HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Hdfc Scheme Rs 37 Lakhs With Rs 10 Thousand

HDFC స్కీమ్.. రూ.10 వేల తో రూ.37 లక్షలు..!

  • By Vamsi Chowdary Korata Published Date - 12:12 PM, Fri - 24 October 25
  • daily-hunt
Hdfc
Hdfc

మ్యూచువల్ ఫండ్స్‌లో కాంపౌండింగ్ మ్యాజిక్ పని చేస్తుంది. అంటే వడ్డీపైన వడ్డీ చక్రవడ్డీ వస్తుంది. అయితే, దీర్ఘకాలం పాటు కొనసాగిన వారికే ఈ ఫలాలు లభిస్తాయి. ఇలా గడిచిన 10 సంవత్సరాల కాలంలో చూసుకుంటే మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్  తమ ఇన్వెస్టర్లకు హైరిటర్న్స్ అందించాయి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ( సిప్) ద్వారా నెల నెలా క్రమం తప్పకుండా పెట్టుబడి కొనసాగించిన వారికి అద్భుతమైన రిటర్న్స్ వచ్చాయి. లాంగ్ టర్మ్‌లో భారీ రాబడులు అందించిన టాప్-5 పథకాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

క్రమానుగత పెట్టుబడి విధానం ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ పరిస్థితులను పట్టించుకోకుండా పెట్టుబడిని కొనసాగిస్తూ ఉండాలి. పది సంవత్సరాల పాటు నెల నెలా సిప్ పెట్టుబడి కొనసాగించిన వారికి ఒకేసారి పెద్ద మొత్తంలో రిటర్న్స్ రావడమే కాదు మార్కెట్ ఒడుదొడుకులను తట్టుకునే మనోధైర్యాన్ని సైతం ఇస్తుంది. వాల్యూ రీసెర్చ్ డేటా ప్రకారం 67ల మిడ్ క్యాప్ ఫండ్స్ గడిచిన 10 ఏళ్లలో సగటున 15.94 శాతం రాబడి అందించాయి. అలాగే ఏఎంఎఫ్‌ఐ ప్రకారం ప్రస్తుతం 20 మిడ్ క్యాప్ ఫండ్స్ పది సంవత్సరాలకు పైగా మంచి ట్రాక్ రికార్డ్ కలిగి ఉన్నాయి. అందులో టాప్-5 పథకాలు ఇవే

 

మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ తీసుకొచ్చిన ఈ మిడ్ క్యాప్ ఫండ్  హైరిటర్న్స్ ఇచ్చింది. గత 10 సంవత్సరాల్లో సిప్ రిటర్న్స్ సగటున ఏడాదికి 23.45 శాతంగా ఉన్నాయి. అంటే రూ.10 వేల చొప్పున పెట్టుబడి పెట్టినట్లయితే ఇప్పుడు ఆ విలువ రూ.41.71 లక్షలు అవుతుంది. అదే పదేళ్ల లంప్ సమ్ పెట్టుబడి రాబడులు 18.96 శాతంగా ఉన్నాయి. ఇన్వెస్కో ఇండియా మ్యూచువల్ ఫండ్ అందిస్తోన్న మిడ్ క్యాప్ ఫండ్  సైతం హైరిటర్న్స్ ఇచ్చింది. గత 10 సంవత్సరాల కాలంలో చూసుకుంటే సిప్ రాబడులు సగటున ఏడాదికి 23.17 శాతంగా ఉన్నాయి. దీని ప్రకారం రూ.10 వేల నెలవారీ పెట్టుబడితో ఒకేసారి చేతికి రూ.41.10 లక్షలు వచ్చాయి. ఇక లంప్ సమ్ రాబడులు 20.11 శాతంగా ఉన్నాయి. ఎడెల్వాయీస్ మిడ్ క్యాప్ ఫండ్ గత 10 సంవత్సరాల సిప్ రాబడులు సగటున ఏడాదికి 22.79 శాతంగా ఉన్నాయి. దీని ప్రకారంగా నెలకు రూ.10 వేల చొప్పున సిప్ పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్పుడు ఆ విలువ రూ.40 లక్షలకు పైగా ఉంటుంది. లంప్ సమ్ పెట్టుబడి రాబడులు 19.39 శాతంగా ఉన్నాయి.

