Rajasthan Shocker : ఆస్తి కోసం ఘాతుకం.. తమ్ముడిని ట్రాక్టర్‌తో తొక్కి చంపిన అన్న
Rajasthan Shocker : ఆస్తి వివాదం అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టింది. ఇది రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో అమానుష ఉదంతానికి దారితీసింది.
- By Pasha Published Date - 03:36 PM, Wed - 25 October 23

Rajasthan Shocker : ఆస్తి వివాదం అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టింది. ఇది రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో అమానుష ఉదంతానికి దారితీసింది. బహదూర్ సింగ్, అతర్ సింగ్ ఇద్దరూ సోదరులు. భరత్‌పూర్‌లోని ఓ స్థలంపై వీరిద్దరు చాలా రోజులుగా గొడవ పడుతున్నారు. ఇవాళ ఉదయం (అక్టోబర్ 25) బహదూర్ సింగ్ తన కొడుకులతో కలిసి వివాదాస్పద స్థలం దగ్గరికి ట్రాక్టర్‌పై వెళ్లాడు. ఆ వెంటనే సోదరుడు అతర్ సింగ్ కూడా తన కుమారులతో అక్కడికి చేరుకున్నాడు. అక్కడ ఇద్దరి కుటుంబాలు కర్రలతో కొట్లాడుకున్నాయి. ఒకరిపై ఒకరు రాళ్లను విసురుకున్నారు. కొంతమంది తుపాకులతో కాల్పులు(Rajasthan Shocker) జరుపుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ గొడవ జరుగుతున్న క్రమంలో అతర్ సింగ్ కుమారుడు నిర్పత్ కిందపడిపోయాడు. ఈక్రమంలో బహదూర్ సింగ్ కుమారుడు దామోదర్ ట్రాక్టర్ ను.. నిర్పత్ పైకి 8 సార్లు నడిపాడు. అతడు పూర్తిగా చనిపోయిన తర్వాతే ట్రాక్టర్ ను ఆపాడు. కుటుంబ సభ్యులు ఆపాలని ఎంత వేడుకున్నా పట్టించుకోకుండా కసి తీర్చుకున్నాడు. ఈ ఘటనలో చనిపోయిన నిర్పత్ కు నిందితుడు దామోదర్ వరుసకు అన్న అవుతాడు. ఈ ఘర్షణలో దాదాపు 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాస్తవానికి 5 రోజుల క్రితమే ఈ రెండు కుటుంబాలు గొడవ పడ్డాయి. ఓ వర్గం వాళ్లు మరో వర్గంపై పోలీస్ కంప్లెయింట్ ఇచ్చారు.