Prakash Goud : కాంగ్రెస్‌లో చేరిన రాజేంద్రనగర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రకాశ్ గౌడ్ చేరికతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లొ చేరిన ఎమ్మెల్యేల సంఖ్య ఏనిమిదికి చేరింది.
- By Latha Suma Published Date - 08:38 PM, Fri - 12 July 24

Congress: బీఆర్ఎస్ పార్టీకి మరో ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ నుంచి గెలిచిన ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్ లో చేరారు. జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రకాశ్ గౌడ్ చేరికతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లొ చేరిన ఎమ్మెల్యేల సంఖ్య ఏనిమిదికి చేరింది.
We’re now on WhatsApp. Click to Join.
Rajendranagar BRS MLA Prakash Goud joins Congress
కాంగ్రెస్ లోకి రాజేంద్రనగర్ బీఆరెస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
🔸జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.
🔸ఎమ్మెల్యేతో పాటు సీఎం సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన అనుచరులు.— Congress for Telangana (@Congress4TS) July 12, 2024
అయితే కొద్దిరోజుల ముందే ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్ లో చేరుతారనే వార్తలు బలంగా వినిపించాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రకాశ్ గౌడ్ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అదే సమయంలో పార్టీ మార్పు ఖాయమని అంతా భావించారు. కానీ ఆయన యూటర్న్ తీసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి తరపున ప్రచారం కూడా చేశారు. పార్టీ మారటం లేదని చెప్పుకొచ్చారు. దీంతో ఆయన బీఆర్ఎస్ లోనే కొనసాగుతారన్న చర్చ సాగింది.
కాగా, గ్రేటర్ హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ నియోజకవర్గం నుంచి ప్రకాశ్ గౌడ్ 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009, 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఆయన ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున రెండుసార్లు విజయం సాధించారు. మొన్నటి అసెంబ్లీ బీఆర్ఎస్ తరపున బరిలో ఉన్న ఆయన 32,096 ఓట్ల తేడాతో విక్టరీ కొట్టారు.