Island: ప్రాణం మీద ఆశ ఉందా.. అయితే పొరపాటున కూడా ఆ ప్రదేశానికి వెళ్ళకండి?
భూమిపై ఎన్నో రకాల తెగలకు చెందిన ప్రజలు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే అన్ని అందులో కొన్ని రకాల తెగలు చాలా భయంకరమైనవి. ముఖ్యంగా మన
- By Nakshatra Published Date - 04:21 PM, Wed - 2 August 23
భూమిపై ఎన్నో రకాల తెగలకు చెందిన ప్రజలు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే అన్ని అందులో కొన్ని రకాల తెగలు చాలా భయంకరమైనవి. ముఖ్యంగా మనుషులను చూస్తే చాలు వారు కొట్టి చంపి కాల్చుకు తినేస్తారు. అటువంటి ప్రదేశాలకు వెళ్లడం అంటే ప్రాణాలపై ఆశలను వదులుకోవడమే చెప్పవచ్చు. ఇప్పుడు అలాంటి ప్రదేశం గురించి మనం తెలుసుకుందాం.. నార్త్ సెంటినెల్ ద్వీపం అండమాన్ దీవుల సమూహంలోని ఒక ద్వీపం. ఇది దక్షిణ అండమాన్ జిల్లా పరిధిలోకి వస్తుంది. అయితే ఇక్కడికి వెళ్లడానికి ఎవరికీ అనుమతి లేదు.
ఈ ద్వీపాన్ని ఎవరూ కూడా సందర్శించకపోవడానికి ప్రధాన కారణం. ప్రపంచంతో సంబంధం లేని తెగలు ఇక్కడ ఉంటున్నాయి. నార్త్ సెంటినెల్ ద్వీపం 23 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న ఒక చిన్న ద్వీపం. దీనిలో మనుషులు 60 వేల సంవత్సరాలుగా నివసిస్తున్నారు. అయితే వారు తీసుకునే ఆహారం, వారి జీవనం ప్రపంచానికి నేటికీ మిస్టరీగానే ఉన్నాయి. ఈ ద్వీపం అండమాన్, నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్‌కు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. సెంటినలీస్ తెగవారు ఈ ద్వీపంలో నివసిస్తున్నారు. వారు ఇప్పటి వరకు వారు ఇతరుల నుంచి ఎటువంటి దాడిని ఎదుర్కోలేదు. ఈ మనుషుల తక్కువ ఎత్తు కలిగివుంటారు.
కార్బన్ డేటింగ్ పరిశోధన ద్వారా ఈ తెగ రెండు వేల ఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
నార్త్ సెంటినెల్ ద్వీపాన్ని బయటి వ్యక్తులు సందర్శించేందుకు అనుమతి లేదు. ఇక్కడి గిరిజనులను రక్షించేందుకు భారత ప్రభుత్వం అండమాన్,నికోబార్ దీవుల నియంత్రణ, 1956 చట్టాన్ని జారీ చేసింది. అడ్మినిస్ట్రేషన్ మినహా ఇతరుల ప్రవేశాన్ని ఇక్కడ నిషేధించారు. నార్త్ సెంటినెల్ ద్వీపంలో నివసించే గిరిజనులు బయటి ప్రపంచం నుండి ఎవరైనా తమ ప్రాంతానికి రావడాన్ని ఇష్టపడరు. ఇతర ప్రాంతాలవారు వస్తే అక్కడి గిరిజనులు వారిని హింసించి, హత్య చేస్తారు. 2006లో ఈ ద్వీపంలో ఇద్దరు మత్స్యకారులు మృతి చెందారు. 2018 నవంబరులో అమెరికాకు చెందిన జాన్ అలెన్ చౌ అనే వ్యక్తి చట్టవిరుద్ధంగా ఈ ద్వీపానికి వెళ్లి, అక్కడి గిరిజనుల చేతిలో హత్యకు గురయ్యాడని చెబుతారు.
Related News
China Spy Base In Cuba : అమెరికాకు చెక్.. క్యూబాలో చైనా స్పై బేస్ ?
China Spy Base In Cuba : అమెరికా ఆగడాలకు చెక్ పెట్టేందుకు చైనా కొత్త స్కెచ్ వేసింది.. తన బార్డర్స్ కు దగ్గరున్న దక్షిణ కొరియా, తైవాన్, జపాన్ లలో అమెరికా సైన్యం యాక్టివిటీకి ఆన్సర్ ఇచ్చేలా అదే విధమైన ఒక ప్లాన్ వేసింది.. ఇందులో భాగంగా అమెరికా పక్కనే ఉండే కమ్యూనిస్టు దేశం క్యూబాలో గూఢచారి స్థావరాన్ని (స్పై బేస్) ఏర్పాటు చేయబోతోంది.