IND- PAK : నిశ్చితార్థం చేసుకున్న రెండు దేశాల అమ్మాయిలు
భారత్ - పాకిస్థాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం ఉంది. అయితే రెండు దేశాల ...
- By Prasad Published Date - 07:23 AM, Sat - 24 September 22

భారత్ – పాకిస్థాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం ఉంది. అయితే రెండు దేశాల మధ్య వైరాన్ని పక్కకు పెట్టారు ఓ ఇద్దరు అమ్మాయిలు. పాకిస్థాన్ అమ్మాయి, భారత్ అమ్మాయి ఇద్దరు అమ్మాయిల ప్రేమ చిగురించి చివరకు నిశ్చితార్థం వరకు వచ్చింది. నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నభారత్‌కి చెందిన అంజలి, పాకిస్థాన్‌కి చెందిన సూఫీ అర్టిస్ట్ ఇటీవల నిశ్చితార్ధం చేసుకున్నారు. ఆ ఫొటోలను నెట్టింట్లో పెట్టగా, అవి వైరల్‌గా మారాయి. వీరిద్ధరూ తొలిసారిగా న్యూయార్క్‌లో కలిశారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఒకరినొకరు అర్ధం చేసుకోవడం, ప్రపోజ్, నిశ్చితార్ధం ఇలా చకచకా జరిగిపోయాయి. అయితే వీరి పెళ్లిని మాత్రం ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడంలేదు. అయితే వారిని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ఈ ఇద్దరు అమ్మాయిలు ఆలోచనలో ఉన్నారట. మరి ఈ ఇద్దరి వివాహం ఎప్పుడు జరుగుతోందో వేచి చూడాలి.