HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Raj Pakala Who Attended The Trial Once Again

Raj Pakala : మళ్లీ విచారణకు హాజరైన రాజ్‌ పాకాల

Raj Pakala : బుధవారం రాజ్ పాకాలను 7గంటలకు పైగా మోకిల పోలీసులు విచారించిన విషయం తెలిసిందే. ఆయన ఫోన్ను స్వాధీనం చేసుకుని స్టేట్మెంట్ రికార్డు చేసిన అనంతరం విడిచిపెట్టారు. బీఎన్ఎస్ఎస్ 35 (3) సెక్షన్ కింద మరోసారి పిలిస్తే విచారణకు రావాలని పోలీసులు సూచించారు.

  • Author : Latha Suma Date : 01-11-2024 - 5:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Raj Pakala who attended the trial once again
Raj Pakala who attended the trial once again

Janwada Farmhouse Case : మాజీ మంత్రి, బీఆర్ఎస్​ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బావమరిది రాజ్‌ పాకాల జన్వాడ ఫామ్‌హౌస్‌ కేసుకు సంబంధించి ఈరోజు మరోసారి మోకిల పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. తన న్యాయవాదితో కలిసి వచ్చిన రాజ్ పాకాలను రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ దశరథ్ ఆధ్వర్యంలో విచారిస్తున్నారు. విదేశీ మద్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి వద్ద కొనుగోలు చేశారనే అంశాలపై ప్రధానంగా విచారిస్తున్నట్టు సమాచారం. బుధవారం రాజ్ పాకాలను 7గంటలకు పైగా మోకిల పోలీసులు విచారించిన విషయం తెలిసిందే. ఆయన ఫోన్ను స్వాధీనం చేసుకుని స్టేట్మెంట్ రికార్డు చేసిన అనంతరం విడిచిపెట్టారు. బీఎన్ఎస్ఎస్ 35 (3) సెక్షన్ కింద మరోసారి పిలిస్తే విచారణకు రావాలని పోలీసులు సూచించారు. ఈ నేపథ్యంలో నేడు ఎక్సైజ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.

మరోవైపు జన్వాడలో ఫామ్‌హౌస్‌పై ఇటీవల సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేశారు. ఇక్కడి రిజర్వ్‌ కాలనీలో ఉన్న రాజ్‌ పాకాల ఫామ్‌హౌస్‌లో శనివారం రాత్రి పార్టీ నిర్వహించారు. భారీ శబ్దాలతో ఈవెంట్‌ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో 21 మంది పురుషులు, 14 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. 35 మందితో నిర్వాహకులతో ఈ మద్యం పార్టీ నిర్వహించారు. డ్రగ్స్‌ పరీక్షలు నిర్వహించిన పోలీసులు రాజ్‌ పాకాల స్నేహితుడు విజయ్‌ మద్దూరి కొకైన్‌ తీసుకున్నట్లు నిర్ధరించారు. ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగానే రాజ్‌ పాకాలకు నోటీసులు జారీ చేశారు.

Read Also: wayanad : మళ్లీ వయనాడ్‌లో ప్రియాంకా గాంధీ ప్రచారం ప్రారంభం..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Deputy Commissioner Dasharath
  • inquiry
  • Janwada Farmhouse Case
  • ktr
  • mokila police station
  • Raj Pakala

Related News

    Latest News

    • టీ20 వరల్డ్ కప్ 2026.. నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం!

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • భార‌త్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌.. క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా?!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

    Trending News

      • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

      • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

      • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

      • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

      • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd