Koheda Market: ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ కోహెడ, రూ. 403 కోట్లతో నిర్మాణం
ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ మన తెలంగాణలో ఏర్పాటుకాబోతుంది.
- By Balu J Published Date - 04:22 PM, Wed - 2 August 23

ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ మన తెలంగాణలో ఏర్పాటుకాబోతుంది. సకల హంగులతో కోహెడ మార్కెట్ తో వ్యాపారులు, ట్రేడర్లు, రైతులకు అన్ని రకాల వసతులు సమకూరుతాయి. దాదాపు 199 ఎకరాల్లో రూ. 403 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మిస్తామని తెలంగాణ వ్యవవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. మార్కెట్ నిర్మాణ ప్రణాళిక ముఖ్యమంత్రి ఆమోదం తీసుకుని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.
హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో కోహెడ పండ్లమార్కెట్ నిర్మాణంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనతో పాటు హోంమంత్రి మహమూద్ అలీ, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఎంఐఎం ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఓవైసీ, కౌసర్ మొహియుద్దీన్, అహ్మద్ బిన్ అబ్దుల్ల బలాలా, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, అదనపు సంచాలకులు లక్ష్మణుడు, ఆర్డీడీఎం పద్మహర్ష తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కోహెడ మార్కెట్ కోసం ప్రతి ముఖ్యమైన ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తోంది.
కోహెడలో నిర్మిస్తున్న మార్కెట్‌ను జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. కోహెడ మార్కెట్ నిర్మాణంపై ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అతి త్వరలోనే నెలల్లో కోహెడ మార్కెట్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందిస్తామని, వేల ఎకరాల్లో గ్లోబల్ గ్రీన్ మార్కెట్‌గా తీర్చిదిద్దుతామని అన్నారు.
ప్రత్యేకతలు ఇవే
48.71 ఎకరాల్లో షెడ్ల నిర్మాణం,
16.50 ఎకరాల్లో కోల్డ్ స్టోరేజీల నిర్మాణం
11.76 ఎకరాలలో పండ్ల ఎగుమతులకై ఎక్స్ పోర్టు జోన్
56.54 ఎకరాల్లో రహదారులు
11.92 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు
Also Read: Single Mother: మూడేళ్లుగా లైఫ్ పార్ట్ కోసం ఎదురుచూపులు, 1000 మందికి నో చెప్పిన సింగిల్ మదర్!