Hyderabad Steel Bridge : హైదరాబాద్ స్టీల్ బ్రిడ్జి ప్రారంభమైంది.. ఎలా ఉందో చూడండి
Hyderabad Steel Bridge : దక్షిణ భారతదేశంలోనే అత్యంత పొడవైన (2.62 కిలోమీటర్లు) మొదటి స్టీల్ బ్రిడ్జ్ హైదరాబాద్ లోని ఇందిరా పార్క్- వీఎస్టీ మార్గంలో అందుబాటులోకి వచ్చింది.
- By Pasha Published Date - 01:02 PM, Sat - 19 August 23

Hyderabad Steel Bridge : దక్షిణ భారతదేశంలోనే అత్యంత పొడవైన (2.62 కిలోమీటర్లు) మొదటి స్టీల్ బ్రిడ్జ్ హైదరాబాద్ లోని ఇందిరా పార్క్- వీఎస్టీ మార్గంలో అందుబాటులోకి వచ్చింది. మెట్రో ట్రైన్ రూట్ పైనుంచి నిర్మించిన ఈ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ శనివారం ఉదయం ప్రారంభించారు. మాజీ మంత్రి “నాయిని నర్సింహారెడ్డి” పేరు పెట్టిన ఈ వంతెన ఇందిరా పార్క్ చౌరస్తా నుంచి ఆర్టీసీ బస్ భవన్ సమీపంలోని VST చౌరస్తా వరకు ఉంటుంది. తద్వారా ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్, వీఎస్టీ జంక్షన్లలో ఏర్పడే ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందిరా పార్క్- వీఎస్టీ మార్గంలో రోజుకు లక్ష వాహనాలకుపైనే తిరుగుతుంటాయి. ఇంతకుముందు తెలుగుతల్లి ఫ్లై ఓవర్ మీది నుంచి వచ్చే వాహనాలు ఓయూ, నల్లకుంట వెైపు వెళ్లాలంటే 30 నుంచి 40 నిమిషాలు పట్టేది. ఈ వంతెనపై ఇప్పుడు ఐదే నిమిషాల్లో ప్రయాణం పూర్తి అవుతుందని అధికారులు అంటున్నారు.
Good Morning Friends 😍❤️
Minister @KTRBRS will inaugurate the Naini Narsimhareddy Steel Bridge today#SteelBridge #Hyderabad #KTR pic.twitter.com/UzRW03wQ3M— Latha (@LathaReddy704) August 19, 2023
స్టీల్ బ్రిడ్జ్ (Hyderabad Steel Bridge )విశేషాలు..
- ఈ బ్రిడ్జి కోసం 12, 316 మెట్రిక్ టన్నుల ఉక్కు వినియోగించారు.
- 81 స్టీల్ పిల్లర్లు, 426 ఉక్కు దూలాలు వినియోగించారు.
- కాంక్రీట్ 60- 100 ఏళ్లు, స్టీల్ 100 ఏళ్లకు పైగా మన్నికగా ఉంటుందని ఇంజినీర్లు చెబుతున్నారు.
- రూ.450 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జిని జీహెచ్‌ఎంసీ నిర్మించింది.