HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Trending
  • ⁄Parents Sold 2 Months Old Son For 30 Thousand To Buy Liquor

Crime: మద్యం కోసం అలాంటి పనికి దిగజారిన తల్లిదండ్రులు.. రెండు నెలల చిన్నారిని అలా?

ప్రస్తుత సమాజంలో మనుషులు డబ్బుల కోసం ఎంతటి నీచానికైనా దిగజారడానికి సిద్ధంగా ఉన్నారు. డబ్బు కోసం ఎదుటి వ్యక్తిని చంపడానికి చావడానికైనా వెనకాడటం లేదు.

  • By Nakshatra Published Date - 09:49 AM, Thu - 23 June 22
Crime: మద్యం కోసం అలాంటి పనికి దిగజారిన తల్లిదండ్రులు.. రెండు నెలల చిన్నారిని అలా?

ప్రస్తుత సమాజంలో మనుషులు డబ్బుల కోసం ఎంతటి నీచానికైనా దిగజారడానికి సిద్ధంగా ఉన్నారు. డబ్బు కోసం ఎదుటి వ్యక్తిని చంపడానికి చావడానికైనా వెనకాడటం లేదు. అదేవిధంగా అదే డబ్బుల కోసం బంధాలను కూడా అమ్ముకుంటున్నారు. తాజాగా తల్లిదండ్రులు పచ్చనోట్ల కోసం ఏకంగా కన్న ప్రేమని అమ్మేశారు. మద్యానికి బానిసలైన ఆ తల్లిదండ్రులు పశువుల కంటే హీనంగా ప్రవర్తించారు. మద్యం కొనుక్కోవడానికి డబ్బులు లేకపోవడంతో ఏకంగా రెండు నెలల చిన్నారిని 30 వేల రూపాయలకు అమ్మేశారు. మానవత్వం సిగ్గుపడే ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని లిఖింపూర్ లో ఖేరీలో చోటు చేసుకుంది.

ఆ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో ఆ చిన్నారిని కొనుక్కున్న ఆ వ్యక్తి తిరిగి తల్లిదండ్రులకు అప్పగించేశారు. ఆ తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని లిఖింపూర్ ఖేరీ లో మొహమ్మది కొత్వాలి ప్రాంతానికి చెందిన జగ్తార్ సింగ్, అతని భార్య ఇద్దరు మద్యానికి బానిసలు. వీరిద్దరూ తరచుగా మద్యం సేవిస్తూ ఉండేవారు. ప్రతి ఒక్క రోజు మద్యం సేవించడం కోసం డబ్బులు లేకపోవడంతో అప్పుడు ఆ భార్య భర్తలు వారి రెండు నెలల కొడుకుని అమ్మేయాలని నిర్ణయించుకున్నారు.

మధ్యవర్తి ద్వారా మాట్లాడుకొని పిల్లలు లేని నిజాముద్దీన్ అనే వ్యక్తికి భార్య భర్తలు వారికి రెండు నెలల కొడుకును 30 వేల రూపాయలకు అమ్మేశారు. మీరు వేరే మతానికి చెందిన వ్యక్తికి కొడుకును అమ్మడం కుల పెద్దలకు నచ్చకపోవడంతో వారు పెద్ద సంఖ్యలో స్థానిక పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఇద్దరి పై కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం రెండు వర్గాలకు సంబంధించిన ది కావడంతో పోలీసు వారు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. చిన్నారిని కొనుకున్న ఆ వ్యక్తి ఆచూకీ తెలుసుకుని అతడిని స్టేషన్ కు పిలిపించారు. ఆ రెండు నెలల చిన్నారిని తిరిగి జగ్తార్ సింగ్ దంపతులకు అప్పగించారు. అనంతరం ఆ భార్యభర్తలిద్దరు పై పోలీస్ కేసు నమోదు చేశారు.

Tags  

  • 2 months old son
  • crime
  • liquor
  • Parents
  • sold
  • Uttar pradesh
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

38 Tested Covid: కరోనా కలకలం.. యూపీలో 38 విద్యార్థినులకు కోవిడ్ పాజిటివ్

38 Tested Covid: కరోనా కలకలం.. యూపీలో 38 విద్యార్థినులకు కోవిడ్ పాజిటివ్

తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలోని మితౌలీ బ్లాక్‌లోని కస్తూర్బా రెసిడెన్షియల్ పాఠశాలలో 38 మంది బాలికలు కరోనా వచ్చింది.

  • Delhi Deal: ఢిల్లీ డీల్, అరెస్టులు లేనట్టే?

    Delhi Deal: ఢిల్లీ డీల్, అరెస్టులు లేనట్టే?

  • Rahul Gandhi : తెలుగు రాష్ట్రాల్లోని నేతల బూతులు కంటే రాహుల్ నేరం చేశారా?

    Rahul Gandhi : తెలుగు రాష్ట్రాల్లోని నేతల బూతులు కంటే రాహుల్ నేరం చేశారా?

  • A Baby Died: పోలీసుల కాళ్ల కింద నలిగి శిశువు దుర్మరణం..!

    A Baby Died: పోలీసుల కాళ్ల కింద నలిగి శిశువు దుర్మరణం..!

  • Drugs : అస్సాం, మిజోరం రాష్ట్రాల్లో భారీగా డ్ర‌గ్స్ స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్‌

    Drugs : అస్సాం, మిజోరం రాష్ట్రాల్లో భారీగా డ్ర‌గ్స్ స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్‌

Latest News

  • Lord Hanuman : మంగళవారం హనుమంతుడి గురించి ఈ కథ తెలుసుకుంటే దరిద్రం పోయి…కోటీశ్వరులు అవుతారు..

  • Shooting in US : అమెరికాలో దారుణం. పాఠశాలలో విచక్షణారహిత కాల్పులు, 7 విద్యార్థులు మృతి

  • Cheetah Sasha : కునో నేషనల్ పార్క్‎లో నమీబియా ఆడ చిరుత సాషా మృతి

  • Crypto King: ప్రజలను నిండా ముంచి ప్రైవేట్ జెట్ కొన్న క్రిప్టో కింగ్.. బయటపడిన కిడ్నాప్ డ్రామా?

  • Samantha: మళ్లీ ప్రేమలో పడొచ్చు కదా అంటూ సమంతకు సలహా.. అదిరిపోయే సమాధానం ఇచ్చిన బ్యూటీ?

Trending

    • World Trip in Bus: బస్సులో ప్రపంచ యాత్ర మీకు తెలుసా.. 22 దేశాలు.. 56 రోజులు.. 12 వేల కిలోమీటర్లు

    • Shocking News: సగం ధరకు పడిపోయిన ట్విట్టర్ విలువ

    • Virat Kohli: 9వ తరగతి ఎక్సామ్ లో విరాట్ కోహ్లీపై ప్రశ్న.. వైరల్ వైరల్

    • Bank Holidays in April 2023: ఏప్రిల్ లో 15 రోజులు బ్యాంక్ సెలవులు.. ఎప్పుడెప్పుడు అంటే..!

    • Tejashwi Yadav : తండ్రైన బీహార డిప్యూటీ సీఎం..ఫొటో షేర్ చేసిన తేజస్వీ యాదవ్

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: