HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Automobile
  • >Lock And Unlock Your Car Without A Key Know How

Digital Car Key : తాళం లేకుండానే కారును లాక్​, అన్​లాక్ చేయండిలా

Digital Car Key : తాళం లేకుండానే కారును లాక్​, అన్​లాక్, స్టార్ట్ చేయగలిగితే.. ఎలా ఉంటుంది ? అది సాధ్యమే !!

  • By Pasha Published Date - 03:26 PM, Tue - 26 March 24
  • daily-hunt
Digital Car Key
Digital Car Key

Digital Car Key : తాళం లేకుండానే కారును లాక్​, అన్​లాక్, స్టార్ట్ చేయగలిగితే.. ఎలా ఉంటుంది ? అది సాధ్యమే !! ఆండ్రాయిడ్ స్మార్ట్​ ఫోన్లలో గూగుల్ తెచ్చిన ‘డిజిటల్​ కీ’ ఫీచర్‌తో మనం తాళం లేకుండానే కారును లాక్​, అన్​లాక్, స్టార్ట్ చేయొచ్చు. తాళం పోయిన సందర్భాల్లోనే కాకుండా.. వేరే సమయాల్లోనూ ఈ ఫీచర్‌ను మనం వాడుకోవచ్చు. దీన్నివాడాలంటే ఏదైనా ఆండ్రాయిడ్​ డివైజ్ మీ చేతిలో ​ ఉంటే సరిపోతుంది. ఈ ఫీచర్‌పై(Digital Car Key) పూర్తి వివరాలివీ..

We’re now on WhatsApp. Click to Join

‘డిజిటల్​ కార్​ కీ’ ఎలా పనిచేస్తుంది ?

  • డిజిటల్ కీ ఫీచర్​ అల్ట్రా-వైడ్​ బ్యాండ్​ అనే టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. ఇది మీ దగ్గరున్న ఆండ్రాయిడ్​ ఫోన్ ద్వారా కారును లాక్​, అన్​లాక్ చేసే వీలును కల్పిస్తుంది.
  • డిజిటల్ కార్​ కీ ఫీచర్​ను టెక్​ దిగ్గజం యాపిల్​ తన డివైజుల్లో 2020లోనే ప్రవేశపెట్టింది.
  • గూగుల్​ తన అప్డేటెడ్​ వెర్షన్​లో​ భాగంగా డిజిటల్​ కార్​ కీ ఫీచర్​ను 2021లో ఆండ్రాయిడ్ 12లో అందుబాటులోకి తీసుకొచ్చింది.
  • కారు తాళాలను ఇంట్లోనో లేదా ఆఫీసులోనో మర్చిపోయినప్పుడు డిజిటల్​ కారు కీ ఫీచర్​ను వాడుకోవచ్చు.
  • ఈ ఫీచర్‌ను వాడాలంటే మీరు ఆండ్రాయిడ్​ ఫోన్​లో డిజిటల్​ కారు కీ ఫీచర్​కు సంబంధించి కొన్ని సెట్టింగ్స్​ చేయాలి. ఈ సెటప్​ సాయంతోనే  మీ కారు డోర్లను లాక్​, అన్​లాక్​, స్టార్ చేయగలుగుతారు.

Also Read : Varun Gandhi : వరుణ్ గాంధీకి కాంగ్రెస్‌ ఆఫర్.. పార్టీలో చేరే ఛాన్స్ ?

ఈ ఆండ్రాయిడ్​ డివైజ్‌లలో పనిచేస్తుంది ​

  • లేటెస్ట్​ శామ్​సంగ్​ గెలాక్సీ ఆండ్రాయిడ్​ మొబైల్​ ఉంటే అందులోని శామ్​సంగ్​ వాలెట్ సాయంతో ఈ డిజిటల్​ కీ ఫీచర్​ను వాడొచ్చు.
  • ఇతర ఆండ్రాయిడ్​ ఫోన్లు ఉన్నవారు గూగుల్​ వాలెట్ యాప్​ను ఇన్​స్టాల్​ చేసుకొని డిజిటల్ కార్​​ కీ ఫీచర్​ను ఆస్వాదించవచ్చు.
  • పిక్సల్​ 6 వెర్షన్స్, లేటెస్ట్​ పిక్సెల్​ 8 ప్రో, పిక్సెల్​ ఫోల్డ్, శామ్​సంగ్​ గెలాక్సీ S21+, ఆపై వచ్చిన మోడల్స్​లో డిజిటల్​ కీ ఫీచర్​ పనిచేస్తుంది.
  • కొన్ని కార్ల కంపెనీలు మాత్రమే డిజిటల్​ కీ ఫీచర్​ను తెచ్చాయి.

ఎలా పని చేస్తుంది?

  • డిజిటల్​ కీ ఫీచర్​తో కారును లాక్ లేదా అన్ లాక్ చేయడానికి మీ ఫోన్‌ను కారు తలుపుల దగ్గర ఉంచాలి. ఇంజిన్‌ను ఆన్ చేయడానికి మీరు దానిని కారు కీ రీడర్‌పై ఉంచాలి.
  • డిజిటల్​ కీ ఫీచర్‌లోని యూడబ్ల్యూబీ (నియర్​ ఫీల్డ్​ కమ్యునికేషన్​ లేదా అల్ట్రా-వైడ్​ బ్యాండ్​)  టెక్నాలజీని మీరు వాడుకుంటే.. జేబులో నుంచి ఫోన్​ బయటకు తీయకుండానే కారుకు దగ్గరగా లేదా దూరంగా వెళ్లినప్పుడు ఆటోమేటిక్‌గా అన్​లాక్​, లా క్అయిపోతుంది. అంతేకాదు.. కారులోపలికి అడుగుపెట్టగానే కారు కీ రీడర్‌ సాయం లేకుండానే ఇంజిన్​ను ఆన్​ చేసుకోవచ్చు.
  • దారిలో అనుకోకుండా మీ ఫోన్​ పోయినా లేదా డ్యామేజ్​ అయినా మీ వెంట తీసుకెళ్లే తాళం మీకు ఉపయోగపడుతుంది.
  • మీ డిజిటల్​ కారు కీ సంబంధించిన యాక్సెస్​ వివరాలను మీ స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులతోనూ షేర్​ చేసుకోవచ్చు.
  • మీరు మరింత సేఫ్టీ కోసం Google Wallet సెట్టింగ్స్​లో పాస్సివ్​ ఎంట్రీని టర్న్ ఆఫ్ చేయొచ్చు. ​డిజిటల్​ కార్​ కీ కోసం ఓపెన్​ చేసే స్క్రీన్​కు పాస్​వర్డ్స్​ లాక్​ లాంటివి పెట్టుకోవచ్చు.

Also Read : Bridge Collapse : నౌక ఢీకొట్టడంతో కుప్పకూలిపోయిన బ్రిడ్జి


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2024 new cars
  • Digital Car Key

Related News

    Latest News

    • India: హాకీ ఆసియా కప్.. ఫైన‌ల్‌కు చేరిన భార‌త్‌!

    • Lunar Eclipse: చంద్ర‌గ్ర‌హ‌ణం రోజున‌ గర్భిణీలు చేయాల్సినవి, చేయకూడనివి ఇవే!

    • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

    • Aligned Partners: ట్రంప్ కొత్త వాణిజ్య విధానం.. ‘అలైన్డ్ పార్టనర్స్’కు సున్నా టారిఫ్‌లు!

    • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

    Trending News

      • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

      • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd