Mamata Banerjee: అంగన్‌వాడీ, ఆశా వర్కర్ల జీతాలు పెంపు..ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి
- Author : Latha Suma
Date : 06-03-2024 - 4:06 IST
Published By : Hashtagu Telugu Desk
Mamata Banerjee : లోక్‌సభ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్(West Bengal) సీఎం మమతా బెనర్జీ(CM Mamata Banerjee) కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంగన్‌వాడీ, ఆశా వర్కర్ల(Anganwadi Asha workers) వేతనాలు(salary) పెంచారు. ఏప్రిల్ 1 నుంచి అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు పెరిగిన వేతనాలు అమల్లోకి వస్తాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తల వేతనాలు నెలకు రూ. 750 చొప్పున పెంచామని సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. అంగన్‌వాడీ వర్కర్ల వేతనాలు రూ. 8250 నుంచి రూ. 9000కు పెరగ్గా, ఆశా వర్కర్ల వేతనాలు రూ. 6500కు పెరిగాయి.
read also: MK Stalin : ప్రధాని మోడీ సవాల్ విసిరిన సీఎం ఎంకే స్టాలిన్
ఆశా వర్కర్లు కష్టపడి పనిచేస్తారని, సంక్లిష్ట సమయాల్లో వారు తమకు అండగా నిలిచారని సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. వారి వేతనాలను ఏప్రిల్ నుంచి రూ. 750 పెంచుతున్నామని ప్రకటించడం తనకు సంతోషం కలిగిస్తోందని ఆమె వెల్లడించారు.