Ramaprabha Cousin Son Died : నటి రమాప్రభ ఇంట విషాదం
Actress Ramaprabha : రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రికి సంబంధించిన పెద్ద కర్మ కార్యక్రమంలోపాల్గొన్న సురేష్ స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు
- By Sudheer Published Date - 08:50 PM, Thu - 17 October 24

చిత్రసీమ(Film Industry)లో వరుస విషాదాలు కలవరపెడుతున్నాయి. నటీనటులు, వారి కుటుంబ సభ్యులు ఇలా చాలామంది వరుసగా పలుకారణాలతో కన్నుమూస్తున్నారు. గత రెండు నెలల వ్యవధిలోనే బాలీవుడ్ నటి ఆశా వర్మ, నటుడు వికాస్ సథీ, నిర్మల్ బెన్నీ, కమెడియన్ బిజిలి రమేష్, స్టార్ ప్రొడ్యూసర్ ఢిల్లీ బాబు, సీఐడీ శంకుతల మృతి చెందగా..ఇటీవలే నటుడు రాజేంద్ర ప్రసాద్ కూతురు (Daughter of Rajendra Prasad) కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇలా వరుస విషయాల నడుమ.. ప్రముఖ నటి రమాప్రభ (Ramaprabha ) ఇంట విషాదం నెలకొంది.
రమాప్రభ సోదరి కుమారుడు సురేష్ (Ramaprabha Cousin Son Suresh) ఆకస్మికంగా కన్నుమూశారు. రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రికి సంబంధించిన పెద్ద కర్మ కార్యక్రమంలోపాల్గొన్న సురేష్ స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. గత తొమ్మిది నెలలుగా సురేష్ కిడ్నీ కి సంబంధించిన వ్యాధితో బాధపడుతూ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స తీసుకుంటున్న సమయంలోనే ఆయన కన్నుమూసినట్లు తెలుస్తుంది. ఇక రమాప్రభ సమర్పణలో రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ‘అప్పుల అప్పారావు’ మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఇటీవల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు సురేష్. సురేష్ మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.
Read Also : Attack on TDP office : సజ్జల పై పోలీసుల ప్రశ్నల వర్షం..నాకు తెలియదు..గుర్తులేదు