HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Kcrs Investigation Concluded Pc Ghosh Commission Questioned Him For 50 Minutes

KCR : ముగిసిన కేసీఆర్‌ విచారణ..50 నిమిషాలు ప్రశ్నించిన పీసీ ఘోష్ కమిషన్

ఆయనను 115వ సాక్షిగా విచారించడం గమనార్హం. విచారణలో భాగంగా కమిషన్‌ కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన, నిర్మాణ తీరుపై వివిధ ప్రశ్నలు సంధించింది. ప్రాజెక్టు ఆరంభం నుంచి తీసుకున్న కీలక నిర్ణయాలు, బ్యారేజీల నిర్మాణ సమయంలో ఎదురైన సాంకేతిక సమస్యలు, వాటికి అందించిన పరిష్కారాలు, నిధుల వినియోగం వంటి అంశాలపై సమగ్రంగా వివరణ కోరింది.

  • By Latha Suma Published Date - 01:31 PM, Wed - 11 June 25
  • daily-hunt
KCR
KCR

KCR : రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ విచారణలో కీలక మలుపు తలెత్తింది. బీఆర్కే భవన్‌లో న్యాయ విచారణ కమిషన్‌ ఎదుట భారతీయ రాష్ట్ర సమితి అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్‌) విచారణ ముగిసింది. సుమారు 50 నిమిషాల పాటు జస్టిస్‌ పీసీ ఘోష్‌ నేతృత్వంలోని కమిషన్‌ కేసీఆర్‌ను ప్రశ్నించింది. ఆయనను 115వ సాక్షిగా విచారించడం గమనార్హం. విచారణలో భాగంగా కమిషన్‌ కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన, నిర్మాణ తీరుపై వివిధ ప్రశ్నలు సంధించింది. ప్రాజెక్టు ఆరంభం నుంచి తీసుకున్న కీలక నిర్ణయాలు, బ్యారేజీల నిర్మాణ సమయంలో ఎదురైన సాంకేతిక సమస్యలు, వాటికి అందించిన పరిష్కారాలు, నిధుల వినియోగం వంటి అంశాలపై సమగ్రంగా వివరణ కోరింది. విచారణ అనంతరం కేసీఆర్‌ బీఆర్కే భవన్‌ ఎదుట వేచి ఉన్న అభిమానులు, పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ కారులో బయటకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కూడా ఉన్నారు.

Read Also: Pakistan : ఆపరేషన్‌ సిందూర్‌ ఎఫెక్ట్‌..రక్షణ బడ్జెట్‌ భారీగా పెంచిన పాక్‌..!

కమిషన్‌ గత కొన్ని నెలలుగా విచారణను వేగంగా కొనసాగిస్తోంది. ఇప్పటికే పలు శాఖల అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు విచారణకు హాజరైపు, అఫిడవిట్లు సమర్పించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన సీపేజ్ సమస్యలపై ప్రాజెక్టు నాణ్యతపై అనేక అనుమానాలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో 2024 మార్చిలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పీసీ ఘోష్‌ నేతృత్వంలో న్యాయ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్‌ ఇప్పటివరకు నీటిపారుదల, ఆర్థిక శాఖలతో పాటు సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్ విభాగాలకు చెందిన అధికారులను విచారించి, వారి నుండి వివరాలు సేకరించింది. అదే సమయంలో నిర్మాణ సంస్థల ప్రతినిధుల నుంచి అఫిడవిట్లు తీసుకొని, అవసరమైన సందర్భాల్లో వారిని క్రాస్‌ ఎగ్జామినేషన్‌కు కూడా పిలిపించింది.

ఇటీవలే కమిషన్‌ మాజీ మంత్రులు ఈటల రాజేందర్‌, హరీశ్‌రావులను కూడా విచారించింది. తాజా పరిణామంలో కేసీఆర్‌ విచారణ పూర్తవడం కీలకమైన దశగా మారింది. విచారణ తీరును బట్టి, కమిషన్‌ తుది నివేదిక కోసం వేచి చూడాల్సిందే. రాష్ట్ర ప్రాజెక్టులపై ప్రజాధనం వినియోగంపై పారదర్శకత, బాధ్యతాయుతమైన పాలనకు ఇది ఒక ఉదాహరణగా నిలవనుంది. ఈ విచారణలో వచ్చిన ఫలితాలు, తుది నివేదిక ఎలా ఉండబోతుందన్నదే ప్రస్తుతం రాజకీయ, సామాజిక వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. ఇక, ఈ రోజు ఉదయం 11 గంటలకు బీఆర్కే భవన్‌లో జరిగే పీసీ ఘోష్ విచారణకు కేసీఆర్ హాజరయ్యారు. ఆయన్ని కమిటీ హాల్‌లోకి తీసుకెళ్తే తనకు వేరుగా విచారించాలని రిక్వస్ట్ చేశారు కేసీఆర్. ఆయన అభ్యర్థనను ఘోష్‌ అంగీకరించారు. మిగతా నాయకులను బయటకు పంపేశారు. కేసీఆర్‌ను ఓ రూమ్‌లో ఉంచి ప్రశ్నలు అడిగినట్టు సమాచారం అందుతోంది.

Read Also: Barla Srinivas : మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత బహిష్కరణ

 

 

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BRK Bhavan
  • brs party
  • kaleshwaram project
  • Kaleshwaram project inquiry
  • kcr
  • PC Ghosh Commission

Related News

    Latest News

    • Chinese Physicist Chen-Ning Yang: నోబెల్ అవార్డు గ్రహీత కన్నుమూత!

    • Air India: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. ఇట‌లీలో చిక్కుకున్న ప్ర‌యాణీకులు!

    • No Kings Protests: ట్రంప్‌కు బిగ్ షాక్‌.. రోడ్డెక్కిన వేలాది మంది ప్ర‌జ‌లు!

    • ‎Money Plant: ఏంటీ.. మనీ ప్లాంట్ ఇంట్లో పెంచడం వల్ల ఏకంగా అన్ని లాభాలా?

    • ‎Hair Growth: ఈ ఒక్క పువ్వుతో మీ జుట్టు గడ్డిలా ఏపుగా పెరగడం ఖాయం.. ఇంతకీ ఆ పువ్వు ఏదో తెలుసా?

    Trending News

      • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd