NCERT Books Bharat : ఇక ‘ఇండియా’కు బదులు ‘భారత్’.. ఎన్సీఈఆర్టీ బుక్స్‌లో కీలక మార్పు
NCERT Books Bharat : ‘ఇండియా’ పేరు ‘భారత్’గా మారిపోనుంది. ఔను.. ఎన్సీఈఆర్టీ(NCERT) పుస్తకాల్లో ‘ఇండియా’ అనే పదం ప్లేస్‌లో ‘భారత్’ అని ఇకపై ముద్రించనున్నారు.
- By Pasha Published Date - 03:01 PM, Wed - 25 October 23

NCERT Books Bharat : ‘ఇండియా’ పేరు ‘భారత్’గా మారిపోనుంది. ఔను.. ఎన్సీఈఆర్టీ(NCERT) పుస్తకాల్లో ‘ఇండియా’ అనే పదం ప్లేస్‌లో ‘భారత్’ అని ఇకపై ముద్రించనున్నారు. ఈమేరకు మార్పులు చేయాలని కొన్ని నెలల క్రితమే ప్రతిపాదనలు రాగా.. దీనిపై అధ్యయనానికి ఎన్సీఈఆర్టీ ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీ చేసిన సిఫార్సుల ప్రకారమే ఎన్సీఈఆర్టీ బుక్స్‌లో ‘ఇండియా’ అనే పదాన్ని ‘భారత్’తో రీప్లేస్ చేయాలని డిసైడ్ చేశారు. ఈ మార్పులు చేసే ప్రతిపాదనకు అధ్యయన కమిటీలోని సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారని NCERT వెల్లడించింది. ఎన్సీఈఆర్టీ బుక్స్‌లో ‘‘Hindu Victories’’ పేరిట ప్రత్యేకంగా ఓ పాఠాన్ని చేర్చాలని కూడా కమిటీ ప్రపోజ్ చేయడం గమనార్హం. చరిత్రకు సంబంధించిన కొన్ని పాఠాల్లోనూ మార్పులు చేయాలని సూచించింది. బ్రిటీష్ వాళ్ల కోణంలో స్కూల్ టెక్స్ట్ బుక్స్‌లో ప్రజెంట్ చేసిన చరిత్రను పూర్తిగా మార్చాలని కమిటీలోని నిపుణులు అభిప్రాయపడ్డారు. వీటితో పాటు సిలబస్‌లో ఇండియన నాలెడ్జ్ సిస్టం (IKS)ను ప్రవేశపెట్టాలని కమిటీ ప్రపోజ్ చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
జీ20 సదస్సు సమయంలో.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు దేశంలోని ప్రముఖులకు పంపిన ఆహ్వాన లేఖలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని రాశారు. దీనిపై రాజకీయ రగడ చోటుచేసుకోగా.. ‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 1(1)లో ‘ఇండియా దట్ ఈజ్ భారత్’ అని రాసి ఉంది. అందుకే రాష్ట్రపతి ఆహ్వాన లేఖలో ‘భారత్’ అనే పదాన్ని వాడారు’’ అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వివరణ (NCERT Books Bharat) ఇచ్చాయి.
Also Read: Congress vs BJP : బిజెపి ‘పద్మ’వ్యూహాన్ని కాంగ్రెస్ ఛేదించగలదా..?