Trending
-
PAN-Aadhaar Card: పాన్-ఆధార్ కార్డు లింక్ చివరి తేదీ ఎప్పుడు? స్టెప్ బై స్టెప్ ప్రక్రియ ఇదే!
పాన్, ఆధార్ కార్డును లింక్ చేయడానికి చివరి తేదీ 31 డిసెంబర్ 2025. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) నోటిఫికేషన్ ప్రకారం.. పాన్ కార్డు హోల్డర్లు తమ ఆధార్ నంబర్‌తో వెరిఫై చేయడానికి చివరి తేదీ 31 డిసెంబర్ 2025.
Published Date - 02:03 PM, Thu - 12 June 25 -
CM Chandrababu : ఎన్డీయే కూటమికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు : సీఎం చంద్రబాబు
సంపదను సృష్టించి, దానిని సమర్థంగా వినియోగిస్తాం. ఆ ఆదాయాన్ని ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి వెచ్చిస్తున్నాం. ముఖ్యంగా విద్యార్థులకు ప్రయోజనం కలిగించే 'తల్లికి వందనం' పథకాన్ని విస్తృతంగా అమలు చేస్తున్నాం అని చంద్రబాబు వెల్లడించారు.
Published Date - 01:36 PM, Thu - 12 June 25 -
Pawan Kalyan : డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ ప్రమాణానికి ఏడాది.. జనసేన ఆసక్తికరమైన వీడియో
ఈ వీడియోలో పవన్ కల్యాణ్ పరిపాలనలో తీసుకున్న కీలక నిర్ణయాలను హైలైట్ చేశారు. అందులో ప్రతి ఇంటికీ తాగునీరు చేరాలన్న సంకల్పంతో చేపట్టిన చర్యలు, గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా 39 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం, అడవుల్లో పని చేసే కుంకీ ఏనుగులను తిరిగి ప్రవేశపెట్టడం వంటి విభిన్న చర్యలు ప్రస్తావించారు.
Published Date - 12:59 PM, Thu - 12 June 25 -
New UPI Rules: ఫోన్‌పే, గూగుల్ పే యూజర్లకు అలర్ట్.. జూలై 31 వరకు సులభమే!
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూపీఐ వ్యవస్థకు సంబంధించిన నియమాలలో ఆగస్టు 1 నుండి మార్పులు చేయనుంది. దీని వెనుక ఉన్న కారణం యూపీఐ వ్యవస్థపై భారాన్ని తగ్గించడం మాత్రమే.
Published Date - 12:49 PM, Thu - 12 June 25 -
Gold Rate : మరోసారి రూ.లక్ష దాటిన పసిడి ధర
హైదరాబాద్ బులియన్ మార్కెట్ తాజా సమాచారం ప్రకారం, గురువారం 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1,00,210గా నమోదైంది. ఇదే సమయంలో కిలో వెండి ధర రూ.1,08,700కి పెరిగింది. వాణిజ్యంగా చూస్తే ఇది వినియోగదారులకు భారంగా మారినా, మదుపరుల దృష్టిలో బంగారం మరింత విశ్వాసనీయ పెట్టుబడిగా నిలుస్తోంది.
Published Date - 12:40 PM, Thu - 12 June 25 -
PM Modi : సాంకేతికత వల్ల ప్రజల జీవన విధానంలో విప్లవాత్మక మార్పులు : ప్రధాని మోడీ
ఇది సాంకేతికత శక్తిని ప్రదర్శించేదిగా నిలుస్తుందని ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్లలో పేర్కొన్నారు. సాంకేతికతను యథార్థంగా వినియోగించుకుంటూ, యువశక్తిని ప్రేరణగా తీసుకుంటూ భారత దేశం అద్భుతమైన పురోగతి సాధిస్తోంది.
Published Date - 12:18 PM, Thu - 12 June 25 -
China : పర్యాటక రంగానికి మరింత ఊతం ఇచ్చేందుకు చైనా కీలక నిర్ణయం..!
55 దేశాలకు చెందిన పౌరులు ఇకపై చైనాలో 240 గంటల (దాదాపు 10 రోజులు) వరకు వీసా లేకుండానే ప్రయాణించేందుకు అనుమతినిచ్చారు. ఈ విషయం ప్రభుత్వ వార్తా సంస్థ అయిన షిన్హువా న్యూస్ ఏజెన్సీ ద్వారా వెల్లడించబడింది.
Published Date - 11:40 AM, Thu - 12 June 25 -
CM Chandrababu : ప్రజల ఆశీర్వాదంతో ప్రజాపాలనకు నూతన దిశ: ఏపీ సీఎం చంద్రబాబు
ప్రజల ఆశయాలను నెరవేర్చడం కోసం శక్తి వంచన లేకుండా పని చేస్తున్నాం. ఎన్నో సవాళ్ల మధ్య, ముఖ్యంగా ఆర్థిక ఒడిదుడుకుల మధ్య, మేము ముందుకు సాగుతున్నాం. పేదల సేవలో వినూత్న సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం అని సీఎం చంద్రబాబు చెప్పారు.
Published Date - 11:32 AM, Thu - 12 June 25 -
RCB For Sale: అమ్మకానికి ఆర్సీబీ.. రూ. 17 వేల కోట్లు ఫిక్స్ చేసిన జట్టు యజమాని?!
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ సంస్థ 2 బిలియన్ డాలర్లు అంటే సుమారు 17,000 కోట్ల రూపాయలతో ఆర్సీబీని అమ్మాలని నిర్ణయించింది. గతంలో యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ విజయ్ మాల్యాది.
Published Date - 05:45 PM, Wed - 11 June 25 -
South Korea : ఉత్తర కొరియా సరిహద్దుల్లో మైకుల వినియోగం నిలిపివేత : సియోల్
ముఖ్యంగా, సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ఈ చర్యను హర్షాతిరేకాలతో స్వాగతించారు. ఇటీవలే అధికారాన్ని చేపట్టిన దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం గమనార్హం.
Published Date - 05:20 PM, Wed - 11 June 25 -
Super Six promises : తల్లికి వందనం నిధుల విడుదలకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
ఈ పథకం ద్వారా 67.27 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.8,745 కోట్లు నేరుగా జమ చేయనున్నారు. ఈ "తల్లికి వందనం" పథకం ప్రధానంగా విద్యార్థుల తల్లులకే , తల్లితనానికి గౌరవంగా, వారు తమ పిల్లలను పాఠశాలలకు పంపించే ప్రయత్నాన్ని ప్రోత్సహించేందుకే తీసుకొచ్చారు.
Published Date - 05:03 PM, Wed - 11 June 25 -
APPSC : షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక ప్రకటన
దీనిలో భాగంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా ఈ రెండు వర్గాలను విభజించి, ఈ కొత్త వర్గీకరణ ఏప్రిల్ 19, 2025 నుంచి అధికారికంగా అమలులోకి వస్తుందని సాధారణ పరిపాలన శాఖ (జెనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్) స్పష్టం చేసింది.
Published Date - 04:13 PM, Wed - 11 June 25 -
Heavy rains : ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు
దక్షిణ ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో అధిక వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. APSDMA విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
Published Date - 04:03 PM, Wed - 11 June 25 -
Congress : దిగ్విజయ్ సింగ్ సోదరుడు లక్ష్మణ్‌పై బహిష్కరణ వేటు
క్రమశిక్షణా సంఘ కార్యదర్శి తారిక్ అన్వర్ జారీ చేసిన ప్రకటనలో, లక్ష్మణ్ సింగ్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు పేర్కొంటూ, వెంటనే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు. ఇటీవల పార్టీ అధినేత రాహుల్ గాంధీపై ఆయన చేసిన విమర్శలు తీవ్రంగా వ్యతిరేకతను పొందాయని, పార్టీ మైత్రీ, ఐక్యతకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
Published Date - 03:30 PM, Wed - 11 June 25 -
Ntr Bharosa Pension Scheme : ఏపీలో కొత్త వితంతు పింఛన్లు మంజూరు..నెలకు రూ.4వేలు
ప్రభుత్వ కూటమి ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా, ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.29.60 కోట్లు విడుదల చేసింది. ఈ పథకం కింద భర్త చనిపోతే భార్యకు పింఛన్ అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత ఏడాది నవంబర్ 1వ తేదీ నుంచి స్పౌజ్ పింఛన్ విధానం అమలులోకి వచ్చింది.
