Megastar Chiranjeevi : మెగాస్టార్ తో మారుతి.. కాంబో ఫిక్స్ అయినట్టేనా..?
మారుతి ప్రభాస్ తో రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారుతి సత్తా చాటనున్నాడు.
- By Ramesh Published Date - 04:34 PM, Mon - 26 August 24

Megastar Chiranjeevi మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే మరో సినిమా పట్టాలెక్కించే ప్లాన్ లో ఉన్నారు. చిరు నెక్స్ట్ సినిమా డైరెక్టర్స్ రేసులో హరీష్ శంకర్ పేరు వినపడింది. ఐతే లేటెస్ట్ గా ఆ లిస్ట్ లో మారుతి కూడా జాయిన్ అయ్యాడని తెలుస్తుంది. ప్రస్తుతం మారుతి ప్రభాస్ తో రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారుతి సత్తా చాటనున్నాడు.
రాజా సాబ్ తర్వాత మారుతి మెగాస్టార్ చిరంజీవితోనే సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ప్రభాస్ (Prabhas) సినిమా తర్వాత చిరు సినిమా చేయడానికి ఎలాంటి డౌట్లు అవసరం లేదు. ఐతే ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ గా కన్ ఫర్మ్ చేయలేదు కానీ చిరు బర్త్ డే రోజు మారుతి వెళ్లి మెగాస్టార్ ని కలిసి విష్ చేసింది అందుకే అని అంటున్నారు.
విశ్వంభర సినిమా తర్వాత చిరంజీవి మారుతి(Maruthi) తోనే సినిమా చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. మారుతి కూడా రాజా సాబ్ తర్వాత చకచకా చిరుతో సినిమా కోసం రెడీ అవుతారని తెలుస్తుంది. విశ్వంభర సినిమా జనవరి 10న రిలీజ్ ప్లాన్ చేశారు. ఐతే రాజా సాబ్ మాత్రం 2025 ఏప్రిల్ లో వస్తుంది. సో ఈ గ్యాప్ లో చిరు సినిమా కోసం కథ సిద్ధం చేస్తాడని చెప్పొచ్చు.
మెగా ఆభిమాని అయిన మారుతి ఆయన్ని డైరెక్ట్ చేయడం అంటే లక్కీ అని చెప్పొచ్చు. మరి మారుతి డైరెక్షన్ లో చిరు సినిమా ఎలా ఉండబోతుంది అన్నది చూడాలి.
Also Read : Mufasa Trailer : సూపర్ స్టార్ మహేష్ వాయిస్ తో ముఫాసా ట్రైలర్..!