NCP : మహారాష్ట్ర ఎన్నికలు..అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన ఎన్సీపీ
NCP : కాగా, శివసేన పార్టీ 45 మంది అభ్యర్థులతో మంగళవారం తొలి జాబితాను విడుదల చేసింది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే కోప్రి-పచ్పఖాడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నట్లుగా పేర్కొంది.
- By Latha Suma Published Date - 03:27 PM, Wed - 23 October 24

Maharashtra Assembly Elections: నవంబర్ 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 38 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బుధవారం విడుదల చేసింది. పార్టీ అధినేత అజిత్ పవార్ అతడి కుటుంబానికి కంచుకోట అయిన బారామతి స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రకటించింది. బీజేపీ, శివసేన ఎన్సీపీలతో కూడిన మహాయుతి కూటమి ఎన్నికల్లో పోటీ చేస్తోంది. కాగా, శివసేన పార్టీ 45 మంది అభ్యర్థులతో మంగళవారం తొలి జాబితాను విడుదల చేసింది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే కోప్రి-పచ్పఖాడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నట్లుగా పేర్కొంది.
అయితే ప్రతిపక్ష ‘మహావికాస్ అఘాడీ’ కూటమిలో సీట్ల పంపకంపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 20న ఒకే దశలో పోలింగ్ జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు వెల్లడించింది. అయితే శివసేన, ఎన్సీపీ చీలిక తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అసలైన శివసేన, ఎన్సీపీ ఏవో ప్రజలు తేల్చనున్నారు.
కాగా, మరోవైపు శివసేన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 45 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను ఇప్పటికే విడుదల చేసింది. థానే నగరంలోని కోప్రి-పంచ్‌పఖాడి నుండి ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను, వారి సంబంధిత స్థానాల నుండి అర డజనుకు పైగా క్యాబినెట్ సభ్యులను నామినేట్ చేసింది. మంగళవారం అర్థరాత్రి విడుదల చేసిన జాబితా ప్రకారం, జూన్ 2022లో అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేపై తిరుగుబాటుకు నాయకత్వం వహించిన షిండేకు మద్దతు ఇచ్చిన దాదాపు అందరు ఎమ్మెల్యేలను అధికార పార్టీ తిరిగి నామినేట్ చేసింది.
Read Also: Nag vs Konda : అక్టోబర్ 30కి నాగ్ – సురేఖ పంచాయితీ విచారణ