New Year : 2025కి ఘనంగా స్వాగతం పలికిన న్యూజిలాండ్
న్యూజిలాండ్ రాజధాని ఆక్లాండ్ లోని స్కై టవర్ వద్ద న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. అద్భుతమైన ఫైర్‌వర్క్స్, హోరెత్తించే మ్యూజిక్‌తో ఆక్లాండ్ ప్రజలు న్యూఇయర్‌కు వెల్‌కమ్ చెప్పారు.
- By Latha Suma Published Date - 06:29 PM, Tue - 31 December 24

New Year 2025 : నూతన సంవత్సర వేడుకలకు యావత్ ప్రపంచం సిద్ధమయింది. మన దేశంలో కూడా పూర్తిగా సందడి వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే న్యూజిలాండ్ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది. భారతీయ కాలమాన ప్రకారం 4.30 గంటలకు వాళ్లకు కొత్త సంవత్సరం మొదలయ్యింది. అంతకు ముందే కిరిబాటి అనే దీవిలో మొదటగా న్యూయర్ వచ్చింది. న్యూజిలాండ్ రాజధాని ఆక్లాండ్ లోని స్కై టవర్ వద్ద న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. అద్భుతమైన ఫైర్‌వర్క్స్, హోరెత్తించే మ్యూజిక్‌తో ఆక్లాండ్ ప్రజలు న్యూఇయర్‌కు వెల్‌కమ్ చెప్పారు.
Happy New Year 2025 from Auckland, New Zealand.
Goodbye 2024! pic.twitter.com/pEx9dYWo2q— The Economic Dog (@theeconomicdog) December 31, 2024
న్యూజిలాండ్ తర్వాత ఆస్ట్రేలియాలో కొత్త ఏడాది ప్రారంభం అవుతుంది. జపాన్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా తర్వాత చైనా, మలేసియా, సింగపూర్, హాంకాంగ్, ఫిలిప్పీన్స్‌లో కు, థాయ్‌లాండ్, వియత్నాం, కాంబోడియాలో న్యూయర్ ముందుగా జరుపుకుంటారు. ఆస్ట్రేలియాలో మన కంటే ఐదున్నర గంటల ముందు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. మన పొరుగు దేశాలు భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ మనకంటే 30 నిమిషాల ముందు నూతన సంవత్సరంలోకి అడుగుపెడతాయి.
ఇక, భారత్ తర్వాత 43 దేశాలు ఒకేసారి కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతాయి. వాటిలో జర్మనీ, నార్వే, ఫ్రాన్స్, ఇటలీ లాంటి ఐరోపా దేశాలతోపాటు కాంగో, అంగోలా, కామెరూన్ లాంటి ఆఫ్రికా దేశాలు ఉన్నాయి. రేపు ఉదయం మనకు 10.30 గంటలులకు అమెరికాలోని న్యూయార్క్ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతుంది. రష్యాలో కొత్త సంవత్సర వేడుకలను రెండు సార్లు జరుపుకుంటారు. గ్రెగెరియన్ క్యాలెండర్ ప్రకారం జనవరి 1న…. పాత జూలియన్ క్యాలెండర్ ప్రకారం జనవరి 14న న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ జరుపుకుంటారు. సౌదీ అరేబియా, చైనా, ఇజ్రాయెల్, వియత్నాం దేశాలు జనవరి 1న కొత్త సంవత్సరాన్ని జరుపుకోవు. ఆయా దేశాల క్యాలెండర్ల ప్రకారం కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటారు.
Read Also: WhatsApp Pay : వాట్సాప్‌లో యూపీఐ పేమెంట్.. కేంద్రం గుడ్‌న్యూస్