Parrot Missing : చిలుక మిస్సింగ్ .. ఆచూకీ చెబితే రూ.10వేలు !
Parrot Missing : మనుషులు తప్పిపోతే మిస్సింగ్ పోస్టర్లు పెట్టే వాళ్లను చూశాం.. వెహికల్స్ చోరీకి గురైతే పోస్టర్లు పెట్టే వాళ్లను చూశాం..
- By Pasha Published Date - 04:51 PM, Wed - 2 August 23

Parrot Missing : మనుషులు తప్పిపోతే మిస్సింగ్ పోస్టర్లు పెట్టే వాళ్లను చూశాం..
వెహికల్స్ చోరీకి గురైతే పోస్టర్లు పెట్టే వాళ్లను చూశాం..
కానీ ఒక వ్యక్తి తాను పెంచుకునే చిలుక తప్పిపోయిందని పోస్టర్లు పెట్టాడు..
తన ప్రియమైన చిలుక ఆచూకీ చెప్పిన వాళ్లకు.. 10వేల రూపాయలు ఇస్తానని ఆ పోస్టర్లలో ప్రకటించాడు.
Also read : Koheda Market: ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ కోహెడ, రూ. 403 కోట్లతో నిర్మాణం
ఒక చిలుకపై కూడా ఇంతటి ప్రేమను పెంచుకున్న ఆ వ్యక్తి పేరు దీపక్ సోనీ. మధ్యప్రదేశ్‌లోని దామోహ్ వాసి. అతడు దామోహ్ టౌన్ లో చాలా చోట్ల “చిలుక మిస్సింగ్” పోస్టర్లు పెట్టాడు. ఆటోరిక్షా డ్రైవర్లకు డబ్బులు ఇచ్చి మరీ.. వాటి వెనుక కవర్ పై తన పోస్టర్లను అతికించాడు. దీన్నిబట్టి తప్పిపోయిన తన చిలుక కోసం దీపక్ సోనీ ఎంతగా బాధపడుతున్నాడో అర్ధం చేసుకోవచ్చు. “ఆ చిలుకను నేను గత రెండేళ్లుగా పెంచుకుంటున్నాను. మంగళవారం రాత్రి మా నాన్న దాన్ని గూటి నుంచి బయటకు తీయగానే ఎగిరిపోయింది. అప్పటి నుంచి నేను టౌన్ లోని వీధులన్నీ తిరుగుతూ వెతుకుతున్నాను. అయితే చిలుక సరిగ్గా ఎగరలేని స్థాయిలో ఉంది. అది ఎక్కువ దూరం ఎగురుతూ పోలేదు. అందుకే లోకల్ గా ఎవరికైనా కనిపిస్తే చెప్తారనే ఆశతో ఇలా చిలుక మిస్సింగ్ పోస్టర్లను(Parrot Missing) అంటించాను” అని దీపక్ సోనీ తెలిపాడు. “గతవారం కూడా నా చిలుక ఎగిరిపోయింది. అయితే మళ్ళీ దానికదే తిరిగి వచ్చింది. కానీ ఈసారి అది తిరిగి రాలేదు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. “నా చిలుక అడ్రస్ చెబితే వెంటనే 10వేలు ఇస్తాను” అని స్పష్టం చేశాడు.
Also read : Island: ప్రాణం మీద ఆశ ఉందా.. అయితే పొరపాటున కూడా ఆ ప్రదేశానికి వెళ్ళకండి?