 

నిప్పాన్ ఇండియా ఏఎంసీ తీసుకొచ్చిన గ్రోత్ మిడ్ క్యాప్ ఫండ్ సిప్ రిటర్న్స్ గత 10 ఏళ్లలో 22.08 శాతంగా ఉన్నాయి. నెలకు రూ.10 వేల చొప్పున ఈ పదేళ్లు ఇన్వెస్ట్ చేసినట్లయితే ఆ విలువ ఇప్పుడు రూ.38.66 లక్షలుగా ఉంటుంది. లంప్ సమ్ రాబడులు సగటున వార్షికంగా 18.74 శాతంగా ఉన్నాయి. ప్రముఖ ఏఎంసీల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్స్ తీసుకొచ్చిన మిడ్ క్యాప్ ఫండ్  అదరగొట్టింది. గడిచిన 10 ఏళ్లలో వార్షిక రాబడులు సగటున 21.50 శాతంగా ఉన్నాయి. దీని ప్రకారం నెలకు రూ.10 వేలు పెట్టి ఉంటే ఇప్పుడు రూ.37.51 లక్షలు వస్తాయి. లంప్ సమ్ రాబడి సగటున 18.81 శాతంగా ఉంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • growth
  • HDFC MidCap
  • HDFC Mutual Fun
  • HDFC scheme
  • india
  • Invesco
  • midcap
  • Motilal Oswal
  • mutual funds
  • Nippon
  • SIP
  • sip mutual fund scheme

Related News

Donald Trump Gold

Gold : ట్రంప్ ఝలక్.. భారీగా తగ్గిన బంగారం ధర..!

బంగారం ధర భారీగా తగ్గిందని సంతోషించేలోపే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చారు. తాజాగా.. అమెరికా సర్కార్ రష్యాపై కఠిన ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపట్లేదని.. అనుచితంగా ప్రవర్తిస్తుందని ఆగ్రహించిన ట్రంప్ యంత్రాంగం.. అక్కడి రెండు ప్రధాన చమురు సంస్థలు రాస్‌నె

  • Gold Price Aug20

    Gold : RBI వద్ద ఎంత బంగారం ఉందో తెలుసా?

  • S 400

    ‘S-400’ : రూ.10వేల కోట్లతో ‘S-400’ కొనుగోలు

Latest News

  • Inter Exams: తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ఖరారు! ఈసారి వారం ముందుగానే

  • Akhanda 2: ‘అఖండ 2’లో బాలకృష్ణ డ్యూయల్ రోల్.. ఎమ్మెల్యేగా కూడా కనిపించనున్నారా?

  • AUSvIND: మూడో వన్డే కోసం ఎడ్వ‌ర్డ్స్.. టీ20లలో మ్యాక్స్‌వెల్‌

  • TVK Vijay: తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్‌ మళ్లీ రాష్ట్ర పర్యటనకు!

  • Bus Accident’s : సరిగ్గా 12 ఏళ్ల తర్వాత ‘పాలెం’ ఘటన రిపీట్.. మృత్యు రహదారి నేషనల్ హైవే 44..!

Trending News

    • Justice Surya Kant: సుప్రీంకోర్టు త‌దుప‌రి ప్ర‌ధాని న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ సూర్య‌కాంత్‌.. ఎవ‌రీయ‌న‌?

    • Bus Fire Accident : కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది ఫోన్లు స్విచాఫ్.. ఏమయ్యారు?

    • Kaveri Travels : బస్సు ప్రమాదం.. హైదరాబాద్ లో అన్ని కార్యాలయాలను మూసివేసిన కావేరి ట్రావెల్స్

    • HDFC స్కీమ్.. రూ.10 వేల తో రూ.37 లక్షలు..!

    • New Rules: అల‌ర్ట్‌.. న‌వంబ‌ర్ నుంచి కొత్త రూల్స్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd