CM Revanth Reddy : త్వరలోనే మరో 35 వేల ఉగ్యోగాల భర్తీ : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేశాం.. మరో 35 వేల ఉద్యోగాలు (35 thousand jobs) భర్తీ చేయబోతున్నాం.. ఉద్యోగ నియామకాల కోసం చిత్తశుద్ధి తో పని చేస్తున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
- By Latha Suma Published Date - 05:48 PM, Mon - 26 August 24

CM Revanth Reddy: రాజీవ్ గాంధీ అభయహస్త పథకం (Abhayahastam scheme)లో భాగంగా సివిల్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికసాయం చేసింది. ఈ క్రమంలోనే సోమవారం రాష్ట్ర సచివాలయంలో అభ్యర్థులకు అభయహస్తం చెక్కులను సీఎం రేవంత్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..తెలంగాణలో ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేశాం.. మరో 35 వేల ఉద్యోగాలు (35 thousand jobs) భర్తీ చేయబోతున్నాం.. ఉద్యోగ నియామకాల కోసం చిత్తశుద్ధి తో పని చేస్తున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సివిల్స్ విద్యార్థులకు ఆత్మస్థైర్యం ఇవ్వడం కోసం మా ప్రయత్నం. కొందరికి లక్ష చిన్నది కావచ్చు.. కొందరికి లక్ష ఎక్కువ కావచ్చు. కానీ మేము మీకు అండగా ఉన్నాం అని చెప్పడం కోసం మా ఆలోచన. మీరు మా కుటుంబ సభ్యులు అని చెప్పే ప్రయత్నం మాది.
We’re now on WhatsApp. Click to Join.
చాలా కాలం మనకు సచివాలయం లేదు. సచివాలయం వచ్చాకా.. ఎవరికి అనుమతి లేదు అలాంటి పరిస్థితి నుండి ఇది ప్రజలది అని నమ్మకం కలిగించే ప్రయత్నం చేశాం. అందుకే మిమ్మల్ని కూడా ఇక్కడికే రప్పించాము. ఇంటర్వ్యూలలో కూడా ఐఏఎస్ కి సెలక్ట్ అవ్వాలి. మన పిల్లలు ఎందుకు ఐఏఎస్ లుగా ఎంపిక కాకూడదు అని మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మీరు ఇప్పుడు పరీక్షల మీద దృష్టి పెట్టండి అని సివిల్స్ లో ప్రిలిమ్స్ పాసైన వారికి సీఎం సూచనలు చేసారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఏనాడూ నిరుద్యోగుల గురించి ఆలోచన చేయలేదని గుర్తు చేశారు. నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
Read Also: ఏపీకి 13లక్షల కోట్ల అప్పులు: మంత్రి అచ్చెన్నాయుడు
తాము అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 30 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని తెలిపారు. తమ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని కీలక ప్రకటన చేశారు. ఒక్కో స్కూల్కు రూ.100 నుంచి రూ.150 కోట్లు ఖర్చు చేస్తామని అన్నారు. ఈ ఏడాదే 100 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. గురుకులాల పేరుతో విద్యా వ్యవస్థను బీఆర్ఎస్ నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. నోటిఫికేషన్లు, పరీక్షల కోసం పదేళ్లు నిరుద్యోగులు దీక్షలు, ధర్నాలు చేశారని గుర్తుచేశారు. తాము నియామకాలు చేపడితే పరీక్షలు వాయిదాలు వేయాలని డిమాండ్ చేస్తున్నారని అన్నారు.
విద్యార్థులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలకు వాళ్ల ఉద్యోగాలు పోయాకే నిరుద్యోగుల బాధలు గుర్తుకు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. నిరుద్యోగుల పేరుతో రాజకీయాలు చేయొద్దు. నిరుద్యోగులకు ఏం కావాలన్నా చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. పోటీ పరీక్షలు నిర్వహించొద్దని ధర్నాలు చేయడం కరెక్ట్ కాదు.. నిరుద్యోగులు ప్రతిపక్షాల ట్రాప్లో పడొద్దని సీఎం రేవంత్ రెడ్డి హితవు పలికారు.