HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Huls Profit Is Rs 2700 Crore Dividend Of Rs 19 Per Share

HUL Q2 Results : హెచ్‌యూఎల్‌కు రూ.2700 కోట్ల లాభం.. ఒక్కో షేరుకు రూ.19 డివిడెండ్

  • By Vamsi Chowdary Korata Published Date - 03:58 PM, Thu - 23 October 25
  • daily-hunt
Hul
Hul

దేశంలోని దిగ్గజ ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ గూడ్స్ సెక్టార్ కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్) ఈ ఆర్థిక సంవత్సరం 2025- 26 రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ ఆర్థిక ఏడాది జూలై- సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో కంపెనీకి ఏకీకృత నికర లాభం 3.8 శాతం పెరిగినట్లు తెలిపింది. ఈసారి కంపెనీ నెట్ ప్రాఫిట్ రూ. 2,694 కోట్లు ఆర్జించినట్లు తెలిపింది. గతేడాది రెండో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 2,595 కోట్లతో పోలిస్తే ఈసారి 3.8 శాతం పెరిగినట్లు వెల్లడించింది.

సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో హెచ్‌యూఎల్ కంపెనీ ఆదాయం రూ. 16,034 కోట్లుగా నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో కంపెని ఆదాయం రూ. 15,703 కోట్లుగా ఉండగా ఈసారి 2.10 శాతం మేర పెరిగిందని వెల్లడించింది. కంపెనీ మొత్తం ఖర్చులు 3.32 శాతం మేర పెరిగి రూ. 12,999 కోట్లకు చేరాయని తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఇతర ఆదాయలతో కలిపితే మొత్తం కంపెనీ ఆదాయం రూ. 16,388 కోట్లుగా ఉందని వెల్లడించింది. కేంద్రం ఇటీవలే తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలు వినియోగాన్ని పెంచుతాయని, అయితే, ఆ ప్రభావం ఈ త్రైమాసికంలో కనిపించదని ఆ కంపెనీ సీఈఓ, ఎండీ ప్రియానాయర్ పేర్కొన్నారు.

 

త్రైమాసిక ఫలితాల సందర్భంగా తమ షేర్ హోల్డర్లకు శుభవార్త చెప్పింది హెచ్‌యూఎల్ కంపెనీ. మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఒక్కో షేరుకు రూ. 19 చొప్పున డివిడెండ్ చెల్లించేందుకు కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదం తెలిపారు. ఇందుకు నవంబర్ 7వ తేదీన రికార్డ్ తేదీని ప్రకటించింది. నవంబర్ 20వ తేదీన ఈ డివిడెండ్ డబ్బులు చెల్లించనున్నట్లు పేర్కొంది. డివిడెండ్ కింద మొత్తం 11 లక్షల మంది వాటాదారులకు రూ. 4,464 కోట్లు చెల్లిస్తామని పేర్కొంది. త్రైమాసిక ఫలితాల క్రమంలో బీఎస్ఈలో హెచ్‌యూఎల్ షేర్లు 1.20 శాతం మేర లాభపడి రూ. 2,623 వద్ద ట్రేడవుతోంది. ఈ కంపెనీ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 2750 వద్ద ఉండగా 52 వారాల కనిష్ఠ ధర రూ. 2136 వద్ద ఉంది. అలాగే డివిడెండ్ యీల్డ్ 1.65 శాతం, పీఈ రేషియో 56.59 శాతంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 6.12 లక్షల కోట్ల వద్ద ఉంది. ఫలితాల నేపథ్యంలో ఈ స్టాక్ లాభాల్లో కొనసాగుతోంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Hindustan Unilever
  • HUL
  • share market

Related News

Share Market

Share Market : 100 కొంటే 400 షేర్లు ఫ్రీ ..లక్షకు రూ.3 లక్షలు గోల్డెన్ ఛాన్స్!

ఫైనాన్స్ సెక్టార్‌లోని మిడ్ క్యాప్ కేటగిరి కంపెనీ ఆటమ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ బంపర్ ఆఫర్ తెచ్చింది. ఈ కంపెనీ బోర్డు డైరెక్టర్స్ నవంబర్ 28న సమావేశమై బోనస్ షేర్లు జారీ చేసేందుకు ఆమోదం తెలిపారు. రికార్డ్ తేదీలోపు 100 షేర్లు కొంటే మరో 400 షేర్లు ఉచితంగా వస్తాయి. అంటే మొత్తం 500 షేర్లు డీమ్యాట్ అకౌంట్లో ఉంటాయి. దీంతో మంచి లాభాలు అందుకోవచ్చు. మరి ఆ వివరాలు త

    Latest News

    • Telangana Global Summit 2025: తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌.. ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌లు ఇవే..!

    • Putin : పుతిన్ భారత్ పర్యటన లో టైట్ సెక్యూరిటీ.. కమెండోలు, స్నైపర్, డ్రోన్లు, ఏఐ!

    • Telangana Global Summit: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలను క‌లిసిన సీఎం రేవంత్‌!

    • Yarlagadda VenkatRao : అరాచక పాలన అంతం, అభివృద్ధికి పట్టం – ఎమ్మెల్యే యార్లగడ్డ

    • PSU Banks : ప్రభుత్వ రంగ బ్యాంకుల పై కేంద్రం షాకింగ్ కుదేలైన అన్ని షేర్లు!

    Trending News

      • PM Modi AI Video: ప్ర‌ధాని మోదీ ఏఐ వీడియో.. ఇలా చేయ‌టం క‌రెక్టేనా?!

      • Sanchar Saathi App: సంచార్ సాథీ యాప్.. ఆ విష‌యంపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం!

      • Mulapeta Port : ఏపీలో కొత్త పోర్ట్ ట్రయల్ రన్ మారిపోతున్న రూపురేఖలు!

      • Telangana Rising Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు 3,000 మంది ప్ర‌ముఖులు?!

      • Glenn Maxwell: ఐపీఎల్‌కు స్టార్ ప్లేయ‌ర్ దూరం.. లీగ్‌కు గుడ్ బై చెప్పిన‌ట్లేనా?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd