HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Ritu Brakes On The Mouth Of The Madman

Bigg Boss : దివ్వెల నోటికి రీతూ బ్రేకులు..!

  • Author : Vamsi Chowdary Korata Date : 17-10-2025 - 11:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Big Boss
Big Boss

బిగ్‌బాస్ హౌస్‌లో కొన్ని రూల్స్ ఉంటాయ్.. ఇవి అందరికీ తెలిసిందే. అయితే మాధురి మాత్రం తాను ఏదో మహారాణిలా అందరినీ పిలిచి కొన్ని రూల్స్ పాస్ చేసింది. ఇది విన్న కంటెస్టెంట్లతో పాటు ఆడియన్స్ కూడా తెగ నవ్వుకొని ఉంటారు. నైట్ లైట్స్ ఆఫ్ అయిన తర్వాత బెడ్‌రూమ్‌లో ఎవరూ మాట్లాడకండి.. మాట్లాడాలుకుంటే గార్డెన్ ఏరియాలో మాట్లాడుకోండి.. మేము ఆరోగ్యాలు పోగొట్టుకోవడానికి హౌస్‌లోకి రాలేదు.. గేమ్ ఆడటానికి వచ్చాం.. మార్నింగ్ కూడా మీరెవరైనా గుడ్ మార్నింగ్ సాంగ్ కంటే ముందే లేస్తే సైలెంట్‌గా ఉండండి.. ఎవరూ ఎక్కడా మాట్లాడకండి.. మాకు నిద్రపట్టక చస్తున్నాం మేము.. నైట్ అంతా చాలా డిస్ట్రబింగ్‌గా ఫీలవుతున్నాం.. అని మాధురి చెప్పింది. ఈ రూల్ మీ అందరికీ ఓకేనా.. అని ఇమ్మూ అడుగుతుంటే ఇక్కడ ఓకేనా ఓకేలేదా అనడానికి ఆప్షన్ ఏం లేదు.. అంటూ మాధురి చెప్పింది. దీంతో ఏంటి ఇదేమైనా బిగ్‌బాస్ రూలా.. అని రీతూ రియాక్ట్ అయింది.

 

రీతూ నోట్లో మాట నోట్లోనే ఉంది.. ఇంతలోనే మాధురి రెచ్చిపోయింది. ఆ బిగ్‌బాస్ రూల్ ఏంటి గొడవ పడదామనుకుంటున్నారా.. అంటూ అరిచింది. ఫస్ట్ మీరు అరవకుండా మాట్లాడండి.. ఎందుకు అరుస్తున్నారు ఏమైనా ప్రాబ్లమా.. అని రీతూ అడిగింది. అవును ప్రాబ్లమ్ ఉంది బీపీ ఉంది.. అని మాధురి అరుస్తుంటే ట్యాబ్లెట్ వేసుకోండి అయితే.. మధ్యలో మీరు ఎందుకు వస్తున్నారు.. మీతో నేను మాట్లాడానా.. బిగ్‌బాస్ రూలా అని అడిగాను.. అని రీతూ చెప్పింది. దీనికి అవును రూల్‌యే.. అంటూ మాధురి తిక్కగా చెప్పింది. బిగ్‌బాస్ రూల్ చెప్పలేదు.. అని రీతూ అంటుంటే లైట్స్ ఎందుకు ఆపుతున్నారు.. అంటూ కొశ్చన్ చేసింది. అలా రూల్ ఏం లేదు.. మేము మాట్లాడుకుంటాం.. అని రీతూ కూడా తగ్గలేదు. దీంతో నేను ఒప్పుకోను.. అంటూ మాధురి అరిచింది. మీరెవరు ఒప్పుకోవడానికి.. అని రీతూ అనేసరికి నా హెల్త్ నా హెల్త్ ఇది.. అంటూ మాధురి బీపీతో ఊగిపోయింది. మీ హెల్త్ అయితే మీరు 3 ఇంటి వరకూ పడుకోలేదండీ.. అని రీతూ అంది. మీరు పడుకోనివ్వకుండా చేశారు.. అని మాధురి వాదించింది. మీరు ఇష్టమొచ్చినట్లు నోరు ఉంది కదా అని మాట్లాడకండి.. అని రీతూ అంది. అలాగలాగే మీలా ఇష్టమొచ్చినట్లు ఎవరూ చేయడం లేదు.. అంటూ మాధురి డైలగ్ వేసింది. ఏం బిహేవ్ చేస్తున్నాం చెప్పండి.. అంటూ రీతూ అడిగింది.

