17 Years Kidnap :17 ఏళ్ల క్రితం కిడ్నాపై..ఇప్పుడు దొరికింది
ఇదొక షాకింగ్ న్యూస్. 17 ఏళ్ల క్రితం (17 Years Kidnap) అంటే.. 2006 సంవత్సరంలో కిడ్నాప్‌కు గురైన ఓ మహిళ ఆచూకీ ఎట్టకేలకు పోలీసులకు దొరికింది.
- Author : Pasha
Date : 26-05-2023 - 9:24 IST
Published By : Hashtagu Telugu Desk
ఇదొక షాకింగ్ న్యూస్. 17 ఏళ్ల క్రితం (17 Years Kidnap) అంటే.. 2006 సంవత్సరంలో కిడ్నాప్‌కు గురైన ఓ మహిళ ఆచూకీ ఎట్టకేలకు పోలీసులకు దొరికింది. కిడ్నాప్ అయినప్పుడు ఆమె వయసు 15 ఏళ్ళు. ఇప్పుడు ఆమె వయసు 32 సంవత్సరాలు. ఢిల్లీలోని సీమాపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ మహిళ ఆచూకీని పోలీసులు గుర్తించారు. దీంతో ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు 2006లో (17 Years Kidnap) ఢిల్లీ పోలీసులు గోకుల్‌పురి పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 363 కింద నమోదు చేసిన కేసుకు తెర పడింది.
“నేను ఇంటిని వదిలి వెళ్లిన తర్వాత ఉత్తర ప్రదేశ్ లోని బలియా జిల్లా చెర్డిహ్ గ్రామంలో దీపక్ అనే వ్యక్తితో కలిసి నివసించాను. ఆ తర్వాత లాక్‌డౌన్ టైం లో కొన్ని వివాదాల కారణంగా దీపక్‌ను వదిలి ఢిల్లీలోని గోకల్‌పురికి వచ్చాను. ఇక్కడే ఒక ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటున్నాను” అని పోలీసులకు ఆ మహిళ చెప్పింది.