Revanth Cabinet Decisions : క్యాబినెట్ నిర్ణయాలపై హరీశ్‌రావు ఆగ్రహం
Revanth Cabinet Decisions : మహిళా సంఘాలకు ఇచ్చిన చెక్కుల విషయంలో ప్రభుత్వం గందరగోళంగా వ్యవహరిస్తోందని హరీశ్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నవంబర్‌లో ఇచ్చిన చెక్కులను మార్చిలో మళ్లీ ఇవ్వడం, ఇప్పటికీ ఆ చెక్కులు బ్యాంకుల్లో చెల్లుబాటుకావడంలేదు అనడం
- By Sudheer Published Date - 08:50 AM, Fri - 6 June 25

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) తీసుకున్న క్యాబినెట్ నిర్ణయాల(Cabinet Decisions)పై బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని, ప్రభుత్వ ఉద్యోగులు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తీవ్ర నిరాశకు గురయ్యారని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మరిచిపోయి మాటలతో మోసం చేస్తున్నారని విమర్శించారు.
Talliki Vandanam : తల్లికి వందనం మార్గదర్శకాలు విడుదల
డీఏ బకాయిల చెల్లింపుపై హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం మూడు డీఏలు వెంటనే చెల్లిస్తామని చెప్పి ఇప్పటి వరకు ఐదు డీఏలు పెండింగ్‌లో ఉంచిందని పేర్కొన్నారు. “ఒక్క డీఏ మాత్రమే ఇచ్చి, మిగతా వాటిని మర్చిపోవడం సిగ్గుచేటు” అని పేర్కొన్నారు. అంతేగాక పీఆర్సీ ఏర్పాటు విషయంలో కూడా కాంగ్రెస్ వెనుకడుగేస్తోందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు అయినా, పీఆర్సీపై స్పష్టత ఇవ్వకపోవడాన్ని ఉద్యోగుల పట్ల అవహేళనగా అభివర్ణించారు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల అంశంలో కూడా ప్రభుత్వం చర్చించకపోవడం ఆశ్చర్యకరమన్నారు.
Bengaluru Stampede: ఆర్సీబీకి మరో బిగ్ షాక్.. వారిని అరెస్ట్ చేయాలని సీఎం ఆదేశాలు!
మహిళా సంఘాలకు ఇచ్చిన చెక్కుల విషయంలో ప్రభుత్వం గందరగోళంగా వ్యవహరిస్తోందని హరీశ్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నవంబర్‌లో ఇచ్చిన చెక్కులను మార్చిలో మళ్లీ ఇవ్వడం, ఇప్పటికీ ఆ చెక్కులు బ్యాంకుల్లో చెల్లుబాటుకావడంలేదు అనడం హాస్యాస్పదమన్నారు. గతంలో క్యాబినెట్ నిర్ణయం లేకుండానే చెక్కులు ఇచ్చారని ఇప్పుడు నిర్ణయం తీసుకుంటామన్న మాటలు అసంబద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. “అవే చెక్కులను ఎన్నిసార్లు ఇస్తారు..? అవి చెల్లుబాటయ్యేలా చర్యలు తీసుకోవాల్సింది పోయి, కొత్తగా ప్రకటనలతో ప్రజలను మోసం చేస్తున్నారు” అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.