 

చూడండి లైట్స్ ఆపిన తర్వాత ఎవరూ మాట్లాడటానికి లేదు.. ఎందుకు ఆపుతున్నాడు లైట్స్ బిగ్‌బాస్.. ఊరుకే ఆపుతున్నాడా.. బిగ్‌బాస్ రూల్ ఉందా అని అడగడమేంటి.. అని మాధురి మళ్లీ అదే చెప్పింది. దీంతో మీరెవరు అది చెప్పడానికి.. అని రీతూ ఫుల్ రివర్స్ అయింది . నేను హౌస్ మెంబర్‌ని.. అంటూ మాధురి చెప్పగానే మీరు చెప్పిన మాట వినడానికి నేను రాలేదు.. అంటూ రీతూ ఆన్సర్ ఇచ్చింది. అయితే వెళ్లిపోండి.. అని మాధురి అంటే మీరు పొండి అయితే.. అంటూ రీతూ కూడా గట్టిగానే ఇచ్చింది. నేను ఎక్కడికీ పోను.. నా ఇష్టమొచ్చినట్లు అరుస్తాను.. చిరాకుగా ఉంటే బయటికి వెళ్లు.. అని మాధురి చెప్పింది. మేము కూడా అలానే నైట్ మాట్లాడతాం.. మీకు చిరాకుగా ఉంటే మీరూ బయటికెళ్లి పడుకోండి.. అని రీతూ అంది. దీంతో ఏయ్ ఎక్కువ మాట్లాడకు.. అని మాధురి వాయిస్ పెంచింది. ఏయ్ గియ్ అంటే పడటానికి ఎవరూ లేరు ఇక్కడ.. నా ఇష్టం నేను నవ్వుకుంటాను.. మాట్లాడతాను అని రీతూ అంది. దీనికి ఏం మాట్లాడుతున్నావ్ .. అని మాధురి అంటుంటే తెలుగు మాట్లాడుతున్నాను.. అంటూ రీతూ కౌంటర్ ఇచ్చింది. ఇక మాధురి చెప్పిన దానికి దివ్య కూడా ఒప్పుకోలేదు. ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే కెప్టెన్‌కి చెప్పాలి.. ఇలా రూల్స్ పాస్ చేయడం కాదు అని దివ్య అంది. దీనికి కెప్టెన్‌యే బెడ్ రూమ్‌లో కూర్చోబెట్టి మాట్లాడుతుంటే ఇంకెవరికి చెప్పాలి.. అంటూ మాధురి కౌంటర్ ఇచ్చింది. దీంతో కెప్టెన్ కళ్యాణ్ మాట్లాడాడు. బెడ్ రూమ్‌లో మాట్లాడకూడదు అనే రూల్ నేను పెట్టట్లేదు నేను పెట్టను.. స్లోగా మాట్లాడుకోండి. ఏమైనా సౌండ్ ఉంటే బయటికి వెళ్లి మాట్లాడుకోండి.. అంటూ సలహా ఇచ్చాడు. ఇలా మొత్తానికి మాధురి నిద్ర పోతుందని పెద్ద మీటింగ్ పెట్టి రూల్స్ చెప్పింది.

 

మరోవైపు రమ్య ఫుడ్ పవర్ యూజ్ చేసి ఆర్డర్ చేసిన ఆహారం బిగ్‌బాస్ పంపించాడు. ఇది చూసి మిగిలిన హౌస్‌మేట్స్ అందరికీ నోరు ఊరిపోయింది. కానీ రమ్య.. తాను సెలక్ట్ చేసుకున్న సుమన్ శెట్టితో మాత్రమే ఈ ఫుడ్ షేర్ చేసుకోవాలి. అయితే తినిపిస్తా అంటూ సంజన.. రమ్య పక్కన కూర్చుంది. దొంగపనులు నువ్వేదో ప్లాన్ చేశావ్ కదా అది అవసరమా.. అని రమ్యని అడిగిది. చేస్తే ఏదో ఒకటి చేసే వెళ్లిపోవాలి అలా కూర్చోకూడదు.. అని రమ్య అంది. జోకులన్నీ ఓకే కానీ దొంగతనం చేస్తే మళ్లీ మెడలో బోర్డు వేస్తారు.. బోర్డ్ పడితే ఓకేనా అని సంజన అడిగింది. చేస్తాను సంజన 2.0.. అవుతా.. వచ్చి కూర్చొంటా అనుకున్నారా ఏంటి.. అంటూ రమ్య అంది. ఇక దివ్య దగ్గరికెళ్లి భరణి మాట్లాడాడు. రీతూ నిన్ను, నన్ను నామినేట్ చేసిన తర్వాత కూడా నువ్వు తనతో అంత క్లోజ్‌గా ఉండటం కూడా నాకు నచ్చలేదు.. అని భరణి అన్నాడు. ఎవరు క్లోజ్‌గా ఉంది.. మీకు ఒక విషయం నచ్చకపోతే చెప్పరా మీలో మీరే పెట్టేసుకుంటారా.. నేను గుచ్చిగుచ్చి అడిగేవరకూ చెప్పరా.. అని దివ్య అడిగింది. చెప్పడం కాదు నువ్వు తనకి నడుము ఇరిగిపోయేంతలా ఆరోజు టాస్కులో హెల్ప్ చేశావ్.. సంబంధం లేకుండా ఆ తరువాతి రోజే నిన్ను నామినేట్ చేస్తే నేను ఏం అనుకోవాలి.. మొత్తం టెనెంట్స్ అందరూ నేను కెప్టెన్‌గా ఉండాలని హ్యాండ్స్ రైజ్ చేసినప్పుడు తను ఒప్పుకోలేదు.. ఇమ్మూ-నేను కెప్టెన్సీ టాస్కులో ఉన్నప్పుడు సంచాలక్‌గా ఎలా ఉందో కూడా తెలుసు..అయినా కానీ నా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు హెల్ప్ చేస్తానని చెప్పా.. ఆ పాయింట్ పెట్టి నన్ను నామినేట్ చేసింది.. ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు తన పక్కన కూర్చొని జోకులేసి నవ్వుకుంటుంటే నేను ఏ రకంగా తీసుకోవాలి.. నేను మాట్లాడొద్దని చెప్పట్లేదు కానీ అంత క్లోజ్‌ ర్యాపో ఏంటి.. అని భరణి ప్రశ్నించాడు.

 

క్లోజ్ ఏంటి నేను ఏం రీతూతో సింగిల్‌గా మాట్లాడలేదు అక్కడ ఇంకా ముగ్గురున్నారు.. అని దివ్య అంది. రేపు పొద్దున్న నేను చాలా స్ట్రాంగ్ పాయింట్స్ తీసి మాట్లాడాల్సి వస్తుంది.. అని భరణి అన్నాడు. మాట్లాడండి నేను ఎంత మాట్లాడినా ఏం చేసినా నామినేషన్స్ వచ్చేసరికి నేను గేమ్ గేమ్‌లానే ఆడతా.. అయినా మీరు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు.. నేను ఒక్క మనిషితో ఒక్క పూట మాటలాడితే మీరు అలా తీసేసుకుంటారా.. అక్కడ ఐదుగురున్నారు.. మీరు ఒక్క రీతూనే ఎందుకు చూస్తున్నారు.. దానికి మీరు హర్ట్ అయ్యారా.. అని దివ్య అడిగింది. హర్ట్ ఏం అవ్వలేదు.. నాకు అది ఎందుకో నచ్చలేదు.. చెప్పాలనిపించి చెప్పాను.. నిన్ను కంట్రోల్ చేసేంత సీన్ ఏం లేదు.. ఏదో మంచిది అనిపించినప్పుడు చెప్తాను.. వింటావా వినవా అనేది నీ ఇష్టం..అని భరణి అన్నాడు. ఈ మాటలకి దివ్య ఎమోషనల్ అయిది. ఇవే వద్దనేది..నాకు ఈ హౌస్‌లో ఫస్ట్ మీరే.. మీరు అందరితో మాట్లాడుతున్నారు.. నేను కూడా మాట్లాడాలి కదా.. ప్రతిదానికి మీరూ ఇలా అంటే ఎలా.. నిన్న ఏదో సరదాగా మాట్లాడా ఫస్ట్ టైమ్ నేను అలా మాట్లాడటం.. వేరే వాళ్లతో.. ఎందుకంటే ఎవరూ ఓపెన్ అప్ అవ్వట్లేదు అని చావగొడుతున్నారు నన్ను.. ఒక్కరితోటే ఉంటున్నావని.. ఉన్నవాళ్లలో మీ తర్వాత నాకు వాళ్లు బెటర్ అనిపించి వాళ్లతో మాట్లాడాను.. మీరు ఇంత అపార్థం చేసుకుంటారని నేను ఎప్పుడూ అనుకోలేదు. అని దివ్య ఏడ్చింది..నీకు ఏదైనా చెబ్దామంటే ఇలా బాధపడి ఏడుస్తావనే నేను ఏం చెప్పను.. అని భరణి అన్నాడు. కాదు మీరు అసలు ఇంత అపార్థం ఎలా చేసుకుంటారు.. అని దివ్య అంది. నిన్ను ఎవరూ కామెంట్ చేయడం కూడా నాకు ఇష్టం ఉండదు.. అని భరణి చెప్పాడు. నేను 100 మంది నన్ను అన్నా కూడా నేను ఫేస్ చేస్తాను కానీ నా మనిషిని ఏమైనా అంటే నేను తట్టుకోలేను.. మీకు అది అర్థం కాదా.. మీరు నా గురించి ఆలోచించడం కాదు నేను కూడా మీ గురించి ఆలోచిస్తాను కదా.. అని దివ్య అంది. వెంటనే భరణి కంట్లో నీళ్లు తిరిగాయి. దీంతో మీరు ఎందుకు ఏడుస్తున్నారు.. ఏడవకండి.. సారీ నేను అరిచినందుకు.. నేను చూడలేను మీరు ఏడవకండి.. అంటూ దివ్య ఓదార్చింది.

 

