HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Manipur Is Burning Today

Manipur is Burning Today: మండుతున్న మణిపూర్

కోర్టు తీర్పును నిరసిస్తూ మణిపూర్ (Manipur) లోని ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ మణిపూర్ తో పాటు పలు గిరిజన సంఘాలు బుధవారం "ట్రైబల్ సాలిడారిటీ మార్చ్" నిర్వహించాయి.

  • Author : Maheswara Rao Nadella Date : 04-05-2023 - 4:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Manipur Situation
Manipur Is Burning Today

Manipur is Burning Today : ఈశాన్య రాష్ట్రం మణిపూర్ రణరంగంగా మారింది. గిరిజనులు, గిరిజనేతరుల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గిరిజనేతరులైన మైతై వర్గానికి ఎస్టీ హోదా కల్పిస్తూ కోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. అయితే కోర్టు తీర్పును నిరసిస్తూ మణిపూర్ (Manipur) లోని ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ మణిపూర్ (ఏటీఎస్ యూఎం)తో పాటు పలు గిరిజన సంఘాలు బుధవారం “ట్రైబల్ సాలిడారిటీ మార్చ్” నిర్వహించాయి. రాష్ట్రంలో రెండో అతిపెద్ద పట్టణమైన చురాచాంద్‌పుర్‌ లో గిరిజన సంఘాల నిరసన ప్రదర్శన జరుగుతున్న క్రమంలో కొందరు వ్యక్తులు ఆంగ్లో-కుకీ వార్ మెమోరియల్ గేటుకు నిప్పు పెట్టారు.

దీంతో హింస ప్రజ్వరిల్లింది. అనంతరం రాజధాని ఇంఫాల్ తో పాటు కంగ్‌పోక్కి టౌన్ లోనూ గిరిజనులు, గిరిజనేతరులకు మధ్య తలెత్తిన ఘర్షణ హింసాకాండకు దారి తీసింది. గుర్తు తెలియని వ్యక్తులు అనేక ఇండ్లు, వాహనాలు, ప్రార్ధనా స్థలాలను తగులబెట్టారు. రాష్ట్రంలోని 8 జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో అక్కడ కర్ఫ్యూ విధించారు. పరిస్థితిని అదుపులోకి తేవడానికి ఆర్మీ , అసోం రైఫిల్స్ ను రంగంలోకి దింపారు. ఆర్మీ ఎక్కడికక్కడ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించింది. భారత వాయుసేన ప్రత్యేక విమానంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందిని మణిపూర్ (Manipur) కు పంపింది.

సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారం, పుకార్లు వ్యాపించకుండా నిరోధించేందుకు ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు. ఈనేపథ్యంలో ఆర్మీ శిబిరాలు, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో 4వేల మంది ప్రజలకు ఆశ్రయం కల్పించారు. అన్ని వర్గాలకు చెందిన దాదాపు 7,500 మంది పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

సీఎంకు అమిత్ షా ఫోన్..

ప్రస్తుతం మణిపూర్ లో ఉన్న పరిస్థితి గురించి ముఖ్యమంత్రి బిరేన్ సింగ్‌తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం ఫోన్ లో చర్చించారు. బుధవారం ఘర్షణలు చెలరేగిన తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను సీఎం వివరించారు. శాంతిభద్రతల పునరుద్ధరణ కోసం చేపడుతున్న చర్యల గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా అడిగి తెలుసుకున్నారు. మణిపూర్ లో నెలకొన్న పరిస్థితులను కేంద్రం సునిశితంగా గమనిస్తోందని వెల్లడించారు. కాగా, ఈ హింసకు కేంద్ర బిందువుగా నిలిచిన చురాచాంద్‌పుర్‌ లో ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ పాల్గొనాల్సిన సభా వేదికను కొన్ని రోజుల క్రితం నిరసనకారులు దహనం చేశారు.

అపార్థాలే దీనికి కారణం : మణిపూర్ సీఎం బీరేన్ సింగ్

ఈ పరిణామాలపై మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ స్పందిస్తూ.. సమాజంలోని రెండు వర్గాల మధ్య అపార్థాలే దీనికి కారణమని చెప్పారు. ఇరు వర్గాలతోనూ సంప్రదింపులు జరిపి, వారి సుదీర్ఘ సమస్యలకు పరిష్కారాన్ని సాధిస్తామని చెప్పారు. గత 24 గంటల్లో జరిగిన విధ్వంసకాండలో విలువైన ప్రాణాలను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లు, ఆస్తులకు నష్టం జరగడం దురదృష్టకరమన్నారు.

నా రాష్ట్రం తగలబడిపోతోంది : బాక్సర్ మేరీకోమ్

‘‘నా రాష్ట్రం తగులబడుతోంది. దయచేసి ఆదుకోండి’’ అంటూ మ‌ణిపూర్ కు చెందిన ప్రముఖ బాక్సర్ మేరీకోమ్ ట్వీట్ చేశారు. ఏప్రిల్ 3 నుంచి మ‌ణిపూర్‌లో ప‌రిస్థితి అత్యంత దారుణంగా తయారైందని ఆమె అన్నారు. హింస‌లో అనేక మంది త‌మ కుటుంబ‌స‌భ్యులను కోల్పోవడం బాధగా ఉందని తెలిపారు. ఆమె తన ట్వీట్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పీఎంఓ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వివిధ మీడియా సంస్థలకు ట్యాగ్ చేశారు. అందరికీ రక్షణ కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఎప్పుడైనా ఏమైనా జరిగే అవకాశం ఉందని మేరీకోమ్ ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read:  Tamannah Bhatia : గ్రీన్ కలర్ డ్రెస్ లో తమన్నా కొత్త ఫోటోషూట్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amit shah
  • bjp
  • Burning
  • congress
  • india
  • manipur
  • modi
  • politics

Related News

Mynampalli Rohith

Jaggareddy : మెదక్‌కు డైనమిక్ నాయకుడు అవసరం.. రోహిత్‌పై జగ్గారెడ్డి ప్రశంసలు

మెదక్ ఎమ్మెల్యే మైనంప‌ల్లి రోహిత్‌పై టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గ‌రారెడ్డి ప్రశంసలు కురిపించారు. మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి మైనంపల్లి రోహిత్ వంటి యువ, డైనమిక్ నాయకత్వం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపే నాయకుడిగా రోహిత్ గుర్తింపు పొందారని జగ్గారెడ్డి అన్నారు. మెదక్ అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృష

  • Revanth Speech

    CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

  • Jaggareddy

    TPCC : హైదరాబాద్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన జగన్నారెడ్డి

  • New Currency

    New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

  • Indiramma Houses

    CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

Latest News

  • Forever New : వైజాగ్‌లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్

  • PM-Setu Scheme : ఏపీకి దక్కిన అరుదైన గౌరవం

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

  • Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

  • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd