.
Read Also: Ecpr Treatment : e-CPR టెక్నాలజీ అంటే ఏమిటి, ఇది కృత్రిమ గుండెలా ఎలా పని చేస్తుంది.?