Bengaluru Stampede Case: బెంగళూరు తొక్కిసలాట కేసులో తొలి అరెస్టు
Bengaluru Stampede Case: ఈ కేసులో RCB మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలే(Nikhil Sosale)ను శుక్రవారం బెంగళూరు విమానాశ్రయం(Bengaluru Airport)లో అరెస్ట్ చేశారు
- Author : Sudheer
Date : 06-06-2025 - 9:01 IST
Published By : Hashtagu Telugu Desk
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయోత్సవ వేడుకల సమయంలో చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన దురదృష్టకర తొక్కిసలాట ఘటనపై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో RCB మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలే(Nikhil Sosale)ను శుక్రవారం బెంగళూరు విమానాశ్రయం(Bengaluru Airport)లో అరెస్ట్ చేశారు. ఆయన ముంబై వెళ్లేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకు ముందే DNA ఎంటర్‌టైన్‌మెంట్, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA) మరియు RCBపై ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (FIR) నమోదు చేశారు.
Stress : పిల్లల నుండి పెద్దల వరకు అందరికి ఇదే సమస్య..నిర్లక్ష్యం చేస్తే అంతే సంగతి
కేసు భారతీయ న్యాయ సంహితా (BNS) లోని ఐదు విభాగాల కింద నమోదు కాగా, అందులో culpable homicide (అనుకోకుండా జరిగిన హత్యకు సంబంధించి) అయిన సెక్షన్ 105 కూడా ఉంది. DNA ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ RCB విజయోత్సవాలను నిర్వహించగా, KSCA స్థలాన్ని ఏర్పాటు చేసింది. సోసాలే DNA సంస్థతో కలిసి ఈ వేడుకల ప్రచార కార్యక్రమాలను సమన్వయం చేయడం చేసారు. కానీ పోలీసుల నుంచి ముందస్తు అనుమతులు తీసుకోకపోవడమే ఈ ఘటనకు మూలకారణంగా కనిపిస్తోంది. పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ ప్రచార ర్యాలీ అనధికారికంగా నిర్వహించబడినదిగా తేలింది.
Revanth Cabinet Decisions : క్యాబినెట్ నిర్ణయాలపై హరీశ్‌రావు ఆగ్రహం
ఈ ఘోర ఘటనలో 11 మంది మరణించగా, 30 మందికి పైగా గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విజయోత్సవాల సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద వేలాదిగా గుమికూడిన అభిమానులపై నియంత్రణ లేకపోవడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా రాజకీయ విమర్శలకు దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వం మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాజకీయ పక్షాలు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.