Sama Ram Mohan Reddy: వంచన కేసీఆర్ కుటుంబం పెటెంట్… వారు తప్ప ఎవరూ చేయలేరు
Sama Rammohan Reddy : ప్రతిపక్షాలైన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. చార్జీషీట్లు విడుదల చేసి, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ చార్జీ షీట్లపై కాంగ్రెస్ నాయకులు తమ స్టైల్‌లో సమాధానాలు ఇస్తున్నారు. ముఖ్యంగా, కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి ఈ విషయంపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
- By Kavya Krishna Published Date - 06:07 PM, Sun - 8 December 24

Sama Ram Mohan Reddy : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలం పాలన సాగించిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పాలన వియోజత్సవాల సంబరాలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రతిపక్షాలైన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. వీరిపైన, చార్జీషీట్లు విడుదల చేసి, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ చార్జీ షీట్లపై కాంగ్రెస్ నాయకులు తమ స్టైల్‌లో సమాధానాలు ఇస్తున్నారు. ముఖ్యంగా, కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి ఈ విషయంపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్, బీజేపీ నాయకుల చార్జీషీట్లపై రామ్మోహన్ రెడ్డి స్పందిస్తూ … కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ ఏడాది కాలంలో అలుపెరగని విమర్శలు గుప్పిస్తోందని ఆరోపించారు. అంతేకాకుండా.. “వంచన కేసీఆర్ కుటుంబం పేటెంట్. వారు తప్ప వంచన ఎవరూ చేయలేరు” అని తీవ్రంగా విమర్శించారు రామ్మోహన్ రెడ్డి. అంతేకాకుండా.. కాంగ్రెస్ పాలనలో కేసీఆర్ కుటుంబ వంచన నుంచి ప్రజలను విముక్తి కల్పించామని రామ్మోహన్ రెడ్డి అన్నారు. చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకునే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని ఆయన వ్యంగ్యంగా పేర్కొన్నారు.
ఇక, 2014 నుండి 2024 వరకు బీఆర్ఎస్ తన హామీలను అమలు చేయకపోవడంపై విమర్శలు చేస్తూ… “తెలంగాణ సెంటిమెంట్” పేరుతో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు మాత్రం ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పించుకుని, చార్జీషీట్లు విడుదల చేస్తుందని మండిపడ్డారు. ఆయన ఈ చర్యను “దొంగే దొంగ” అన్నట్లుగా ఉందని అభిప్రాయపడ్డారు.
“మేము బీఆర్ఎస్ భాషలోనే సమాధానం ఇవ్వగలమని, కానీ మాకు సంస్కారం అడ్డొస్తుందని” రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. “మా పార్టీ చేతలే కాదు, మాటల కన్నా కట్టుబాట్లు ముఖ్యంగా విశ్వసించేది” అని చెప్పి, కాంగ్రెస్ పార్టీ యొక్క సంకల్పం, రాష్ట్రాన్ని సురాష్ట్రంగా మార్చే దిశగా ఉందని స్పష్టం చేశారు రామ్మోహన్ రెడ్డి.
బీఆర్ఎస్ నాయకులు, తమ హామీలను అమలు చేయకుండా, ఇప్పుడు చార్జీషీట్లు విడుదల చేస్తున్నారని ఈ చర్యపై విమర్శలు చేశారు. అదే సమయంలో, బీజేపీ పై కూడా విమర్శలు చేస్తూ, “వారు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా గాలి మాటలు చెబుతున్నారు” అని అన్నారు. 2014, 2019, 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసిన విధానంపై స్పష్టత ఇవ్వాలని, తమకు ఇది సంస్కారం అని, వారందరూ రాజకీయాలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.
Read Also : Syria : తారాస్థాయికి సిరియాలో అంతర్యుద్ధం.. మరణాల మధ్య విద్యార్థులు చదువులు..