Sanjay Raut : పరుపు నష్టం కేసులో ఎంపీ సంజయ్ రౌత్‌కు 15 రోజుల జైలు శిక్ష
Sanjay Raut : అంతకు ముందు కూడా సోమయ్య కుటుంబీకులు నడిపిస్తోన్న స్వచ్ఛంద సంస్థకు ఇందులో భాగస్వామ్యం ఉందని సంజయ్ రౌత్ ఆరోపించారు.
- By Latha Suma Published Date - 01:35 PM, Thu - 26 September 24

Defamation case: పరువు నష్టం కేసులో శివసేన (యూబీటీ) కీలక నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్‌కు భారీ షాక్ తగిలింది. బీజేపీ నేత కిరీట్ సోమయ్య భార్య మేధ సోమయ్య దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఆయనకు 15 రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ ముంబయి న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. సెక్షన్ 500 కింద సంజయ్ రౌత్‌ను దోషిగా నిర్ధారించిన కోర్టు ఆయనకు 15 రోజుల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.25 వేల జరిమానా కూడా వేసింది.
Read Also: PM Modi : ప్రధాని మోడీ పూణే పర్యటన రద్దు..
కాగా, కిరీట్ సోమయ్య కుటుంబ సభ్యులు ఓ స్వచ్ఛంద సంస్థను నడిపిస్తున్నారు. అయితే, ముంబయి శివారులోని మీరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో రూ.100 కోట్ల టాయిలెట్ స్కామ్ జరిగిందని ఆరోపిస్తూ శివసేనకు చెందిన సామ్నా పత్రికలో వరుస కథనాలు వచ్చాయి. అంతకు ముందు కూడా సోమయ్య కుటుంబీకులు నడిపిస్తోన్న స్వచ్ఛంద సంస్థకు ఇందులో భాగస్వామ్యం ఉందని సంజయ్ రౌత్ ఆరోపించారు.
Read Also: Delhi : నేటి నుండి ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
ఈ క్రమంలోనే మేధా సోమయ్య 2022 ఏప్రిల్‌లో సంజయ్ రౌత్‌పై పరువు నష్టం దావా వేశారు. ఎలాంటి ఆధారాలూ లేకుండా టాయిలెట్ స్కామ్ పేరుతో శివసేనకు చెందిన సామ్నా పత్రికలో వస్తోన్న కథనాలు తన పరువుకు నష్టం కలిగించేవిలా ఉన్నాయని అందులో పేర్కొన్నారు. తన పరువుకు నష్టం కలిగించినందుకు క్షమాపణలు చెప్పడంతోపాటు వ్యక్తిగతంగా తనకు భంగం కలిగించే కథనాలను ప్రచురించకుండా ఆదేశాలు ఇవ్వాలని తన పిటిషన్ ద్వారా కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన ముంబై కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.