KTR : సీఎం వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్..రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా..
KTR : మూసీకి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులను వివరిస్తామన్నారు. మూసీ పునరుజ్జీవం కోసం చేసిన ప్రయత్నాలు, ప్రణాళికలను వివరిస్తామన్నారు.
- Author : Latha Suma
Date : 17-10-2024 - 9:08 IST
Published By : Hashtagu Telugu Desk
Power point presentation : మూసీ రివర్ ఫ్రంట్ పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. రేపు అన్ని వివరాలు చెబుతానన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. మూసీ పరీవాహక ప్రాంతంలో ఉన్న ప్రజలకు మంచి జీవితం ఇవ్వాలనుకుంటున్నామని తెలిపారు. అలాగే ఈ ప్రాజెక్టు కాంట్రాక్ట్ టెండర్ రూ.141 కోట్లు అయితే లక్షన్నర కోట్ల రూపాయల ప్రాజెక్టు అని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన సుదీర్ఘ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంపై కేటీఆర్ స్పందించారు. మూసీకి సంబంధించి రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానని వెల్లడించారు. రేపు సాయంత్రం నాలుగున్నర గంటలకు తెలంగాణ భవన్‌లో ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుందన్నారు. మూసీకి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులను వివరిస్తామన్నారు. మూసీ పునరుజ్జీవం కోసం చేసిన ప్రయత్నాలు, ప్రణాళికలను వివరిస్తామన్నారు.
కాంగ్రెస్, బీజేపీ పార్టీలతో మనం జాగ్రత్తగా ఉండాలి. కాంగ్రెస్‌నే శత్రువుగా చూడాల్సిన అవసరం లేదు. తెలంగాణ సమాజానికి మరింత డేంజరస్ పార్టీ బీజేపీనే. మతాలను అడ్డంపెట్టుకుని, మతపరమైన రాజకీయాలు చేస్తూ.. దేవుడిని అడ్డుపెంట్టుకుని పిల్లలను రెచ్చగొడుతున్నారు. తెలంగాణకు చేసిందేమీ లేదు బీజేపీ. ఐఐటీ, ఐఐఎం, మెడికల్, నర్సింగ్ కాలేజీ ఇవ్వలేదు. ఆఖరికి ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వలేదు. తెలంగాణకు ఏం ఇచ్చారని అడిగితే ఎవరు చెప్పరు.. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు మాటలు రావు. కానీ పిల్లలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేశారని కేటీఆర్ ధ్వజమెత్తారు.