Navy Officer Vinay: దేవుడు రాసిన రాత.. యూరప్‌కు వెళ్లాల్సిన వారు కాశ్మీర్‌కు వచ్చి, నేవి ఆఫీసర్ స్టోరీ ఇదే!
ఉగ్రవాదులు వినయ్‌ను హిమాంశి ముందే కాల్చి చంపారు. అయితే, హిమాంశికి ఏమీ చేయలేకపోయింది. ఆమె క్షేమంగా ఉంది. వినయ్- హిమాంశి ఏప్రిల్ 21న జమ్మూ-కాశ్మీర్‌కు చేరుకున్నారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లోని హోటల్‌లో చెక్-ఇన్ చేశారు.
- Author : Gopichand
Date : 23-04-2025 - 6:30 IST
Published By : Hashtagu Telugu Desk
Navy Officer Vinay: జమ్మూ-కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వారిలో నౌకాదళ అధికారి (Navy Officer Vinay) కూడా ఉన్నారు. లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ 8 రోజుల క్రితం హిమాంశి నర్వాల్‌తో వివాహం చేసుకున్నారు. వారు హనీమూన్ కోసం కాశ్మీర్‌కు వచ్చారు. అయితే వారు మొదట యూరప్‌కు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ వీసా రాని కారణంగా వారు ప్లాన్ మార్చుకొని కాశ్మీర్‌కు వెళ్లారు.
లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ వయస్సు 26 సంవత్సరాలు. హిమాంశి నర్వాల్‌తో ఎనిమిది రోజుల క్రితం వివాహం జరిగింది. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. వారు మొదట హనీమూన్ కోసం యూరప్ వెళ్లాలనుకున్నారు. కానీ వీసా లభించకపోవడంతో ప్లాన్ రద్దు చేసుకోవలసి వచ్చింది. వినయ్ హరియాణాలోని కర్నాల్‌కు చెందినవారు. వారి కుటుంబం హరియాణాలోని కర్నాల్‌లోని సెక్టార్ 7లో నివసిస్తుంది.
Also Read: Hyderabad MLC Election: 112 ఓట్లలో పోలైనవి 88.. ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితంపై ఉత్కంఠ
ఉగ్రవాదులు వినయ్‌ను హిమాంశి ముందే కాల్చి చంపారు. అయితే, హిమాంశికి ఏమీ చేయలేకపోయింది. ఆమె క్షేమంగా ఉంది. వినయ్- హిమాంశి ఏప్రిల్ 21న జమ్మూ-కాశ్మీర్‌కు చేరుకున్నారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లోని హోటల్‌లో చెక్-ఇన్ చేశారు. హిమాంశి నర్వాల్ ఒక వీడియోలో కనిపించింది. దానిలో ఆమె వినయ్, తాను పహల్గామ్ సమీపంలోని మినీ స్విట్జర్లాండ్‌గా పిలవబడే టూరిస్ట్ ప్లేస్ బైసరన్ లోయలో తిరుగుతున్నట్లు చెప్పింది. అప్పుడు ఉగ్రవాదులు వినయ్ వైపు వచ్చి ‘ఇతను ముస్లిం కాదు’ అని చెప్పి కాల్చాడు’ అని వీడియోలో హిమాంశి చెబుతూ కనిపిస్తుంది.
వినయ్ నర్వాల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ చేశాడు. మూడు సంవత్సరాల క్రితం నావికాదళంలో చేరారు. ప్రస్తుతం ఆయన కేరళలోని కొచ్చిలో వర్క్ చేస్తున్నాడు. అతని తండ్రి రాజేష్ కుమార్ పానిపట్ కస్టమ్స్ డిపార్ట్‌మెంట్‌లో సూపరింటెండెంట్‌గా ఉన్నారు. వినయ్ తల్లి పేరు ఆశా దేవి. బామ్మ పేరు బీరూ దేవా. ఆశా దేవి గృహిణి. వినయ్ పెద్ద సోదరి సృష్టి ఢిల్లీలో నివసిస్తూ సివిల్ సర్వీస్‌లకు సిద్ధం అవుతోంది. వినయ్ తాత హవా సింగ్ హరియాణా పోలీసులో ఉండి 2004లో రిటైర్ అయ్యారు.