Operation Sindoor : ‘ఆపరేషన్ సిందూర్’.. 100 మంది ఉగ్రవాదులు హతం : రాజ్‌నాథ్ సింగ్
ఇవాళ ఉదయం జరిగిన అఖిలపక్ష సమావేశంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) సహా పాకిస్తాన్ లోని అనేక ఉగ్రవాద స్థావరాలపై భారత భద్రతా బలగాలు ఆకస్మికంగా జరిపిన దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.
- By Latha Suma Published Date - 01:38 PM, Thu - 8 May 25

Operation Sindoor : దేశ భద్రత పరంగా కీలకమైన ముందడుగు పడింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం, భారత ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ లో కనీసం 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం జరిగిన అఖిలపక్ష సమావేశంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) సహా పాకిస్తాన్ లోని అనేక ఉగ్రవాద స్థావరాలపై భారత భద్రతా బలగాలు ఆకస్మికంగా జరిపిన దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.
Read Also: Who is Sajid Mir : సాజిద్ మీర్ ఎవరు ? పాకిస్తానే చంపింది.. బతికించింది !!
రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన ప్రకారం, ఈ ఆపరేషన్ చాలా గోప్యంగా, సమన్వయంగా జరిపారు. శత్రు ప్రాంతాల్లో సుదీర్ఘంగా గూఢచర్యం నిర్వహించిన అనంతరం ఈ దాడులకు పర్మిషన్ ఇవ్వబడింది. సర్జికల్ స్ట్రైక్స్‌కు మించిన స్థాయిలో ఈ ఆపరేషన్ జరిపినట్లు భద్రతా వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు గట్టి ధాటిగా నిలిచే ఈ చర్యకు అన్ని రాజకీయ పార్టీల నుంచి మద్దతు లభించింది.
ఈ దాడులతో పాక్ వ్యతిరేకంగా మండిపోతూ, భారత్‌పై ఎదురు దాడికి సిద్ధమవుతోందన్న సమాచారంతో భారత భద్రతా వ్యవస్థ అప్రమత్తమైంది. సరిహద్దు రాష్ట్రాలైన రాజస్థాన్, పంజాబ్‌ల్లో హై అలర్ట్ ప్రకటించడంతో పాటు, పోలీసు సిబ్బంది సెలవులు రద్దు చేశారు. ప్రజల రక్షణ దృష్ట్యా బహిరంగ సభలపై నిషేధం విధించారు. ముఖ్యంగా, భారత్-పాక్ సరిహద్దులను పూర్తిగా మూసివేసినట్లు అధికారులు తెలిపారు.
సరిహద్దు ప్రాంతాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా, వెంటనే కాల్పులు జరిపేందుకు భద్రతా బలగాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలెవ్వరూ పుకారులతో ఆందోళన చెందవద్దని, అధికారిక సమాచారం కోసం మాత్రమే ఎదురుచూడాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. భారత దళాలు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు కట్టుబడి ఉన్నాయని స్పష్టం చేశారు.
Read Also: Operation Sindoor : భారత వ్యతిరేక తప్పుడు ప్రచారాన్ని ఉపేక్షించొద్దు.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం