SLBC Tunnel: సొరంగంలోకి రోబో..కొనసాగుతున్న గాలింపు
అయితే మరో రెండు రోజుల్లో ఏడు మృతదేహాలు బయటికి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. టన్నెల్ పైకప్పు కూలిపోవడంతో ఇప్పుడా ప్రాంతమంతా రాళ్లు, మట్టి, టీబీఎం శకలాలతో నిండిపోయింది.
- By Latha Suma Published Date - 12:53 PM, Tue - 11 March 25

SLBC Tunnel : ఎస్‌ఎల్‌బీసీ సొరంగ వద్ద 18వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్‌లో గల్లంతైన వారి కోసం ఇంకా ఆచూకీ లభించని ఏడుగురి కోసం సహాయక బృందాలు అవిశ్రాంతంగా పోరాడుతున్నాయి. మంగళవారం రోబోలను సైతం రంగంలోకి దించారు. రోబోటిక్స్ బృందం ఒక రోబోతో సొరంగంలోకి వెళ్లింది. మొదటి షిఫ్ట్‌లో 110 మంది రెస్క్యూ టీమ్ టన్నెల్‌లోకి వెళ్లి గాలిస్తోంది. ఈ మేరకు ప్రత్యేక కార్లలో ఈ రోబోటిక్ మిషన్లు వచ్చాయి. మూడు విభాగాలుగా టన్నల్ ను విభజించారు రెస్క్యూ టీం అధికారులు.
Read Also: Chemsex: కెమ్ సెక్స్.. ఏమిటిది ? ఎలా చేస్తారు ? ఏమవుతుంది ?
అయితే టింబర్ మిషన్ ముందు భాగంలో ఏడు మృతదేహాలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఒక మృతదేహాన్ని బయటికి తీసింది రెస్క్యూ టీం. అయితే మరో రెండు రోజుల్లో ఏడు మృతదేహాలు బయటికి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. టన్నెల్ పైకప్పు కూలిపోవడంతో ఇప్పుడా ప్రాంతమంతా రాళ్లు, మట్టి, టీబీఎం శకలాలతో నిండిపోయింది. అక్కడే దాదాపు 17 రోజులుగా 12 రకాల ఏజెన్సీలు, నిపుణులు సహాయక చర్యలు చేపడుతున్నారు.
ఇప్పుడు 13.20 కిలోమీటర్ల నుంచి 13.85 కిలోమీటర్ల మధ్య ముమ్మరంగా పనులు చేస్తున్నారు. 4 నుంచి 9 మీటర్ల మేర మట్టిదిబ్బలు పేరుకుపోయాయి.టన్నెల్‌లో 13.85 కిలోమీటర్ల దగ్గర ప్రమాదం జరిగింది. దీంతో.. 11వ కిలో మీటర్ వరకు నీరు, బురద పేరుకుపోయాయి. దీంతో 11వ కిలోమీటర్ వరకు మాత్రమే లోకో ట్రైన్ వెళ్లేది. అయితే.. పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి ప్రస్తుతం 13.20 కిలోమీటర్ల వరకు వెళ్లేలా లైన్ క్లియర్ చేశారు. ఈరోజు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి టన్నెల్ దగ్గర అధికారంతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సొరంగంలో నిమిషానికి 5 వేల లీటర్ల నీటి ఊట వస్తోంది. ఆ నీటిని తోడటానికి ప్రతి రెండున్నర కిలోమీటర్లకు ఒక పంపింగ్ యూనిట్ ఏర్పాటు చేశారు.
Read Also: Rodrigo Duterte : ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడి అరెస్ట్