HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >National Security Advisor Ajit Doval Meets Prime Minister Modi

Terrorist Attack : ప్రధాని మోడీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భేటీ

జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌ ప్రధానిని కలిసి, పెహల్‌గామ్‌ ఘటనపై సమీక్ష నిర్వహించారు. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన వ్యూహాత్మక చర్యలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం.

  • Author : Latha Suma Date : 06-05-2025 - 12:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
National Security Advisor Ajit Doval meets Prime Minister Modi
National Security Advisor Ajit Doval meets Prime Minister Modi

Terrorist Attack : పెహల్‌గామ్‌లో ఇటీవల చోటు చేసుకున్న ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదనను కలిగించింది. ఈ దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో దేశ ప్రజలు ఆగ్రహంతో ఉలిక్కిపడుతున్నారు. ఈ దాడికి బాధ్యులైన ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చిన పాకిస్థాన్‌పై భారత్‌ ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితుల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో ఢిల్లీలో కీలక భేటీలు జరుగుతున్నాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌ ప్రధానిని కలిసి, పెహల్‌గామ్‌ ఘటనపై సమీక్ష నిర్వహించారు. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన వ్యూహాత్మక చర్యలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం.

Read Also: APPSC Irregularities : ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో ధాత్రి మధు అరెస్టు.. ఏమిటీ కేసు ?

కేంద్ర హోంశాఖ కూడా కీలక సమావేశం నిర్వహించింది. అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలనే దానిపై పౌరుల్ని సమాయత్తం చేసేందుకు మే 7న (బుధవారం) మాక్‌డ్రిల్‌ అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు నిన్న కేంద్రహోం శాఖ ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్‌ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఇ, ప్రధాని వరుస భద్రతా సమీక్షలతో మమేకమవుతున్నారు. గత వారం ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ ప్రీత్‌ సింగ్‌ మోడీతో సమావేశమవగా, నిన్న రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్‌ కుమార్‌ సింగ్‌ కూడా ప్రధాని భేటీకి హాజరయ్యారు. ఈ భేటీలు త్రివిధ దళాలకు ఉత్తరాల రూపంలో స్పష్టమైన సంకేతాలు అందిస్తున్నాయి.

గత నెల 26న నిర్వహించిన ఉన్నత స్థాయి రక్షణ సమీక్షా సమావేశంలో ప్రధాని మోదీ, సాయుధ బలగాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతోపాటు, రక్షణ రంగంలో చర్యలు తీసుకోవడం ప్రారంభమైంది. ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డు తన ఉద్యోగుల సెలవులను రద్దు చేస్తూ అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. దీని ద్వారా రక్షణ తయారీ విభాగం సిద్ధంగా ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఇక దేశవ్యాప్తంగా భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి. సరిహద్దుల్లో అనుమానాస్పద కదలికలపై నిఘా పెంచారు. పెహల్‌గామ్‌ ఘటన భారత భద్రతా రంగాన్ని మేల్కొల్పగా, పాకిస్థాన్‌పై కేంద్రం తీసుకోబోయే నిర్ణయాలు సమకాలీన రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశముంది.

Read Also: Mahanadu 2025 : ‘మహానాడు’కు స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావుకు ఆహ్వానం

 

 

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • National Security Advisor Ajit Doval
  • Pahalgam Terror Attack
  • pm modi

Related News

    Latest News

    • Lakshmi Devi: ఈ వస్తువులను మీ ఇంట్లోని పూజ గదిలో పెడితే చాలు.. లక్ష్మీ అనుగ్రహం కలగడం ఖాయం!

    • Karumuri Sunil: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు.. మాజీ మంత్రి కారుమూరి కొడుకు అరెస్ట్

    • Save The Tigers 3 Review: సేవ్ ది టైగర్స్ 3 రివ్యూ

    • ISIకి పూర్తి స్వేచ్ఛ.. పార్లమెంట్‌పై ప్రభావం.. ఇమ్రాన్ ఖాన్ పై పాకిస్థాన్ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు

    • Visakhapatnam: విశాఖ గాజువాకలో భారీ అగ్ని ప్రమాదం.. పటాకుల దుకాణంలో ఎగిసిపడుతున్న మంటలు!

    Trending News

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd