Murmu : దేశ ప్రజలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం
ఆర్థిక, క్రీడా, మౌలిక వసతుల కల్పన తదితర రంగాల్లో దేశం సాధించిన విజయాలను తన ప్రసంగంలో రాష్ట్రపతి ప్రశంసించారు.
- By Latha Suma Published Date - 09:16 PM, Wed - 14 August 24

President Draupadi Murmu : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతదేశ 78వ స్వాతంత్య దినోత్సవ వేడుకల (Independence Day) సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు 140 కోట్ల ప్రజానీకం ఎంతో సంబరంగా జరుపుకొనేందుకు సిద్ధమవుతోందని అన్నారు. దేశ గౌరవం, ఐక్యతను చాటే ఈ వేడుక మనకందరికీ గర్వకారణమని అన్నారు. ఆగస్టు 15వ తేదీన 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బుధవారం రాత్రి 7 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ఆర్థిక, క్రీడా, మౌలిక వసతుల కల్పన తదితర రంగాల్లో దేశం సాధించిన విజయాలను తన ప్రసంగంలో రాష్ట్రపతి ప్రశంసించారు. ప్రపంచంలోనే ఐదవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవడం గర్వకారణమని చెప్పారు.
#WATCH | On the eve of Independence Day, President Droupadi Murmu says "As general elections were held in our country this year, the number of eligible voters stood at nearly 97 crore. This was a historic record, making it the largest electoral exercise humankind has ever… pic.twitter.com/4VzN6hvQPu
— ANI (@ANI) August 14, 2024
ఎందరెందరో సమరయోధుల పోరాట ఫలితంగా దేశానికి స్వాతంత్ర్య సిద్ధించిందని, భగత్ సింగ్, చంద్రశేఖర్, ఆజాద్, సుఖదేవ్ వంటి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు నిరుపమానమని రాష్ట్రపతి ఈ సందర్భంగా కొనియాడారు. ఆగస్టు 14వ తేదీన దేశ విభజన నాటి పీడకలను స్మరించుకునే రోజు ఇదని, విభజన సమయంలో వేలాది మంది బలవంతంగా దేశం విడిచివెళ్లారని, అనేక మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నాటి ట్రాజెడీని స్ఫురణకు తెచ్చుకుని, సమష్టిగా బాధిత కుటుంబాలకు బాసటగా నిలవాలని అన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
దేశ స్వాతంత్ర్య కోసం గిరిజనలు చేసిన పోరాటాన్ని గుర్తు చేస్తూ, తిల్కా మాంజి, బిర్సా ముండా, లక్ష్మణ్ నాయక్, ఫులో-ఝానో తదితరులు చేసిన అసమాన త్యాగాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. భగవాన్ బిర్సా ముండా జయంతిని జన్‌జాతీయ గౌరవ్ దివస్‌గా జరుపుకొంటున్నామని, వచ్చే ఏడాది ఆయన 150వ జయంత్యుత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకోనున్నామని చెప్పారు.
స్వాతంత్ర్య సమరయోధులకు నివాళిగా కొత్త క్రిమినల్ చట్టాలను ప్రభుత్వం అమలులోకి తెచ్చిందని రాష్ట్రపతి అన్నారు. ప్రభుత్వ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ, గత కొన్నేళ్లుగా మౌలిక సదుపాయాల రంగంలో ఎంతో పురోగతి సాధించామని, రోడ్లు, హైవేలు, రైల్వేలు, నౌకాశ్రయాలతో సహా వివిధ రంగాల్లో మౌలిక వసతుల కల్పన కొత్తపుంతలు తొక్కిందని అన్నారు. 2020లో ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ విద్యా విధానం ఫలితాలను ఇవ్వడం మొదలుపెట్టిందన్నారు.
Read Also: Jawa 42: బైక్ ప్రియులకు శుభవార్త.. భారత మార్కెట్‌లోకి జావా 42, ధర ఎంతంటే..?
భారతదేశం ప్రపంచంలోని 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవడం దేశానికి గర్వకారణమని ద్రౌపది ముర్ము అన్నారు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా భారతదేశం దూసుకువెళ్తోందన్నారు. రైతులు, కార్మికులు, దూరదృష్టి కలిగిన పాలసీ మేకర్లు, పారిశ్రామిక వేత్తలు, విజనరీ నాయకత్వ కఠోర శ్రమవల్లే ఇది సాకారమవుతోందని ప్రశంసించారు. పారిస్ ఒలింపిక్స్‌లో విజయాలు సాధించిన భారతీయ అథ్లెట్లు, టీ-20 వరల్డ్ కంప్ సాధించిన టీమ్ ఇండియాకు రాష్ట్రపతి తన ప్రసంగంలో అభినందనలు తెలిపారు.
ప్రధానమంత్రి ఇన్‌టర్న్‌షిప్ స్కీమ్‌ను రాష్ట్రపతి ప్రశంసించారు. దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా యువతకు వర్క్ ఎక్స్‌పీరియన్స్, స్కిల్ డవలప్‌మెంట్‌కు ఈ స్కీమ్ ఉద్దేశించిందని చెప్పారు. మహిళలు సాధికారత కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని, నారీశక్తిని విస్తరించేందుకు నిర్విరామ కృషి చేస్తోందని అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన ఎన్నికల కమిషన్, అధికారులు, భద్రతా సిబ్బందిని కూడా రాష్ట్రపతి తన ప్రసంగంలో అభినందించారు.