Rodrigo Duterte : ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడి అరెస్ట్
యాంటీ డ్రగ్స్ ఊచకోత సమయంలో.. 2016 నుంచి 2022 మధ్య వేల సంఖ్యలో జనం చనిపోయారు. డ్రగ్స్‌పై వార్ విషయంలో జైలుకు వెళ్లడానికైనా సిద్ధమే అని 79 ఏళ్ల డ్యుటెర్టి తెలిపారు.
- By Latha Suma Published Date - 11:51 AM, Tue - 11 March 25

Rodrigo Duterte : ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టీ ని పోలీసులు అరెస్టు చేశారు. అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) వారెంట్ ఆదేశాల మేరకు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. హాంగ్ కాంగ్ నుంచి వచ్చిన డ్యుటెర్టీని మనీలా విమానాశ్రయంలో అరెస్టు చేశారు. డ్రగ్స్‌పై యుద్ధం చేపట్టిన డ్యుటెర్టీ.. తన పదవీకాలంలో డ్రగ్స్ బాధితులకు విచక్షణారహితంగా చంపేసిన విషయం తెలిసిందే. యాంటీ డ్రగ్స్ ఊచకోత సమయంలో.. 2016 నుంచి 2022 మధ్య వేల సంఖ్యలో జనం చనిపోయారు. డ్రగ్స్‌పై వార్ విషయంలో జైలుకు వెళ్లడానికైనా సిద్ధమే అని 79 ఏళ్ల డ్యుటెర్టి తెలిపారు.
Read Also: Wrestling Federation Of India: భారత రెజ్లింగ్ సమాఖ్యపై సస్పెన్షన్ ఎత్తివేత
అదే సమయంలో తాను మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని అణచివేయడాన్ని సమర్థించుకొన్నారు. డ్రగ్స్‌తో సంబంధం ఉన్నవారిని చంపేయమని తాను ఆదేశించినట్లు వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఇక, ఆయన తరపున లాయర్ సాల్వడోర్ పనెలో స్పందిస్తూ.. ఈ అరెస్టు అన్యాయమని పేర్కొన్నారు. ఆయనతో పాటు న్యాయవాదిని అనుమతించలేదన్నారు. ఈ అరెస్టుపై ఆ దేశ అధ్యక్ష కార్యాలయం స్పందిస్తూ ఇప్పటికే వారెంట్ కాపీని పోలీసులు డ్యూటెర్టోకు అందజేసినట్లు వెల్లడించింది. మాజీ అధ్యక్షుడు వారి కస్టడీలో ఉన్నట్లు పేర్కొంది.
తాను చేసిన పనులకు ఎలాంటి క్షమాపణలు చెప్పనని రోడ్రిగో డ్యుటెర్టీ తేల్చి చెప్పారు. ఆయన చేపట్టిన మాదక ద్రవ్యాలపై యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా పోలీస్ ఆపరేషన్లలో వేల మంది అనుమానాస్పద స్థితిలో మరణించారు. ప్రస్తుతం దానిని ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు విచారిస్తోంది. తాను దావౌ నగర మేయర్‌గా ఉన్న సమయంలో నగరంలోని నేరాలను అణచివేయడానికి తన అధీనంలో ఓ డెత్‌స్క్వాడ్ ఉండేదని కొన్నాళ్ల క్రితం రోడ్రిగో డ్యూటెర్టో అంగీకరించారు. 2016లో ఆయన దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తాను దావౌ నగరంలో చేసిందే. దేశం మొత్తం అమలుచేస్తానని ఆయన వాగ్దానం చేశారు. అనుమానితులను రెచ్చగొట్టి వారు తిరగబడేలా చేయమని తానే పోలీసు అధికారులకు చెప్పానని.. అప్పుడే వారు చేసే ఎన్‌కౌంటర్లను తగిన సాకులు లభిస్తాయని సూచించినట్లు వెల్లడించారు.
Read Also: Ukraine Vs Russia: 73 డ్రోన్లతో మాస్కోపై ఎటాక్.. రెచ్చిపోయిన ఉక్రెయిన్