Rahul Gandhi : హైదరాబాద్ చేరుకున్న రాహుల్ గాంధీ
Rahul Gandhi : ఇప్పటికే వీరందిరికి సమావేశానికి సంబంధించి ఆహ్వానాలు అందాయి. మరికాసేపట్లో కులగణన అభిప్రాయ సేకరణ సమావేశం మొదలు కానుంది. కాగా ఈ సమావేశం అనంతరం రాహుల్ తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు.
- By Latha Suma Published Date - 06:32 PM, Tue - 5 November 24

Hyderabad : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కాసేపటి క్రితం హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇతర నేతలు రాహుల్ గాంధీకి స్వాగతం పలికారు. సికింద్రాబాద్‌లోని నేడు బోయిన్ పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో ఏర్పాటు చేస్తున్న సమావేశంలో కులగణన పై రాహుల్ గాంధీ వివిధ వర్గాల అభిప్రాయం తెలుసుకోనున్నారు. ఈ సమావేశానికి మేధావులు, ప్రొఫెసర్లు, వివిధ రంగాలకు చెందిన వారు దాదాపు 400 మంది దాకా హాజరవనున్నారు. ఇప్పటికే వీరందిరికి సమావేశానికి సంబంధించి ఆహ్వానాలు అందాయి. మరికాసేపట్లో కులగణన అభిప్రాయ సేకరణ సమావేశం మొదలు కానుంది. కాగా ఈ సమావేశం అనంతరం రాహుల్ తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు.
కాగా, జనాభా సామాజిక-ఆర్థిక, కుల వివరాలను అంచనా వేయడానికి నవంబర్ 6 నుండి సమగ్ర సర్వే ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇళ్లల్లోని సభ్యుల వివరాలు, వారి కులం, ఉపకుల స్థితి, ఆర్థిక స్థితి, రాజకీయ ప్రాతినిధ్యం, ఇతర అంశాలను వాలంటీర్లు తెలుసుకోనున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ గాంధీకికాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచిరోడ్డు మార్గాన ఆయన బోయినపల్లికి బయలుదేరి వెళ్లారు.