Published Date - 02:35 PM, Wed - 11 June 25 -
Prisoners Exchange : రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధ ఖైదీల మార్పిడి
యుద్ధంలో బందీలుగా చిక్కిన ఖైదీలను రష్యా మరియు ఉక్రెయిన్ పరస్పరంగా విడుదల చేశాయి. ఈ ఖైదీల మార్పిడిని తాజాగా ఇస్తాంబుల్‌లో జరిగిన రెండవ దశ చర్చల ఫలితంగా భావిస్తున్నారు. ఈ చర్చల అనంతరం రష్యా రక్షణ శాఖ ఒక వీడియో విడుదల చేసింది.
Published Date - 02:22 PM, Wed - 11 June 25 -
CM Revanth Reddy : కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్‌లో ఎంట్రీ లేదు: సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రానికి ఆ కుటుంబమే ప్రధాన శత్రువని తీవ్ర స్థాయిలో విమర్శించారు. తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణ, శాఖల కేటాయింపుల విషయంపై స్పందించిన సీఎం రేవంత్, ఢిల్లీలో ఈ అంశంపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. తాను హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాతనే మంత్రులతో సంప్రదించి శాఖల కేటాయింపులు జరిపామని పేర్కొన్నారు.
Published Date - 02:09 PM, Wed - 11 June 25 -
ITR Filing 2025: ఆదాయపు పన్ను రిటర్న్.. సెప్టెంబర్ 15లోపు ఫైల్ చేయండిలా!
ఆదాయపు పన్ను శాఖ ప్రకారం.. ITR దాఖలు ప్రక్రియను ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ రెండు విధాలుగా చేసుకోవచ్చు. ఆన్లైన్ ITR దాఖలును సులభతరం చేయడానికి ఆదాయపు పన్ను శాఖ కొంతకాలం క్రితం ITR యూటిలిటీ టూల్స్‌ను కూడా విడుదల చేసింది.
Published Date - 01:35 PM, Wed - 11 June 25 -
KCR : ముగిసిన కేసీఆర్ విచారణ..50 నిమిషాలు ప్రశ్నించిన పీసీ ఘోష్ కమిషన్
ఆయనను 115వ సాక్షిగా విచారించడం గమనార్హం. విచారణలో భాగంగా కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన, నిర్మాణ తీరుపై వివిధ ప్రశ్నలు సంధించింది. ప్రాజెక్టు ఆరంభం నుంచి తీసుకున్న కీలక నిర్ణయాలు, బ్యారేజీల నిర్మాణ సమయంలో ఎదురైన సాంకేతిక సమస్యలు, వాటికి అందించిన పరిష్కారాలు, నిధుల వినియోగం వంటి అంశాలపై సమగ్రంగా వివరణ కోరింది.
Published Date - 01:31 PM, Wed - 11 June 25 -
Pakistan : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్..రక్షణ బడ్జెట్ భారీగా పెంచిన పాక్..!
ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ డిమాండ్లను తీరుస్తూ ఈ నిర్ణయం తీసుకుందనే విశ్లేషణలు ఉన్నాయి. ఈ కొత్త బడ్జెట్లో రక్షణశాఖకు 9 బిలియన్ డాలర్లు కేటాయించగా, అదే సమయంలో ఇతర ప్రభుత్వ విభాగాల్లో 7 శాతం ఖర్చులను తగ్గించింది.
Published Date - 01:15 PM, Wed - 11 June 25