తర్వాత బిగ్‌బాస్ ఒక అనౌన్స్‌మెంట్ చేశాడు. ఫైర్ స్ట్రామ్స్ ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత నేను వాళ్ల ఉత్సాహం, ఆట తీరుని నిశితనంగా పరిశీలిస్తున్నాను.. అందుకే నేను వారిని కెప్టెన్సీ కంటెండర్స్‌గా ప్రకటిస్తున్నాను..ఇప్పుడు ఫైర్ స్ట్రామ్స్ మిగతావారి నుంచి ఐదుగురు కెప్టెన్సీ కంటెండర్స్‌ని ఎంచుకోవాల్సి ఉంటుంది.. వారు ఎవరో చర్చించి నిర్ణయించి చెప్పండి.. నిఖిల్ దగ్గర కంటెండర్ పవర్ ఉన్నందుకు ఈ ప్రక్రియలో ఆయన పాల్గొనరు.. అని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో వీళ్లు ఐదుగురు డిస్కస్ చేసి సంజన, భరణి, దివ్య, సుమన్ శెట్టి, తనూజలని కంటెండర్లుగ సెలక్ట్ చేశారు. వెంటనే బిగ్‌బాస్ ఒక టాస్క్ పెట్టాడు. ఈ బిగ్‌బాస్ హౌస్‌లో ఏదీ అంత సులువుగా లభించదని మీకు తెలుసు.. కనుక మీ కెప్టెన్సీ కంటెండర్‌షిప్ కాపాడుకోవడానికి ఫైర్స్ స్ట్రామ్స్ మరియు వారు ఎంచుకున్న సభ్యులు రెండు టీమ్స్‌గా ఏర్పడి ఒక టాస్కులో తలపడాల్సి ఉంటుంది.. దాని కోసం మీకు నేను ఇస్తున్న టాస్క్ కెప్టెన్సీ ఏ గోల్.. ఇందుకోసం గార్డెన్ ఏరియాలో గోల్ పోస్టులు బాల్ సిద్ధంగా ఉన్నాయి.. ప్రతి రౌండ్‌లో బజర్ మోగగానే రెండు టీముల సభ్యులు చేయాల్సింది ఏంటంటే రెడ్ లైన్ మీద ఉన్న బాల్‌ని తీసుకొని తమ శక్తిని లేదా ఇతర స్ట్రాటజీని ఉపయోగించి ప్రత్యర్థి గోల్ పోస్టులో గోల్ చేయాలి.. ఒకవేళ మీ టీమ్ ప్రత్యర్థి గోల్ పోస్ట్‌లో గోల్ చేయగలిగితే వారి టీమ్ నుంచి ఏ ఒక్కరిని రేసు నుంచి తప్పించాలనేది గోల్ చేసిన సభ్యులు నిర్ణయిస్తారు.. ఇలా టాస్క్ ముగిసే సమయానికి ఎవరు ఆటలో నిలుస్తారో ఆ సభ్యులు తమ కెప్టెన్సీ కంటెండర్‌షిప్‌ని కాపాడుకొని రేసులో నిలుస్తారు అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. ఈ టాస్కులో వైల్డ్‌కార్డ్స్ చాలా బాగా ఆడారు. ముఖ్యంగా సాయి, గౌరవ్ అయితే ఇరగదీశారు. అయితే అవతల టీమ్‌లో స్ట్రాంగ్ అయిన భరణిని ఒక్క రమ్య ఆపేయడం విశేషం. అసలు కండల పిల్ల కావడంతో భరణిని చాలా గట్టిగానే ఆపేసింది. దీంతో గౌరవ్, సాయి వరుసగా గోల్స్ వేసేశారు. మొదటి రౌండ్‌లో గెలిచి భరణిని ఎలిమినేట్ చేశారు. తర్వాత దివ్య, సంజన, తనూజలని తీసేశారు. ఇక చివరి రౌండ్ ముగిసేసరికి అవతలి టీమ్‌లో సుమన్ శెట్టి ఒక్కడే మిగిలాడు. దీంతో వైల్డ్ కార్డ్స్‌లో గేమ్ ఆడిన ఐదుగురు ప్లస్ సుమన్ శెట్టిలు కెప్టెన్సీ కంటెండర్లు అంటూ బిగ్‌బాస్ ప్రకటించాడు. వీళ్లకి నెక్స్ట్ ఎపిసోడ్‌లో మరో టాస్క్ పెడతాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BIG BOSS
  • big boss seanson telugu
  • Divvala Madhuri
  • Divvela Madhuri
  • Divya Bharathi updates
  • sanjjanaa galrani
  • star maa
  • Star Maa Bigg Boss

Related News

    Latest News

    • భారత విమానయాన రంగంలోకి కొత్తగా మూడు ఎయిర్‌లైన్స్!

    • విజయ్ హజారే ట్రోఫీలో రికార్డుల విధ్వంసం.. ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీ!

    • ఆర్సీబీ స్టార్ బౌలర్ యశ్ దయాల్‌కు చుక్కెదురు!

    • భోజనం తర్వాత నిద్ర వస్తోందా? అది కేవలం బద్ధకం కాకపోవచ్చు!

    • ఏపీలో సినిమా టికెట్‌ రేట్ల పెంపుపై కొత్త పాలసీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌

    Trending News

      • నిధి అగర్వాల్, సమంత పడ్డ వేదన నా మైండ్‌లో నుండి పోలేదు.. అందుకే అలా మాట్లాడాను Sivaji

      • శివాజీ వ్యాఖ్యలను సమర్థించిన కరాటే కల్యాణి

      • ఏపీలో సమగ్ర కుటుంబ సర్వే.. తల్లికి వందనం, ఇతర పథకాలపై ప్రభావం?!

      • సూర్యకుమార్ యాదవ్ తర్వాత భార‌త్ తదుపరి కెప్టెన్ ఎవరు?

      • భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd